*జీవితం ఓ పెద్ద అబద్ధం.....*
*ఈ భూమి మీద మనలను ఎన్ని రోజులు ఉంచుతుందో తెలియదు. ఎలా ఉంటుందో... ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి అర్థం కాదు.*
*అందులో ప్రేమ అనేది ఓ మైకం. తలకెక్కిన మత్తు వీడేదాకా... ముచ్చట్లతో మురిపించి ముప్పతిప్పలు పెట్టి రంగు కాగితంతో చిందులేపించి చితిలో దాకా నడిపిస్తుంది.*
*మనకున్న స్నేహం ఓ నీడ. వెలుతురున్నంత వరకు వెంటాడుతూ ఉంటుంది. చీకటి (మనదగ్గర ఏమి లేనప్పుడు) రాగానే కనుమరుగు అవుతుంది.*
*మన చుట్టూ ఉన్న సమాజం ఓ నాటక రంగం. నవరసాలు పండించి నిట్టనిలువునా ముంచేస్తారు ఈ నటులు. అయినా బ్రతకాలనే కోరికలతో బాధల బంధికానలో బలౌతునే... మన జీవనం సాగిస్తాం.*
*తప్పదు మరి. ఆఖరి పిలుపు వచ్చేవరకు. నటించే సమాజం ముందు. మనము నటిస్తూ... రాని నవ్వుని ముకాన తగిలించుకుని ఈ గ్యారెంటీ లేని బతుకు బతకడమే...*
*🌹మిత్రులకు శుభోదయం.🌹*
🙏😊🙏 😊🙏😊 🙏😊🙏

No comments:
Post a Comment