Saturday, July 19, 2025

 🙏🔥🔥🔥🔥🙏"
👌 *నిన్నటి తరువాత- 3,వ భాగం పిల్లల పెంపకం  విషయమై తల్లిదండ్రులు ప్రవర్తన విషయంలో మరికొన్ని కొన్ని చిట్కాలు*
    🦜🦜🦜
  *MAZUMDAR*
   *BANGALORE*
       🙏🇮🇳🇮🇳🙏
👌51)"*సైకాలజీ సిద్ధాంతం' ప్రకారము సహజంగా కొడుకు తల్లిని , కూతురు తండ్రిని అమితంగా ప్రేమిస్తారు. అందుచేత వారి ముందు తల్లిదండ్రులు తిట్టుకున్న , కొట్టుకున్న ఒకరు మరొకరికి దూరం కావటం ఖాయం అని గుర్తుంచుకోండి*!"

👌52)"*మీ ఇంట్లో స్థలం ఉంటే పూల మొక్కలు వేయండి! కూరగాయల మొక్కలు వేయండి*. 
 *గులాబీలు ఎలా పూస్తాయో*! *వంకాయలు, బెండకాయలు ఎలా నవనవలాడుతూ ఉండి*, *ఆర్గానిక్ వి రుచి బాగుంటాయని చెప్పి*
*వారిని ఉత్తేజితులను కావించండి*

👌53)" *మీకు ఫోను వచ్చినప్పుడు లేదా ఎవరైనా వచ్చినప్పుడు మీరు లేనని చెప్పమని, పిల్లలకు చెప్పకండి? అలా అబద్ధాలు చెప్పిస్తే ! తర్వాత వాళ్లు ఆ విషయంలో "మాస్టర్" అయిపోతారు*

👌54)"*ఉద్యోగాల్లో బిజీ గా ఉన్న కొందరు తల్లిదండ్రులు పిల్లలని తల్లి గారి ఇంట్లో ఉంచి, లేదా వేరే ఇంటిలో చదివించడం జరుగుతుంది.  అది తల్లిదండ్రుల మధ్య అంతర్యాన్ని నిశ్శబ్దాన్ని పెంచుతుంది* 

👌55)"*మీ పిల్లల మాటలు వినండి! మీ బాల్యంలో మీ మాట వినని, పెద్దల మీద మీరు ఎంత కోపం తెచ్చు కొన్న విషయం గుర్తుచేసుకోండి*?

👌56)"*పిల్లలిద్దరూ పోట్లాడుకున్నప్పుడు సహజంగా వారిలో పెద్ద వారిని శిక్షిస్తారు.  లేదా న్యాయ దేవత లాగా! వాదోపవాదాలు వింటారు.  ఇవి రెండూ నేడు పనికిరావు.  సరే!లేరా రండి! సరదాగా ఈ పని చేద్దాం! అని వారి మూడ్  'డైవర్ట్' చేసి వారికి ఇష్టమైన పని చేయించండి*!

👌57)"*కొంచెం పెద్దగా ఉన్న పిల్లలు అంటే 10- 12 మధ్య వయసు వారు ఉన్న పిల్లలని మీకు కథలు చెప్పమని ప్రోత్సహించండి.  'అబద్ధాలు' అందంగా చెప్పగలిగే , ఆ వయసుని సృజనాత్మక'(creatives )వైపు మరలించండి*.!

👌58)"*కొందరు తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేసినప్పుడు నీ కన్నీ  మేనమామ పోలికలు వచ్చాయి. నీ కర్మ అంటారు. భార్య మీద కోపంతో, ఆ పిల్లలు అది నిజం అనుకొని కంటిన్యూ చేస్తారు.  తల్లి కూడా "నీ మేనత్త' పోలికొచ్చింది. అంటు ఉండటం కూడా సహజమే*!

👌 59)"*తల్లిదండ్రులు ఏ ఊరు వెళితే!  ఆ ఊరిలోని చారిత్రిక కట్టడాలు చూపించి మన 'సంస్కృతి' గొప్పదనం గురించి చెప్పాలి.  పదేళ్లుగా బెంగుళూరులో ఉన్న కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంతవరకు ,'విశ్వేశ్వరయ్య మ్యూజియం,' కంబన్ పార్కు, చూపించలేదు. అంటే! మీరు నమ్మగలరా? కానీ ఇది అక్షరాల నిజం*"

👌60)"*పిల్లలకు ఏదో ఒక హాబీలో శిక్షణ ఇప్పించండి.  ఈత, క్రికెట్, ఫుట్ బాల్, వైలెన్, గిటార్, వారిని చేర్చిన వారు ఎప్పుడు బిజీగా, వారిని ఉంచుతాయి. దానికి కావలసిన వనరులను వీలైనంతవరకు మీరు అందించండి*.

👍61)"*మీ చుట్టూ పక్కల వాళ్లతో సత్సంబంధాలు పెట్టుకోండి. దానివలన మీరు లేని సమయంలో వారు మీ పిల్లలకు సహాయంగా ఉంటారు*.

👍62)"*తల్లి ఆత్మహత్య చేసుకుంటే ఆమె పిల్లలకు కూడా భవిష్యత్తులో అటువంటి ఆలోచనలు రావటానికి అవకాశం ఉంది*.  *కాబట్టి అటువంటి ఆలోచన ఉన్న తల్లులు 'సైకాలజిస్ట్ ' ను సంప్రదించటం మంచిది*.

👍63)"*కొందరు తల్లులు వారి పిల్లలు ఆరేడు తరగతులు చదువుతున్నా! పిల్లలకు బూట్లు పాలిష్ చేసి పెడుతుంటారు.  అలా చేయక తండ్రి ఆ పిల్లలకు పాలిష్ ఎలా చేసుకోవాలో? నేర్పించాలి.  నా చిన్నప్పుడు చెప్పులే వుండేవి కాదు*. *పోలీసులు, మిలిటరీ వారు, వాళ్లు షూ పాలిష్*, ' *టో పాలిషు* *ఎలా ఉంటాయో! మీ* *పిల్లలకు చూపించండి* 
*శెలువ దినాలలో ఇలాంటివి నేర్పించండి*.

👍64)"*కొందరు మూర్ఖులు భార్యను వేధిస్తారు, 'ఆడపిల్ల' ప్రసవించిందని, పుట్టిన పిల్లలను నిర్లక్ష్యం చేస్తారు. అమ్మాయి పుట్టిన నా అబ్బాయి పుట్టినా? అందులో తన భాగం ఉందనే 'జ్ఞానం' పెంచుకోవాలి*. *ఇప్పుడు ఆడపిల్లలే తండ్రులని బాగా చూస్తున్నారు*.

👍65)" *మీ బాల్యంలో మొట్టమొదట సైకిలు తొక్కిన రోజున, గడియారంలో టైము ఎలాలో చూడాలో నేర్చుకున్న రోజున*, *పోస్ట్ ఆఫీస్, బ్యాంకు, రైల్వే స్టేషన్, సందర్శించి, రోజున మీరు ఎంత త్రిలు పొందారో గుర్తు తెచ్చుకోండి*? 
*ఆ త్రిల్లు మీ పిల్లలకు కూడా ఇవ్వండి*. *అంతే తప్ప, నీకు రాదు. నువ్వు వెళ్లలేవు, నీవు చేయలేవు, అని నెగిటివ్ మాటలు మీ నుండి రాకూడదు*.

👍66)"*పిల్లలకు ఏదైనా పనిచేసినప్పుడు సరిగా చెయ్యకపోతే నీకేమి రాదు, నువ్వెందుకు పనికి రావు, అనటం కన్నా! నువ్వు బాగా చేయగలవు, ఈసారి బాగా చేయగలవు. లాంటి 'పాజిటివ్' లో మాత్రమే మాట్లాడండి. నాకు ఆ నమ్మకం ఉంది అనండి ఫలితం బాగుంటుంది*.

👍67)" *మీ పిల్లలకు మ్యాజిక్కు, పెయింటింగ్ బుక్, రీడింగ్ లాంటి సరదాలు ఉంటాయి. అటువంటి పుస్తకాలు కొని , చదివి మీకు చెప్పమని చెప్పండి! అది వారి లోని 'సృజనాత్మకను 'తట్టి లేపుతుంది*"

👍68)"*మీ పిల్లల ప్రవర్తన అతిగా కనిపిస్తే!  జాగ్రత్తగా పరిశీలించండి. అవసరమైతే, 'చైల్డ్ కౌన్సిలర్' ని కలవండి*

👍69)" * *మీ పిల్లల :'ఐ.క్యూ' పెరిగేలాగా ఇంట్లో మంచి పుస్తకాలు కొనండి!  తెలిసిన మంచి విషయాలు చెప్పండి 'పజిల్స్, రీడర్స్ ,ఇచ్చి, 'చదరంగం ఆట' ను నేర్పించండి*. *వారి 'మెదడు' కు పదును పెట్టిన, ఆలోచనా ధోరణి,/సరళి మెరుగుపడును*.

👍70)"*మీ పిల్లవాడు ఇంట్లో ఒక చేయకూడని తప్పు చేసినప్పుడు, దాని గురించి అందరికీ ప్రచారం చేయకండి*. 
*మళ్లీ ఆ తప్పు చేయకుండా పశ్చాతాప పడేలా! తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేస్తే చాలు*.

👍71)" *పిల్లల తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న,  వారి పిల్లలు ఏమైపోతారు*. *అని ఆలోచించి తమకు అటువంటి ఆలోచనలు రాకుండా! 'పర్సనాలిటీ డెవలప్మెంట్' పుస్తకాలు చదివి 'ఆత్మవిశ్వాసం' పెంచుకొని తమ పిల్లలను తీర్చిదిద్దాలి*.

👍72)"*కొందరి ఇళ్లలో తల్లులు భర్త అత్తమామల మీద కోపంతో 'ఆత్మహత్యా' ప్రయత్నాలు చేయటం*, *లేదా*
*కట్నం వేధింపు కేసులు పెట్టడం లేదా చస్తానని బెదిరించడం చేస్తారు*. 
*అది చూసిన మీ పిల్లల భవిష్యత్తులో అది 'ఇమిటేట్ ' చేయటం ఖాయం.  తరువాత మీ ఇష్టం*.

👍73)"*వయసు కు మించిన పనులు చేసే 'హైపర్ ఆక్టివ్' (Hyper Active) పిల్లలని గుర్తించి వెంటనే కంట్రోల్ చేయాలి. అటువంటి పిల్లలు చిన్నప్పుడు స్కూటర్లు, కార్లు నడుపుతానంటారు. వాళ్ల తెలివితేటలు అద్భుతమే! కానీ ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు రావచ్చు*
*అమెరికా లాంటి దేశాలలో 15 ఏళ్ళకి*,
*మనదేశంలో 18 ఏళ్ళకి, లైసెన్స్ ఇస్తారు*.

👍74)"*పిల్లలు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నోరుముయ్! నీకు తెలియదు అంటే అది నిజమనుకొని, భవిష్యత్తులో "కమ్యూనికేషన్స్' చెడగొట్టుకుంటాడు*.

75)" *పిల్లలకు సరిగ్గా వినపడనప్పుడు వారు గుర్తించలేరు* *అది తల్లి గుర్తించాలి *ఏ వినిపించుకోవే* ! **ఒళ్ళు జాగ్రత్త! అని అనకుండా*! *E.N.T specialist దగ్గరికి*, 
*కనిపించకపోతే*,  '* *Ophthalmology కంటి డాక్టర్ల కు*, *చూపించవలెను*. *పిల్లల విషయంలో ఎలాంటి అశ్రద్ధ పనికిరాదు*.
*గమనిక*:"*సీరియల్స్ టీ.వీలో చాలా ఎపిసోడ్స్, చూసే మీకు*, *చదివే ఓపిక ఉంటుందని* "*నేను భావించి భావించి*, *4, భాగంగురించి*
*రేపు*  *ముచ్చటించుకుందాం* 
*వేచి చూడండి*.
     "*మజుందార్*
🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

No comments:

Post a Comment