Sunday, July 20, 2025

 *📖 మన ఇతిహాసాలు 📓*


*మహాభారత యుద్ధం తరువాత ఏం జరిగింది? కలియుగము ఎలా ఆరంభమయింది?*

(క్లుప్తముగా)

  కురుక్షేత్రం యుద్ధం తరువాత ధర్మరాజు పట్టాభిషషిక్తుడై 36 సంవత్సరాలు పరిపాలించిన తరువాత, శ్రీకృష్ణుడు దేహత్యాగము చేసాడని తెలిసి, చాలా విచారం పొందుతారు. తరువాత ధర్మరాజుకుఅనేక చెడు శకునాలు కన్పించాయి.

ధర్మరాజు, తమ్ముళ్లతోను , గురువులతోను సంప్రదించి, వారి మనుమడు, అభిమన్యుని కొడుకైన పరీక్షిత్ కు పట్టాభిషేకం చేసి, అప్పుడు , అంటే కలియుగ ప్రారంభం లో పాండవులు, వారి భార్య ద్రౌపదితో సహా రాజ్యం విడిచి హిమాలయాలకు వైపు మహా ప్రస్థానం సాగించారు.

ఒక ధర్మరాజు తప్ప మిగిలిన వారు దారిలో ఒకరి తరువాత ఒకరు దేహాన్ని విడిచిపెట్టారు. ధర్మరాజు మాత్రం దేహముతోనే స్వర్గం చేరగలుగుతాడు.

పరీక్షిత్ మహారాజు కలిపురుషుడు రాకని కనిపెట్టి అతనిని తన రాజ్యంలో జూదశాలలాంటి వాటి దగ్గరే ఉండమని, బయటకు రావద్దని అజ్ఞాపించాడట. తరువాత కాలం ఆయన ఒక ఋషి పట్ల చేసిన చిన్న తప్పిదానికి శాపానికి గురి అయ్యి తక్షకుడు అనే మహాసర్పం కాటుకు మరణిస్తాడు.

No comments:

Post a Comment