సమస్య :
వెనుక బెంచీలలో కూర్చునే విద్యార్ధులపై టీచర్ దృష్టి పెట్టకపోవడం !
వెనుక బెంచీలలో కూర్చునే విద్యార్థులు చదువులో మొద్దులు అనే అభిప్రాయం ఉండడం !
ఒక విద్య వేత్త 25 ఏళ్ళ నాడు సమస్యకు తెచ్చిన పరిష్కారం :
1 . వెనుక బెంచీల్లో కూర్చొనే వారు తక్కువ , ముందు బెంచీల్లో కూర్చొనే వారు ఎక్కువ అనే అభిప్రాయం సరి కాదు అని విద్యార్థులకు తెలియ చెప్పడం .
2 . బోర్డు పై రాసేటప్పుడు తప్పించి మిగతా సమయాల్లో టీచర్... గదిలో ముందుకు వెనుకకు కలియతిరుగుతూ ... ప్రతి విద్యార్థి పై దృష్టి పెడుతూ పాఠం చెప్పడం .
౩. వారానికి ఒక సారి సీటింగ్ మార్చడం . మొదటి బెంచీ వారు వెనుకకు , రెండో !బెంచి వారు ఫస్ట్ బెంచి కి .. లాస్ట్ బెంచీ వారు ఒక ఒక వరుస ముందుకు ,...
.... అటు పై వారం ఇంకో వరుస ముందుకు ..
ఇలా చేస్తే ఆరేడు వారాల్లో ప్రతి ఒక్కరు ముందు బెంచ్ కొస్తారు . ముందు బెంచీ వారు వెనక్కు పోతారు .
తరగతి గదిలో ఎవరైనా బాగా ఎత్తు తక్కువ వారుంటే వారికి ప్రత్యేక ఏర్పాటు .
రోకలి తలకు చుట్టే పరిష్కారం :
ఏదో సినిమాలో ఎవడో చూపాడు అని తరగతి గదిలో బెంచీలు u ఆకారం వేయడం .
"చూసారా ! వెనుక బెంచీ లేకుండా చేసాము"... అని సంబర పడి పోవడం !
జరిగేది .
యూ ఆకారం లో పిల్లలు కూర్చున్నప్పుడు టీచర్ కు ముందుగా ఉన్న పిలల్లు సరే .
కానీ టీచర్ కు కుడి ఎడమల ఉండే పిల్లలు బ్లాక్ బోర్డు పై టీచర్ రాసింది చూడడానికి... ఆ మాటకొస్తే టీచర్ ను చూడడానికి.... మెడను ఒక వైపు కు తిప్పాల్సి వస్తుంది .
ఇప్పటికే మొబైల్ ఫోన్ పుణ్యమా అంటూ మెడలు వంగి పోతున్నాయి .
టెక్స్ట్ నెక్ అనే వ్యాధి మహమ్మారి లా వ్యాపిస్తోంది .
ఇక తరగతి గదిలో పిచ్చి ప్రయోగాలు చేస్తే మెడలు వంగి పోతాయి .
ఒక సారి సెర్వికల్ వెన్నెముక భాగం దెబ్బ తింటే బతుకు నాశనం !
No comments:
Post a Comment