Sunday, July 20, 2025

 [7/17, 16:35] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*


*కక్కుర్తి వెధవ*


అన్నింటిని ఆశించేవాడు. అలాంటి వారిని గురించి ఈ మాటను వాడతారు. ఆబగా అన్నం తినే వారిని ఉద్దేశించి కూడా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
[7/17, 16:35] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*


*పసి పిల్లలు (బాలగేయం)*

పసి పిల్లల మనసులు
సుతిమెత్తని తీగలు
పాలవెల్లి వెలుగులు
పాలకడలి తరగలు

ఒలుకుతాయి ప్రేమలు
ప్రవహించును మమతలు
గుబాళించు సుమములు
దైవంతో సమములు

పసి పిల్లలు తారలు
జీవనది ధారలు
భువిని కరుణామయులు
ముద్దుల చిన్నారులు

శుద్ధమైన హృదయులు
గుణంలోన మాన్యులు
శ్రేష్ఠమైన బుద్ధులు
పంచదార సుద్దులు

సదనములో బాలలు
ప్రకాశించు భానులు
సాటిలేని వీరులు
కన్నవారి ఆశలు

పిల్లలున్న కళకళ
పలుకులు బహు గలగల
తారల్లా మిలమిల
పసిడి వోలె తళతళ

*---గద్వాల సోమన్న*
[7/17, 16:35] +91 79819 72004: *✍🏼 నేటి కథ ✍🏼*

*నక్క - కోడిపుంజు*


ఒకరోజున ఒక నక్క ఆకలితో మలమలమాడి పోతూ, ఎక్కడైనా
దొరకవచ్చునని అంతటా వెతుకుతోంది. అప్పుడు దానికొక కోడిపుంజు
కనిపించింది. కాని అది ఒక చెట్టుకొమ్మమీద కూర్చొని ఉంది. దాన్ని చూడగానే 
దానికి ఆకలి రెట్టింపైంది. ఏదో విధంగా ఆ పుంజును చంపి తినాలనుకొంది. మెల్లగా ఆ చెట్టువద్దకు వచ్చి "మిత్రమా! ఆకాశవాణి నుండి
 నిన్న ఒక వార్త విన్పించింది. ఇకమీదట జంతువులన్నీ కలిసి
స్నేహితుల్లాగ జీవించాలట. అందుచేత క్రిందకురా! మనమిద్దరం స్నేహితుల్లా మసలుకొందాం!" అంది.
ఆ జిత్తులమారి నక్క చెప్పేదాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు అందుచేత అది "అవును ఆ వార్త నేనుగూడా విన్నాను.” అంది. లోలోపల
కోడిపుంజు నక్కబారినుండి ఎలాతప్పించుకోవాలో ఆలోచిస్తోంది. చివరకు
ఇలా అంది. "అదిగో! నీ స్నేహితులెవరో యిటేవస్తున్నారు. వాళ్ళని కూడా రానీ అందరమూ కలిసి అప్పుడు పండుగ చేసుకొందాం!"

    “ఈదారిన వచ్చే నా స్నేహితులెవరూలేరే! ఇంతకూ ఎవరొస్తున్నా
అడిగింది నక్క.

       "వేటకుక్కలూ, వాటి స్నేహితులూ” జవాబిచ్చింది పుంజు.
వేటకుక్కలపేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణకడం మొదలెట్టి
కంటబడితే చావడం ఖాయం” అనుకొన్నది నక్క
"అలా భయంతో వణకిపోతున్నావెందుకు?" అని అడిగింది కోడిపుంజు.
అందుకు నక్క “వాళ్ళు బహుశా నిన్నటివార్త వినలేదేమో అనుకొంటా "
 అని పరుగెత్తి పారిపోయింది.

*నీతి :- మోసాన్ని మోసంతోనే జయించాలి*
[7/17, 16:35] +91 79819 72004: *✅తెలుసు కుందాం✅*


*హెయిర్ డ్రయ్యర్ ఎలా పని చేస్తుంది?*

జుట్టు ఆరబెట్టుకోవడానికి ఒకప్పుడు సాంబ్రాణి పొగ పట్టేవారు. ఇప్పుడు తడిజుట్టును తొందరగా ఆరబెట్టేందుకు ప్రస్తుతం హెయిర్ డ్రయ్యర్ ను ఉపయోగిస్తున్నారు. హెయిర్ డ్రయ్యర్ ఎలా పనిచేస్తుంది తెలుసుకుందాము:

1. తీగలో నుంచి విద్యుత్ ను ప్రవహింపచేసినప్పుడు తీగ వేడెక్కుతుంది. విద్యుత్ ప్రవాహంలోని ఈ గుణాన్ని "ఎలక్ట్రో థర్మల్ ఎఫక్ట్" అంటారు. ఎలక్ట్రిక్ హీటర్లు, బల్బు మాదిరిగానే హెయిర్ డ్రయ్యర్ కూడా ఇదే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. 

2.  డ్రయ్యర్ ఆకారం పిస్టల్ మాదిరిగా ఉంటుంది. దీని పైభాగం ప్లాస్టిక్ తో తయారై ఉంటుంది. దీని లోపల "నైక్రోమ్" అనే లోహంతో తయారైన తీగచుట్ట (కాయిల్) ఉంటుంది. దీనిలోకి విద్యుత్ ప్రవహించగానే వేడెక్కుతుంది. 

3. తీగ చుట్ట వెనుక భాగంలో ఒక చిన్న ఫ్యాన్ అమర్చబడి ఉంటుంది. ఫ్యాన్ కు, కాయిల్ కు రెండు వేర్వేరు స్విచ్ లు ఉంటాయి. ఒక స్విచ్ నొక్కగానే ఫ్యాన్ తిరుగుతూ బయట నుంచి గాలిని లోపలి తీగచుట్ట మీదకు విసురుతుంది . 

4. రెండో స్విచ్ నొక్కగానే తీగచుట్ట వేడెక్కి, వేడి గాలి డ్రయ్యర్ లో నుంచి బయటకు వస్తుంది. ఈ విధంగా హెయిర్ డ్రయ్యర్ జుట్టును ఆరబెడుతుంది.

No comments:

Post a Comment