Saturday, July 19, 2025

 కాఫీ కబుర్లు సంఖ్య 937 (జూలై 18 - 2025) -- world listening day -- మానవ జీవితంలో వినడం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ.  ప్రతి నిత్యం ఏవేవో మాటలు ధ్వనులు శబ్దాలు పాటలు అరుపులు రణగొణ ధ్వనులు.‌. వంటివి మన చెవులలో పడుతూనే ఉంటాయి.  ఐతే ఈ వినడం కూడా ఓ కళే.. అనారోగ్య ధ్వనులు మన చెవులలో పడుతుంటాయి..  అలాగే కాలుష్యపు గాలి మన చెవుల్ని తాకుతూ మనకు తెలియకుండానే అనారోగ్యాలకి గురి చేస్తున్నాయి.  గత ఇరవై ఏళ్ళలో శబ్ద కాలుష్యం బాగా పెరిగింది.  స్టీరియో డిజిటల్ సౌండ్స్ హోరు చెవులు చిల్లులు పడేలా చేస్తున్నాయి‌‌.  ఊరేగింపు లలో మ్యూజిక్ గోల భరించ లేకపోతున్నాం‌.  వీటన్నింటి వలన మన చెవులు పాడై అనారోగ్యాలకి దారి తీస్తున్నాయి.  ఇక నగరాల్లో ట్రాఫిక్ ఎయిర్ సౌండ్ పొల్యూషన్ గురించి ఎంత తక్కువ చెబితే అంతమంచిది.  ఇదో భయంకర ఉపద్రవం.  దీన్ని దృష్టిలో ఉంచుకుని Mid West Society for Acoustic Ecology ఒక world listening project ను చేపట్టి, ఇందులో నిష్ణాతులైన రేమండ్ ముర్రే గౌరవార్ధం ఆయన జన్మదినం సందర్భంగా.. 2010 నుంచి ప్రతీ సంవత్సరం ఈరోజు అంటే జూలై 18న వరల్డ్ లిసెనింగ్ డే ని నిర్వహిస్తూ వస్తోంది.  ఈ సంవత్సరం (2025) థీమ్ గా sound walks  cultivating deep listening గా నిర్థారించారు.  లిసెనింగ్ ఈజ్ ఏన్ ఆర్ట్ అంటూ వినడం  పై ప్రజల్లో ఓ మంచి అవగాహన కలిగిస్తారు ఈరోజు.  మనందరిపై కూడా ఈ బాధ్యత ఉంది.  అంటే ఈరోజు నుంచి.. మంచి ధ్వనులే మన చెవులలో పడేలా చూసుకోవాలి.  అంటే సౌమ్యంగా మాట్లాడటం, వాదనలు వాగ్వివాదాలు avoid చెయ్యాలి, శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండాలి, పెద్ద పెద్ద సౌండ్స్ మ్యూజిక్ జోలికి పోకూడదు, ఉత్సవాలకి ఊరేగింపులకి దూరంగా ఉండాలి, దీపావళి నాడు శబ్దాలు లేని బాణసంచా కాల్చాలి తక్కువగా, విమాన ప్రయాణాలలో చెవుల్లో దూది పెట్టుకోవాలి.  మనసుకు రంజింపజేసే సంగీతం వినాలి.. సహజ ప్రకృతి ధ్వనులు.‌. అంటే సెలయేరు గలగలా, సముద్ర కెరటాల హోరు (కొంచెం దూరం నుంచే), చల్లని గాలి శబ్దం, షెహనాయి సన్నాయి లాంటి చక్కటి వాద్య సంగీతం.. వింటే మనసుకు ఆహ్లాదం, చెవులకి శరీరానికి ఆరోగ్యం.  చెడు శబ్దాలు అతిగా చెవులలో పడుతుంటే వినికిడి శక్తి క్రమంగా తగ్గిపోతుంది.    గనుక అందరం కూడా వినడం పై శ్రద్ధ పెట్టాలి.  చెవుల శుభ్రత పై కూడా దృష్టి పెట్టాలి‌.  శబ్ద కాలుష్యానికి మనం గురికాకుండా చూసుకోవాలి.  55-60 దాటినవారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి ఈ విషయంలో.  ఆర్ట్ ఆఫ్ లిసెనింగ్ వ్యాప్తి చేయడమే ఈ వరల్డ్ లిసెనింగ్ డే  ధ్యేయం ముఖ్యోద్దేశ్యం..  ---- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....

No comments:

Post a Comment