*🙏వినాయకుని విగ్రహం నేర్పే నీతి...!!*
🌸మహాగణపతి..సకలవేదాల సారం, ఉపనిషత్తుల అంతరార్థం, సర్వ పురాణాల సంక్షిప్తరూపం, ఏనుగుతల నుంచి ఎలుక వాహనం వరకూ... ఆ అపురూప రూపమంతా ప్రతీకాంతమే..
🌿పెద్ద తలతో గొప్పగా అలోచించమని, గొప్ప ఆలోచనతోనే గొప్ప ఆచరణ.. గొప్ప ఆచరణ ద్వారానే.. గొప్ప విజయాలు..
🌸పాతాళం వైపు చూస్తూ ఆకాశాన్ని అందుకోలేం..ఆకాశాన్ని చేరుకోవాలంటే ఆకాశమంత..ఉన్నతంగానే ఆలోచించాలి.
🌿చిన్న కళ్ళు.. చూపు లక్ష్యం వైపే ఉండాలన్న సత్యాన్ని నర్మగర్భంగా చెబుతాయి. పెద్దకళ్లకు చంచలత్వం ఎక్కువ., ఎటుపడితే అటు తిరిగేస్తుంటాయి. చిన్ని కళ్లకు ఆ అవరోధాలేం ఉండవు. గురి చుట్టూ గిరిగీసుకుంటాయి.
🌸చేట చెవులు..నలుదిక్కుల విజ్ఞానం నా వైపు ప్రసరించు గాక అని ప్రార్థిస్తారు వేదర్షులు..ఆ అపౌరు షేయ వాక్యానికి ప్రతీక ఈ ఏనుగు చెవులు...
🌿బుల్లి నోరు.. నోరు (మాట తీరు) పెద్దదైతే బుద్ధి చిన్నదవుతుంది.. నోరు చిన్నదైతే బుద్ధి పెద్దదవుతుంది. గణపతి సుముఖుడు అనీ అంటారు. ఆ మాటకు ముద్దుమోము వాడనే కాదు, ముచ్చటైన మాటతీరు కలవాడనీ అర్ధం.
🌸ఏనుగు నోరు చిన్నది ఆ నోటిని కూడా.., తొండం కప్పేసి ఉంటుంది. తొండం వివేకానికి గుర్తు. వివేకపు వడపోత తర్వాతే ప్రతి మాట నోటి నుంచి వెలువడాలన్న అంతర్లీన సందేశమిది..
🌿ఇలా మన సంప్రదాయాలను నిశితంగా గమనిస్తే ప్రతీ కార్యంలో ఓ అర్థం దాగి ఉంటుంది...స్వస్తి....🚩🌞🙏
No comments:
Post a Comment