*_ఎగిరేవన్నీ ఆకాశానికి చేరవు... ఎవరో ఏదో అన్నారని నువ్వు చేతకాని వాడివి కావు..._*
*_జరిగేది జరగనివ్వు, జీవితాన్ని ఒక ప్రవాహంలో వెళ్లనివ్వు రావాల్సిన సమయంలో సరైన మలుపు ఖచ్చితంగా వస్తుంది..._*
*_చేరుకుంటా అనుకుంటూ ఆలస్యం చెయ్యకు, చేరుకోలేను అనుకుంటే మాత్రం ఆలోచన చెయ్యకు..._*
*_తన గురించి బాధపడమని ఏ గతం చెప్పదు. భయపడమని ఏ భవిష్యత్తు అడగదు..._*
*_నిరాశ, నిస్ప్రూహలను వదిలి... ఆశావాదిగా బ్రతుకు సమరంలో ముందుకు సాగు..._*
*_నిరాశ నీ వల్ల కాదు వదిలే య్ అంటుంది. ఆశ సాదిస్తావు ఇంకో అడుగు వేయి అని అడుగుతుంది..._*
*_ఏదో చేయాలి, ఏదో సాధించాలి అని అనుకుంటాం కానీ, గెలుద్దాం అనుకుంటే కొంతమంది నమ్మరు అలాగే ఎవ్వరూ తోడు రారు అందుకే నీకు ఎవ్వరు అవసరం లేదు..._*
*_గెలిచినా ఓడినా... పరిస్థితులు దారుణమైనా... ఒక్కరిలో ఒక్కడిగా పోరాడగలిగే సత్తా సామర్థ్యం నీలో ఉంది అది గుర్తించు._*
*_మిత్రమా... ఒక్కమాట... ఒక్కటి గుర్తుపెట్టుకో... బద్ధకం వదిలేసిన రోజు నుండే బ్రతకడంలో మార్పు మొదలవుతుంది..._*
*_జీవితంలో చాలా సార్లు మనవల్ల కాదు వదిలేద్దాం అనిపిస్తుంది కానీ, వదిలేయాల్సింది ఆ ఆలోచనలు మాత్రమే బాగా గుర్తుపెట్టుకో..._*
*_గతాన్ని మరువడమే అతిపెద్ద గెలుపు.. నీవనుకున్నది కచ్చితంగా సాధించాలంటే ఇప్పుడే, ఈ క్షణమే... నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టు.☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🦚🦚🦚 🪷🙇🪷 🦚🦚🦚
No comments:
Post a Comment