[7/15, 16:06] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*
గుణయుతునకు మేలు గోరంత చేసిన
కొండయగును వాని గుణము చేత
కొండయంత మేలు గుణహీనుడెఱుగునా?
విశ్వదాభిరామ వినురవేమ!
*భావం:-*
గుణవంతునికి ఒక చిన్న సహాయం చేసినా కూడ పెద్దదిగా భావించి కృతఙతాభావంతో ఉంటాడు. అది అతని సహజగుణం. కాని చెడ్డ గుణం కలవారికి ఎంత సహాయం చేసినా పట్టించుకోనట్లే ఉంటారు. అటువంటి వారికి ఏవిధమైన సహయము చేసినా మనమే భాద పడాలి.
[7/15, 16:06] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*
*ఉత్తముడు చేతల్లో చురుగ్గావుంటాడు. అధముడు మాటల్లో చురుగ్గా వుంటాడు.*
[7/15, 16:06] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*
*ఎందుకని❓*
కోయిల పాడేది ఎందుకని?
పాటలు బాగా పాడమని
కోడి కూసేది ఎందుకని?
వేకు జామున లేవమని.
చీమలు నేర్పేదేమిటని?
రేపటి కోసం దాచమని.
కాకులు చెప్పేదేమిటని?
కలసికట్టుగా ఉండమని.
*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
[7/15, 16:06] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*
*అడిగేవాడికి చేప్పేవాడు లోకువ*
ఎవరైనా ఎవరిని అయినా ఎదైనా అడిగితే వారు చెప్పేటప్పుడు వీడు నాకు చెప్పేదేంటి అనే భావన ఉంటుంది. అందుకే అడిగేవాడికి చెప్పే వాడు లోకువ అంటారు.
[7/15, 16:06] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*
*ఒళ్ళో పెట్టటం*
స్వాధీన పరచటం
చేతుల్లో పెట్టటం
*ఒళ్లు మండు తున్నది*
చాల కోపంగా వున్నదని అర్థం:
ఉదా: వాన్ని చూస్తుంటే నాకు వళ్లు మండు తున్నది.
[7/15, 16:06] +91 79819 72004: *✍🏼 నేటి కథ ✍🏼*
*నులుగురూ నలుగురే*
ఒక చెవిటాయన కాడెద్దులు తోలుకుని దారెంబడి పోతూండగా, ఇంకొకాయన ఎదురొచ్చి అడిగాడు, "చిన్నపల్లికి ఏ దారి పోతుందన్నా?" అని.
ఎద్దులాయనకు వేరే ఏదో వినిపించింది. ఆయన చెప్పాడు, " ఎర్రెద్దేమో ఎనిమిది నూర్లు, పసెద్దేమో పది నూర్లు" అని.
బాటసారి మళ్ళీ అడిగాడు, దారి విషయం.
ఎద్దులాయన మళ్ళీ చెప్పాడు గట్టిగా: "చూడయ్యా! నీ కిష్టమైతే కొను. లేకపోతే ఫో. నేను అంతకంటే పైసా కూడా తగ్గేదే లేదు!" అని.
అప్పటికి ఆ బాటసారికి పరిస్థితి అర్థమైంది. ఇక అతను వెనక్కు చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
చెవిటాయన ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఆయన సంగతి తెలిసిన భార్య ఆయన మీదకి ఒక గులకరాయిని విసిరింది. అన్నానికి రమ్మన్నట్టు సైగ చేసి పిలిచింది.
అతను భోంచేస్తూ నవ్వుకుంటుండగా, భార్య చెయ్యి ఊపి సైగ చేస్తూ అడిగింది, "ఏమిటండీ? ఒక్కరే నవ్వుతున్నారు?" అని.
ఆయన అన్నాడు, " దారిలో ఒకాయన ఎద్దులు బేరమాడాడులే. ధర చెప్పగానే మాయమయ్యాడు అక్కడినుండీ. ఊరకనే వస్తాయా ఏమిటి మరి?" అని.
ఆ భార్యామణికీ చెవుడే. ఆమెకు భర్త జవాబు వేరేగా వినిపించింది. ఆమె చేతులు ఊపుకుంటూ అన్నది " అయ్యో! నేను కాదండీ పప్పులోకి ఉప్పు వేసింది. అత్తయ్యగానీ వేసారో ఏమో" అని.
అప్పుడు చెవిటాయన కూడా చేతులూపుతూ " ఆ మాత్రం నాకు తెలీదా ఏమిటి? నువ్వు నాకు అంతగా చెప్పాల్సిన పనేమీలేదులే. అడిగినంతకే ఇవ్వడానికి నేనేమైనా పిచ్చి వెధవనా ఏమిటి?" అన్నాడు తల ఎగరేస్తూ.
భార్య మళ్ళీ అన్నది, "అయ్యో నిజంగా నేనుకాదండీ! మీ అమ్మగారే... నన్ను నమ్మండీ!" అని.
చెవిటి భర్త అన్నాడు విసుక్కుంటూ: "అబ్బా! ఒకసారి చెప్పావుగా నాకు అర్థమైందిలే ఇక" అని.
భార్య నొచ్చుకుంటూ అన్నది: " చూడండీ! నేను కాదని చెప్తూనే ఉన్నాను కదా? కావాలంటే మీ అమ్మను అడుగుదురు, రండి" అని వాళ్ళ అమ్మ దగ్గరకు లాక్కెళ్ళింది: "ఏమండీ అత్తగారూ? పప్పులోకి ఉప్పు వేసింది నేను కాదనీ, మీరేననీ ఈయనకు కాస్త చెప్పండీ!" అని చేతులూపుతూ అన్నది.
అత్తగారు కూడా చెవిటివారే. ఆవిడ అన్నారు: "ఆ... ఏమిటీ! నేనెప్పుడు పోయానే సినిమాకి? ఈ వయసులో నాకింకా సినిమాలూ, షికారులూనా? ఒరేయ్ అబ్బాయీ! నువ్వేమీ దీని మాటలు నమ్మొద్దురా! కావాలంటే మీ నాన్నను అడుగుదువు, రా" అని వాళ్ళ నాన్న దగ్గరికి లాక్కెళ్లింది.
ముసలావిడ ఆయన్ని అడిగింది ఆవేశంతో ఊగిపోతూ. " ఏమండీ, చూడండీ! నేను సినిమాకు వెళ్ళానట. ఇది నాపైన వాడికి లేనిపోనివన్నీ చెబుతున్నది. ఏ ఒక్క రోజైనా నేను సినిమాకి వెళ్ళానా? మీరే చెప్పండి!" అంది చూపుడు వేలిని ఊపుతూ.
ముసలాయనా ఏమీ తక్కువ తినలేదు. ఆయనన్నాడు: " ఆ! ఏమిటీ, ఒక్క గింజకూడా మిగల లేదా? ఏమో మరి! నాకేం తెలియదు. నువ్వు పెట్టిన చిప్పడు గుగ్గిళ్ళే తినలేక తిన్నాను నేను. ఇక మిగిలిన వాటితో నేనేం చేసుకోను? నేనేం తినలేదు నిజం!" అన్నాడు నిజాయితీగా!!
[7/15, 16:06] +91 79819 72004: *✅తెలుసు కుందాం✅*
*🟥నోట్లోంచి ఆ పొగలేంటి?*
🟩అవి పొగలు కావు. పైగా ప్రతి ఉదయం అలా జరగదు. కేవలం శీతాకాలంలో బాగా చలిగా ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది. మనం మాట్లాడుతున్నప్పుడు శ్వాసప్రక్రియలో నిశ్వాసాన్ని (exhalation) వదులుతాము. అంటే మాటలతో పాటు ఊపిరితిత్తుల నుంచి గాలి కూడా బయటపడుతుందన్నమాట. ఏ కాలమైనా మన శరీర ఉష్ణోగ్రత మాత్రం 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్ (సుమారు 37 డిగ్రీల సెంటిగ్రేడు) దగ్గర స్థిరంగా ఉంటుంది. శీతకాలంలో మన నోటి లోంచి బయటకి వచ్చే గాలిలో నీటి ఆవిరి ఉంటుంది. బయటి ఉష్ణోగ్రత బాగా తక్కువగా ఉండడం వల్ల ఆ నీటి ఆవిరిలో చాలా భాగం వాయు స్థితి నుంచి ద్రవస్థితికి మారుతుంది. ఆ క్రమంలో నీటి ఆవిరిలోని అణువులు సూక్ష్మబిందువులుగా తుంపరగా మారతాయి. వాటి మీద సూర్యకాంతి పడి, అది అన్ని వైపులకు విక్షేపణ (scattering) చెందుతుంది. అందువల్లనే అది పొగలాగా కనిపిస్తుంది. ఐసుగడ్డ మీద పొగలున్నట్టు కనిపించడం, జెట్ విమానం వెనుక పొగ కనిపించడానికి కూడా కారణం ఇదే.
No comments:
Post a Comment