*హిందుమతంలో కోట్లాది దేవతలు ఎందుకు ఉన్నారు? ఇతర మతాలలో అది కనిపించదేమిటి?*
*జవాబు : హైందవ ధర్మంలో ముప్పదిమూడు కోట్ల దేవతలు ఉన్నట్లుగా చెబుతుంటారు. ఇది ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. సందేహించాల్సిన విషయం అంతకన్నా కాదు. ఒక స్కూల్లో చాలామంది ఉపాధ్యాయులు ఉంటారు. ఒక స్కూల్లో అనేక తరగతులు, అనేక బోధనాంశాలు ఉంటాయి. వాటన్నింటినీ చక్కగా బోధించాలంటే చాలామంది ఉపాధ్యాయులు అవసరమౌతారు. అయితే ఆ ఉపాధ్యాయులందరినీ నియంత్రించే ఒక ప్రధానోపాధ్యాయుడు కూడా కావాలి. ఆ ప్రధానోపాధ్యాయునికి కొన్ని ప్రత్యేకమైన యోగ్యతలు ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. అదేవిధంగా విశ్వయంత్రాంగ పాలనకు అనేకమైన విభాగాలు అవసరమౌతాయి.*
*విశ్వానికి వెలుగు నిచ్చేందుకు, నీరు అందించేందుకు, గాలిని ఇచ్చేందుకు, గ్రహాల చలనానికి, జీవుల నియంత్రణకు, ఇంకా ఎన్నెన్నో కార్యకలాపాలు ఉంటాయి. అందుకే ఆ కార్యాల* *విభాగాలకు ఆయా అధిపతులు నియమింపబడ్డారు. వారే దేవతలు. ఇక వారిని నియమించేవాడు, నియంత్రించేవాడే దేవదేవుడు. కాబట్టి దేవతలు ముప్పది ముక్కోటిమంది ఉండవచ్చును, కాని వారికి అధిపతి ఒక్కడే. ఆతడే దేవదేవుడు, శ్రీకృష్ణ భగవానుడు. ఈ విషయాన్ని ఆతడే భగవద్గీతలో చెప్పాడు.*
*ఈ విషయమే శ్రీమద్భాగవతములో శ్రీల వ్యాసదేవునిచే చెప్పబడింది. అయితే ఇతర మతాలలో ఈ విషయం ఇంత స్పష్టంగా చెప్పకపోయిన కారణంగా ఒకే భగవంతుడు ఉన్నట్లు కనిపిస్తుంది.*
*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
*అధ్యాత్మిక అన్వేషకులు*
🍁📚🍁 🙏🕉️🙏 🍁📚🍁
No comments:
Post a Comment