Wednesday, January 15, 2025

 శ్రీ మూక పంచశతి:
శ్రీ మూకశంకర విరచిత 
మూక పంచశతి
శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన
స్తుతి శతకం
🙏🌸🙏🙏🙏🌸🙏
 
శ్లోకము:-
*దంతాదంతిప్రకటనకరీ దంతిభిర్మందయానైః*
*మందారాణాం మదపరిణతిం మథ్నతీ మందహాసైః||*
*అంకూరాభ్యాం మనసిజతరోః అంకితోరాః కుచాభ్యాం*
*అంతః కాంచి స్ఫురతి జగతాం ఆదిమా కాపి మాతా||79||*
 
భావము:
మెల్లనినడకలతో ఏనుగులతో పోటీని ప్రకటింపజేయుచున్నదై ( సవాలు చేయుచు) చిరునవ్వుతో మందారపుష్పముల మదపరిపాకమును మధించుచున్నదై మన్మధుడను వృక్షమునునకు అంకురములైన స్థనములతో ముద్రితమైన వక్షస్సుగలదై జగత్తులకు మూలమైన ఒకానొక తల్లి ( జగన్మాత) కాంచీనగర మధ్యమందు ప్రకాశించుచున్నది;
 
శ్లోకము:-
*త్రియంబకకుటుంబినీం త్రిపురసుందరీం ఇందిరాం*
*పుళిందపతిసుందరీం త్రిపురభైరవీం భారతీమ్|*
*మతంగకులనాయికాం మహిషమర్దనీం మాతృకామ్*
*భణంతి విబుధోత్తమా విహృతిమేవ కామాక్షి తే||80||*
 
భావము:
ఓ కామాక్షీ! నీయొక్క విహారమునే పండితోత్తములు శివుని పత్నినిగాను, త్రిపురసుందరినిగాను, లక్ష్మినిగాను, వేటగాని ఇల్లాలిగాను, త్రిపురభైరవిగాను, సరస్వతినిగాను, మాతంగినిగాను, మహిషాసురమర్ధినిగాను, మాతృకావర్ణమాలగాను చెప్పుచున్నారు;
 
🔱 ఆ తల్లి 
పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱 
🙏🌸🌸🌸🌸🌸🙏.           

No comments:

Post a Comment