Tuesday, January 14, 2025

*ఆచార్య సద్బోధన:* *మానవజన్మ సార్థకతకు - మార్గం!*

 🕉️ ఓం నమః శివాయ 🕉️
    
🙏 శివాయ గురవే నమః 🙏      

*ఆచార్య సద్బోధన:*
              
*మానవజన్మ సార్థకతకు - మార్గం!*
```
“ఏదో ఒక అవినాభావ సంబంధం ఉంటేనే ఒకరినొకరు కలుసుకుంటారు!”

ప్రత్యక్ష, పరోక్ష సంబంధం లేకుండా ఎవరూ ఎవరినీ కలుసుకోలేరు..!

కనుక మన వద్దకు ఎవరైనా వ్యక్తి లేదా, జంతువులు, పక్షులు లాంటి జీవులు వచ్చినపుడు వాటిని దయ దాక్షిణ్యాలు చూపకుండా పంపివేయడం లేదా కసురుకోవడం గానీ చేయకూడదు అని చెబుతున్నారు.

మన శక్తి మేరకు మీరు చేయగలిగిన సహాయం చేయాలి. 

ఆ విధముగానైనా మనకు సేవ చేసే అవకాశం భగవంతుడు కల్పించాడని భావించి, సేవ చేయాలి.

దేవుణ్ణి ప్రేమించడం, సేవించడం అంటే లోకమును ప్రేమించి, సేవించడమే అని మనం తెలుసుకోవాలి.

“ప్రేమ, సేవల ద్వారానే మన జన్మలు ధన్యం అవుతాయని గ్రహించి ఆ ప్రకారం నడుచుకోవాలి! - అప్పుడే ఈ జన్మ సార్థకం అవుతుంది!”✍️```

🙏 *సర్వం శివమయం 
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🌷🌷🌷🌷🌷

No comments:

Post a Comment