ఊర్లో అతడు పెద్ద షావుకారి సంప్రదాయ వ్యాపారం , ఒకసారి ఒక మిత్రుడు అతడిని ఒక ఫంక్షన్ కి ఆహ్వానించాడు అది ఫైవ్ స్టార్ హోటల్ లో జరుగుతున్న కార్యక్రమం , తను వెళ్లాలి అనుకోని బయలుదేరాడు , తన ముందు ఉన్న పదిమంది ని ఎలాంటి అభ్యంతరం లేకుండా లోపలికి ఆహ్వానించిన హోటల్ సిబ్బంది తనను మాత్రం అడ్డుకున్నారు లోపలికి వెళ్లకుండా ఆపేశారు , కారణం తాను పంచలో ఆ ఫంక్షన్ కి వెళ్ళాడు కాబట్టి , అలాంటి వాళ్ళను లోపలికి అనుమతించకూడదు అని హోటల్ మేనేజ్మెంట్ ఆదేశం ఉంది అని ఆ హోటల్ సిబ్బంది వ్యక్తి చెప్పాడు , ఆ విషయం విన్న ఆ పంచ కట్టులో ఉన్న ఆ వ్యక్తి మనసులో అనుకున్నాడు , ఏ పంచెను అయితే మీరు చిన్న చూపు చూశారో .... అదే పంచెను బ్రాండ్ చేసి చూపిస్తా అనుకొని అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాడు , అతని ఆ సంకల్పం అనంతర కాలంలో రామ్ రాజ్ కాటన్ గా ఉద్భవించింది .... ఆయన పేరు నాగరాజన్ తమిళనాడుకు చెందిన అతడి పూర్వికులు రాయలసీమ నుంచి అక్కడికి వలస వెళ్లిన వాళ్లు...
నీతి ; కొన్ని అవమానాలు కోపం లేదా బాధ పుట్టించకుండా ఆలోచనలను పుట్టిస్తే ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి...🌹😄👍
*************
No comments:
Post a Comment