Sunday, July 20, 2025

 🙏🔥🔥🔥🔥🙏"
👌"*నిన్నటి రోజు తరువాత: 4 వ భాగం 'పిల్లల పెంపక విషయమై! తల్లిదండ్రులు వారి ప్రవర్తన విషయంలో మరికొన్ని చిట్కాలు*"
     🦜🦜🦜
  *MAZUMDAR*
   *BANGALORE*
       🙏🇮🇳🇮🇳🙏
76)"*మీ పిల్లలని అతిగా దండించటం, విమర్శించటం, వలన   గోళ్ళు కొరికేస్తూ! అలవాటు గా పక్కలు తడిపే అలవాటు, నోట్లో వేలు పెట్టుకోవడం, నత్తిలాంటివే రావచ్చు.  అటువంటి పిల్లల తల్లి తన 'ఎమోషన్స్' పూర్తిగా కంట్రోల్ చేసుకుని తీరాలి*

77)"*అడపా తడపా మీ యొక్క మత, సిద్ధాంతం,  అనుసారము, ప్రార్థనా స్థలాలకు తీసుకు వెళ్ళటం, మానవతా విలువలు గురించి తెలియజేయడం, అతడు సేవా కార్యక్రమాలలో పాల్గొనేట్టు, బొట్టు పెట్టుకొనుట, ఊర్వ ఉండ్ర నామధారణ , గొప్ప యతీంద్రుల, మహనీయుల చరిత్రలు చెప్పటం కొరకైనా! తల్లిదండ్రులు అవి తెలుసుకొని తీరవలెను*.

78)"*ఉద్యోగాలలో బిజీగా ఉన్న కొందరు తల్లిదండ్రులు పిల్లలని అత్త / తల్లి గారింట్లో ఉంచి చదివించడం జరుగుతుంది. అది తల్లిదండ్రుల మధ్య అంతరాన్ని నిశ్శబ్దం పెంచుతుంది*.

79)" *తల్లి చీటికిమాటికి తన తల్లి దగ్గరకు పిల్లలతో సహా వెళ్ళినందువలన అక్కడ అమ్మమ్మ తాతయ్యల గారం చేయడం చేస్తే! పిల్లల్లో క్రమశిక్షణ తగ్గవచ్చు*.

80)"*కొందరు పిల్లలు స్నానం చేయటం అప్పుడప్పుడు మానేస్తారు అటువంటి వారిని ఉదయం కాకపోతే సాయంత్రం చేయమని సున్నితంగా హెచ్చరించండి! అలాగే గోళ్ళు కత్తించుకోవడం కూడా నేర్పండి. వారికి ఒక 'నైల్ కట్టర్' ప్రత్యేకంగా కొని ఇవ్వండి*.

81)" *మీ పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వండి. కానీ! మరీ ఎక్కువ కాదు. అది కూడా ఇంట్లో ఏదో ఒక పని చేసిన తర్వాత ప్రతిఫలంగా మాత్రంగానే ఇవ్వండి*.

82)"*అతిగా మాట్లాడుతున్న పిల్లలను ముదురు మాటలు మాట్లాడుతున్న పిల్లలను ఎప్పటికప్పుడు హెచ్చరించాలి*.

83)"*మీ పిల్లలు మాట విననప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి రెండు ఇంజక్షన్లు గట్టిగా ఇప్పిస్తాను ,జాగ్రత్త! లాంటి డైలాగులు వాడవద్దు. దాని వలన వారికి 'ఇంజక్షన్ ఫోబియా' రావచ్చు*"

84)"*అంగవైకల్యం ఉన్న పిల్లలపై అతిగా జాలి ప్రదర్శించటం వలన వారికి సెల్ఫ్ పిటి పెరిగే అవకాశం ఉంది వారు కాన్ఫిడెంట్గా ఉండేలా అందవైకల్యంతో అద్భుతాలు సాధించిన 'స్టీఫెన్ హాకింగ్, నూతన ప్రసాదు', కాలు లేకపోయినా డ్యాన్స్ చేసిన అమ్మాయి సినిమాలో, హీరోయిన్ 
గా మంచి పేరు వచ్చినట్లు, అలాంటి సమాచారం ఇవ్వండి. 

85)"*సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లల్లో 'అటాచ్మెంట్' ఎక్కువ ఉంటుంది.   పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ అది తగ్గించే ప్రయత్నం చేయాలి*

86)"*డైవర్స్ తీసుకున్న వారి పిల్లలు 'మానసిక రుగ్మతలకు'  లోను కావచ్చు,!  ఇది అందరి విషయంలో జరగదు.  అటువంటి సమయంలో సైకాలజిస్టు,/ టీచరు/ తాత /,మతాధికారి/ తో కౌన్సిలింగ్ చేయిస్తే! బాగుంటుంది*.

87)"  *మీ పిల్లలకు తలనొప్పి కడుపునొప్పి లాంటివి వచ్చినప్పుడు వారికి రెండు కారణాలు చెప్పవచ్చు*      *మొదటిది స్కూల్ కొట్టడానికి*, 
*రెండవది నిజమైనది ఆ రొంపిలో ఏది అనేది తెలుసుకున్నాక డాక్టర్* *వద్దకు వెళ్లాలో* *వెళ్ళకూడదు నిర్ణయించుకోండి*?

88)"*మనదేశంలో పిల్లలు నాకు ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్ళు, అని చెప్పుకున్నట్లుగా! 'విదేశాలలో' పిల్లలు నాకు ఇద్దరు నాన్నలు, ముగ్గురు అమ్మలు అని చెప్పుకునే స్థితి ఏర్పడింది.  ఈ పరిస్థితి నలుగురిలో ఒకరికి ఉంది కాబట్టి 'విదేశా వ్యామోహం' తగ్గించండి*.

89)*విదేశాలలో* ఫాదర్స్ డే *మదర్స్ డే*
*అని జరుపుకుంటారు*
 *అంటే ఆ ఒక్క రోజునే ఎక్కడో* *వృద్ధాశ్రమాలలో ఉన్న తల్లిదండ్రులను కలుసుకొని , గ్రీట్ట్ చేస్తారు*. *మన దగ్గర అది అవసరం లేదు ప్రస్తుతం.  వారిని నిత్యం గౌరవించే అలవాటు ఉంది* *లేని వారు* *చేసుకోవాలి మన వద్ద మరణించిన వారికే సంవత్సరానికి ఒకసారి 'తద్దినం నాడు* 
*పిండా'  లకు నమస్కారము పెట్టుకుంటాము*.

90)"*విడాకులు తీసుకున్న తల్లులు తమ పిల్లలతో భర్త ఎలా వేదించేవాడు. ఎన్ని హింసలు పెట్టేవాడు, వంటి విషయాలు పదేపదే చెప్పకూడదు.  దాని వలన వారు 'ఎమోషనల్'  గా అయ్యే ప్రమాదం ఉంది.  దాని వలన తరువాత తల్లికి కూడా ముప్పే! జరిగిపోయింది ఒక పీడకలాగా మార్చి పోవాలి*.

91)"*మనదేశంలో అంతగా లేదుగానీ, అడపా తడపా మేనమామలు* *బాబాయిలు సవతితండ్రులు బాలికపై అత్యాచారం* *చేస్తున్నారు  తల్లి విషయంలో పిల్లలకు తగు జాగ్రత్తలు చెప్పాలి*

92)" *మనదేశంలో తల్లిదండ్రులు పిల్లలకు' సెక్స్' గురించి ఏమీ చెప్పరు.  అదొక అపరాధంగా ఫీల్ అయ్యేలా చేస్తారు. తల్లి కొంతవరకు కూతురికి చెప్తుంది. కొడుకు మాత్రం స్కూల్లో ఎవరో ఒక ఫ్రెండ్ దగ్గర, నేర్చుకుంటాడు. తెలుసుకుంటాడు కానీ వాడేమి 'సెక్స్ స్పెషలిస్ట్' కాదు, సమరంలా*!

93)"*తల్లితండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారై ఉన్నప్పుడు పిల్లలపై! ఒక మతంపై నమ్మకం ఏర్పరిచే ఒత్తిడి , తీసుకు రాకూడదు. వారికున్న ఇతర సమస్యలకు తోడు ఇదొక తలనొప్పి కావచ్చు*.

94)"*విడాకులు తీసుకున్న వారు తమ పిల్లలు రహస్యంగా తమ తండ్రిని (లేదా) తల్లిని కలుసుకుంటున్నారని తెలిసినప్పుడు ఉద్వేక పడకండి. భార్యాభర్తల బాంధవ్యం తెగిపోయిన రక్తసంబంధం తెగదు కదా! నచ్చజెప్పటానికి ప్రయత్నించండి! తప్ప, బెదిరిస్తే! ఫలితం ఉండదు*.

95)"*ఎడమ చేతి వాటం వల్ల పిల్లలని కొందరు హేళన చేసినప్పుడు వారు సిగ్గుపడుతుంటారు*. 
*అటువంటి పిల్లలకు ధైర్యం చెప్పండి*. 
*అమెరికన్ అధ్యక్షుడు క్లింటన్, అమితాబ్ బచ్చన్*, *లాంటి ఎందరో ప్రముఖులు  అలాంటి అలవాటు కలవారు ఉన్నారు*.

96)"*భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్న మాట్లాడుకోవడం మానేయకండి. ఇది పిల్లల్లో అభద్రతా భావన కలిగిస్తుంది. ఎవరితో మాట్లాడితే ఏం ప్రమాదమోనని వారు బిక్కు, బిక్కుమంటూ ఉంటారు*

97)"*మీ పిల్లల స్నేహితుల గురించి మీకు మీరే! జడ్జిమెంట్ ఇవ్వకండి, ఎప్పుడు చిరునవ్వు తో పలకరించటం చేయండి. అదే మీ పిల్లలకు అలవాటు చేయండి.

98)"*మీ పిల్లల గురించి బయట వారు ఫిర్యాదు చేసినప్పుడు అన్ని నిజమనుకోవద్దు నింపాదిగా ఫ్రెండ్లీగా మాట్లాడి అసలు విషయం తెలుసుకోండి*! *మీరు చెప్పే ప్రతి విషయం వారికి అర్థమయ్యే భాషలో ముందుగా మీరు* *ఆలోచించుకొని*, 
*ఎంత చెప్పాలో అంతే చెప్పండి*.

99)"*మీ పిల్లలు అడిగిందల్లా ఇచ్చినా తప్పే అలాంటి పేరెంట్స్ ని పిల్లలు చులకన చేస్తారు. ఆ పైన ప్రతి విషయం కమాండ్ చేస్తారు డిమాండ్ చేస్తారు అని తెలుసుకోండి*.

100)"*పేరెంట్స్ చట్టాన్ని ఉల్లంఘించే పనులు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ని 'నిర్లక్ష్యం' చేసినా ! పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు*.
*గమనిక"*: *ఈ తల్లిదండ్రుల యొక్క* 
*ప్రవర్తన నియమావళి అయ్యింది*. *మరి "పిల్లల పెంపకం"లో తల్లిదండ్రులు పాత్ర*. 
*Art of parenting* 
*తో మీ ముందు ఉంటాను*
🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏.

No comments:

Post a Comment