🙏 *వెదురు చెట్టు ఆదర్శ జీవనం..కథ* 🙏
ఒక ప్రొఫెసర్ తన విద్యార్థులతో కలిసి అడవుల్లో విహరించేందుకు వెళ్లాడు. అకస్మాత్తుగా, సాకేత్ అనే విద్యార్థి ఏటవాలుగా ఉన్న నేలపై నడుస్తుండగా జారిపోయి, క్రిందకు దొర్లిపోవడం ప్రారంభించాడు.
అతను కాలువగుంటలో పడబోతుండగా దారిలో అడ్డుగా ఉన్న వెదురు మొక్కకు తగులుకుని, ఆగాడు. వెదురును గట్టిగా పట్టుకుని ఉండడంవల్ల పడిపోకుండా తనని తాను కాపాడుకున్నాడు.
వెదురు విల్లులా వంగిపోయింది, కానీ దాని వ్రేళ్ళు బయటకురాలేదు, వెదురు విరిగిపోలేదు కూడా. సాకేత్ వెదురును గట్టిగా పట్టుకుని వ్రేలాడుతూనే ఉన్నాడు.
వెంటనే, అతని ప్రొఫెసర్ మిగతా విద్యార్థులందరితో అక్కడికి చేరుకున్నాడు.
చెయ్యి అందించి, సాకేత్ ను పైకి లాగాడు.
కొంతసేపటికి ప్రొఫెసర్ అందరినీ తన దగ్గరకు పిలిచి సాకేత్ ని ఇలా అడిగాడు - "ప్రాణాన్ని రక్షించిన ఆ వెదురు నీతో ఏదో చెప్పింది, విన్నావా?"
విద్యార్థులంతా ఎంతో ఉత్సుకతతో సాకేత్ వైపు చూడటం ప్రారంభించారు.
సాకేత్ ఇలా అన్నాడు - "లేదు సార్, ప్రాణ భయంతో ఉండడం వలన నేను పట్టించుకోలేదు.. పైగా చెట్లూ, మొక్కల భాష కూడా నాకు తెలియదు. దయచేసి ఆ సందేశం ఏమిటో చెప్పగలరా?"
ప్రొఫెసర్ చిరునవ్వు నవ్వి - "గుంటలో పడిపోతున్నప్పుడు పట్టుకున్న వెదురు నువ్వు ఎలా పట్టుకున్నావో అలా పూర్తిగా వంగిపోయింది. అయినా అది నీకు ఆధారంగా నిలబడి, నీ ప్రాణాన్ని కాపాడింది."
ఆ వెదురు మీకు ఇచ్చిన సందేశాన్ని చూపిస్తాను, రండి ’,’ అని ప్రొఫెసర్ వారిని తీసుకెళ్లి, పక్కనే ఉన్న వెదురు మొక్కను లాగి వదిలేశాడు. ఆ వెదురు లాగినంత దూరం ముందుకు వంగి, వదిలిన వెంటనే తిరిగి తన స్థానంలో నిటారుగా ఉండిపోయింది.
*“మనం కూడా ఈ వెదురుకు ఉన్నటువంటి మృదుత్వాన్ని, వంగే గుణాన్ని అలవర్చుకోవాలి. బలమైన గాలులు వెదురు పొదలను విపరీతంగా కదిలించడం ద్వారా పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నిస్తాయి ... ఆ గాలికి అది ముందుకు వెనుకకు ఊగుతుంది కానీ భూమిలో మాత్రం గట్టిగా పాతుకుపోయి ఉంటుంది."*
*“జీవితంలో కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడల్లా కాస్త తలవంచుకుని వినయంగా ఉండు, కానీ విరగకు - అని మీ అందరికీ వెదురు ఇస్తున్న సందేశం ఇది; ఎందుకంటే చెడు దశ దాటిపోయిన తర్వాత, మీరు మళ్లీ మీ పూర్వ స్థితికి చేరుకోవచ్చు అన్నమాట."*
విద్యార్థులందరూ శ్రద్ధగా వింటూ ఉన్నారు.
ప్రొఫెసర్ ఇంకా ఇలా చెప్పారు - *"వెదురు ప్రతి ఒత్తిడిని తట్టుకోవడమే కాకుండా, ఆ ఒత్తిడిని తన శక్తిగా మార్చుకుని రెండింతల వేగంతో పైకి లేస్తుంది. మీ జీవితాల్లో కూడా మిమ్మల్నీ అదే సాగే శక్తితో, అదే మృదుత్వంతో ఉండమని వెదురు చెబుతోంది."*
ఇలా ముగించాడు - "సాకేత్, నాకు కూడా మొక్కల, చెట్ల భాష తెలియదు. ఈ చెట్లు, జంతువులు మాట్లాడలేవు, కానీ అవి వాటి ప్రవర్తన ద్వారా మనకు చాలా నేర్పుతాయి."
జీవితంలోని అనేక అధ్యాయాలు, మాటల ద్వారా కాకుండా కేవలం ప్రవర్తనను గమనించడం ద్వారా నేర్చుకోవచ్చు.
*చైతన్యపు విస్తరణ మనలో మృదుత్వాన్ని పెంచి, మన మొండితనాన్ని, మూర్ఖత్వాన్ని తగ్గిస్తుంది. ఎలాగంటే పండ్లతో నిండిన చెట్టులా….*
*సాగే గుణం ఉండి, మృదుత్వం ఉన్న చెట్టు, ఎక్కువ పండ్లు ఉన్నా, వంగడం ద్వారా పండ్లను నిలబెట్టుకుంటుంది. బిరుసుగా, మొండిగా ఉన్న చెట్టు మాత్రం విరిగిపోతుంది. ...*దాజీ*
*హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం*
*సర్వే జన సుఖనో భవన్తు*
No comments:
Post a Comment