Sunday, July 20, 2025

 .  *శ్రీకృష్ణభగవానుని లీలాసంగ్రహము*
*꧁❀❀━❀🙏🕉️🙏❀━❀❀꧂*
                *(1 వ భాగము)*

*కృష్ణునితో కలిసి స్వయంగా ఆధ్యాత్మికజగత్తును దర్శించగలిగిన అర్జునుడు అక్కడ నుండి తిరిగి వచ్చిన తరువాత విస్మితుడయ్యాడు. తాను సాధారణజీవుడే అయి నప్పటికిని శ్రీకృష్ణుని అనుగ్రహము వలన ఆధ్యాత్మికజగత్తును దర్శించడము. తనకు సాధ్యపడిందని అతడు తనలో తాను భావించాడు. అతడు ఆధ్యాత్మికజగత్తును చూడడమే కాకుండ భౌతికసృష్టికి కారణమైనట్టి అది మహావిష్ణువును కూడ స్వయంగా దర్శించగలిగాడు. శ్రీకృష్ణుడు ఏనాడును బృందావనమును విడిచి వెళ్ళడని చెప్పబడుతుంది. "బృందావనం పరిత్యజ్య పాదమేకం స గచ్ఛతి". శ్రీకృష్ణుడు మథురలో సర్వోత్కృష్టుడు, ద్వారకలో మరింత సర్వోత్కృష్ణుడు, బృందావనములో పరమ సర్వోత్కృష్టుడు అయియుంటాడు. ద్వారకలో శ్రీకృష్ణుని లీలలు ఆతని వాసుదేవాంశచే ప్రదర్శితమైనాయి. అయినా మథురద్వారకలలో ప్రకటమైనట్టి* *వాసుదేవాంశకు, బృందావనములోని శ్రీకృష్ణుని ఆదిరూపానికి భేదము లేదు. శ్రీకృష్ణుడు ఆవిర్భవించినపుడు అతని అవతారములు, ప్రధానాంశలు, కళలు అన్నీ కూడ అతనితో పాటు వస్తాయని ఈ గ్రంథ ఆరంభములోనే చెప్ప బడింది. ఈ విధంగా కొన్నిలీలలు స్వయంగా శ్రీకృష్ణునిచేగాక అతని విస్తారములచే ప్రకటమై ఉంటాయి.*

*ఆధ్యాత్మికజగత్తులోని కారణోదకశాయి విష్ణువును చూడడానికి శ్రీకృష్ణుడు వెళ్ళినందుకు అర్జునుడు ఎందుకు విస్మితుడయ్యాడనే విషయము శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుల వ్యాఖ్యానంలో పూర్తిగా చర్చించబడింది. దాని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మహావిష్ణువు శ్రీకృష్ణుని చూడడానికి పరమ ఆత్రుతతో ఉన్నట్లు అతని మాటలను బట్టి అర్థమైంది. అయినా మహావిష్ణువు బ్రాహ్మణుని పుత్రులను తీసికొనిపోయాడంటే అతడు ఆ పని చేయడానికి తప్పకుండ ద్వారకకు వెళ్ళే ఉండాలని చెప్పవచ్చును. అటువంటప్పుడు అతడు కృష్ణుని అక్కడే ఎందుకు చూడలేదు? కృష్ణుని అనుమతి లేకపోతే అతని దర్శనము కారణోదకశాయి. మహావిష్ణువుకైనా అసాధ్యమని దీనికి సమాధానము చెప్పవచ్చును. ఆ విధంగా మహావిష్ణువు బ్రాహ్మణుని పుత్రులను ఒకరి తరువాత ఒకరిని పురిటిలోనే తీసికొనిపోయాడు; వారిని తిరిగి తెచ్చుకోవడానికి శ్రీకృష్ణుడు స్వయంగా కారణోదకసముద్రానికి వెళ్ళినపుడు అతనిని మహావిష్ణువు చూడడము సాధ్య పడుతుంది. ఇదే నిజమైతే ఇంకొక ప్రశ్న తలెత్తుతుంది. అదేమిటంటే శ్రీకృష్ణుని చూడలేకపోయినపుడు మహావిష్ణువు స్వయంగా ద్వారకకు ఎందుకు వెళతాడు? బ్రాహ్మణపుత్రులను హరించడానికి తన అనుయాయులను ఆతడెందులకు పంప లేదు?! ? కృష్ణుని సన్నిధిలో ఏ ద్వారకావాసికైనా కష్టాలను కలుగజేయడము అత్యంత కఠినమనడము దీనికి సమాధానమౌతుంది. బ్రాహ్మణుని పుత్రులను అపహరించడము తన అనుయాయులలో ఎవ్వరికైనా అసాధ్యమే కనుక వారిని తీసికొనిపోవడానికి మహావిష్ణువే స్వయంగా వచ్చాడు...*

*ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడ తలెత్తుతుంది, అదేమిటంటే భగవంతుడు బ్రహ్మణ్య దేవుడని, అంటే బ్రాహ్మణులకు ఆరాధ్యదైవమని తెలియబడినాడు; అయితే ఒకరి తరువాత ఒకరిగా పదవపుత్రుని వరకు బ్రాహ్మణునికి తీవ్రమైన శోకాన్ని అతడు | ఎందులకు కలిగించాడు? మహావిష్ణువు శ్రీకృష్ణుని దర్శనానికై ఎంత ఆత్రుత పడినాడంటే ఒక బ్రాహ్మణునికి కష్టాన్ని కలిగించడానికైనా అతడు సంశయించ లేదనడం దీనికి సమాధానమౌతుంది. బ్రాహ్మణునికి కష్టము కలిగించడము నిషిద్ధ కార్యమేయైనా శ్రీకృష్ణుని చూడడము కొరకు మహావిష్ణువు ఏది చేయడానికైనా సంసిద్ధుడయ్యాడు. కృష్ణదర్శనానికై అతడు ఎంతో ఆరాటపడ్డాడు. ప్రతీపుత్రుని కోల్పోయినపుడు బ్రాహ్మణుడు ప్రాసాదద్వారము చెంతకు వెళ్ళి బ్రాహ్మణులకు రక్షణ కల్పించలేకపోయినందుకు రాజ్యసింహాసనానికి అనర్హుడంటూ రాజును నిందించేవాడు. క్షత్రియులను, శ్రీకృష్ణుని బ్రాహ్మణుడు నిందించడము మహావిష్ణువు ఉపాయమే. అపుడు బ్రాహ్మణుని పుత్రులను తీసికొనిపోవడానికి శ్రీకృష్ణుడు అతని దగ్గరకు వెళ్ళవలసియే వస్తుంది.*

*అయినా ఇక్కడ ఇంకొక ప్రశ్న తలెత్తుతున్నది. మహావిష్ణువు శ్రీకృష్ణుని చూడజాలకపోతే కేవలము బ్రాహ్మణుని పుత్రులను తీసికొని రావడానికి శ్రీకృష్ణుడు అతని దగ్గరకు వెళ్ళవలసిన అవసరమేమిటి? శ్రీకృష్ణుడు మహావిష్ణువు దగ్గరకు వెళ్ళినది బ్రాహ్మణపుత్రులను తీసికొనిరావడానికి గాక అర్జునుని కొరకే. యనడము దీనికి సమాధానమౌతుంది. అర్జునునితో అతని స్నేహము ఎంతో సన్నిహితమైనది. అర్జునుడు అగ్నిలో ప్రవేశించబోయినపుడు ఆ దేవదేవుడు అతనిని రక్షించగోరాడు. అయినా బ్రాహ్మణపుత్రులను వెనుకకు తీసికొనిరానిదే అర్జునుడు అగ్నిప్రవేశాన్ని మానేవాడు కాదు. అందుకే శ్రీకృష్ణుడు అతనితో "బ్రాహ్మణుని పుత్రులను నేను తీసికొనివస్తాను. నీవు ఆత్మహత్యకు పాల్పడవద్దు" అని అన్నాడు.*

💦🌸🌸 🌸🏵️🌸🌸🌸💦
*"శ్రీకృష్ణభగవానుని లీలాసంగ్రహము" అను దశమస్కంధములోని భక్తివేదాంతభాష్యము ఇంకా వుంది*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*☘️\!/సర్వం శ్రీకృష్ణార్పణమస్తు\!/☘️*

*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🪷🍁 🙏🕉️🙏 🍁🪷🍁

No comments:

Post a Comment