Tuesday, January 14, 2025

 @ ఆత్మానందం @

చదవడం ఇష్టం నాకు
నే చదివిన పుస్తకం గురించి
నలుగురిలో మాట్లాడడం ఇంకా ఇష్టం నాకు

నా మాటలు విని 
ఆ పుస్తకం చదవాలని 
అనుకునే వారి చెంతకు
ఆ పుస్తకాన్ని చేరవేయడం 
మరీ మరీ మరీ ఇష్టం నాకు

నేనేదో గొప్ప సాహితి సేవ చేసేస్తున్నాననే
వెర్రి భ్రమలు లేవు నాకు

పుస్తకాలు కొంటున్నావు
ఆ పుస్తకాలు తిరిగి అమ్ముతున్నావు
అసలు ఏమొస్తుంది నీకు దీనివల్ల
అని విసుక్కుంటున్నారు ఇంట్లోని వాళ్ళు

కాసుల వెనుక
పరుగులు తీసే ఈ యాంత్రిక లోకంలో
నాలుగు అక్షరాలకై ఆరాటపడే నాలాంటి మరికొందరు ఉన్నారంటే ... ఆనందం కాదా మరి

హంగులు ఆర్భాటాలు
ప్రదర్శించే ఈ నాగరిక ప్రపంచంలో
అనుభవాల భావాల అనుభూతుల పత్రహరితంకై
అన్వేషించే నా లాంటి మరికొందరు ఉన్నారంటే .... చెప్పలేనంత మనోబలమే కదా మరి

ఏమొస్తుంది నాకు దీని వల్ల
ఏ మనిషికైనా అంతిమ లక్ష్యం ఆనందం
అదిగో అటువంటి అంతులేని ఆనందం ఒనగూడుతుంది నాకు ఈ పనిలో మరి.

- రత్నాజయ్ (పెద్దాపురం)

No comments:

Post a Comment