Sunday, July 20, 2025

 *చెవి గూట్లో గూగుల్  గురువు* 

అద్భుత జ్ఞాన నిధి ప్రశ్నకు సమస్యకు 
తక్షణ సమాధానము, పరిష్కారచెప్పే 
గురువుగా భౌతిక ఉపస్థితి. వాల్మీకి 
విశ్వామిత్ర సాందీపనుడు ద్రోణుడు 
ఆచార్యులుగా అప్పటి సమాజానికి 
మార్గదర్శకులు. గురువుల జ్ఞానబోధ 
ఆశ్రమాల్లో, గురుకులాల్లో, ధార్మిక, 
అస్త్ర శస్త్ర వేద వైద్య వైజ్ఞానిక గణిత 
ప్రజా పాలనా అంశాలలో విద్యార్థులకు 
ఉత్తమ శిక్షణ గరుపుతూ చతుర్వర్ణాలకు. 
వర్ణ ప్రాముఖ్యం వెనుకబడి అందరూ 
చదవాలి అందరూ ఎదగాలి అనే 
ఈరోజులలో పాఠశాల నుండి టెక్నో 
స్కూల్స్ వరకు నేడు విద్యా వ్యాపారం 
చదువులు కొలువుల కోసం కంప్యూటర్లు 
ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్లు నిత్యవసరాలుగా చెలరేగుతున్న రోజుల్లో గూగుల్ గురువు 
ఒక ప్రశ్నోపనిషత్. అర్థం పరమార్ధం 
విత్తం నుండి చెత్త వరకు దేనిని 
కాదనకుండా, మంచివారికి మంచిగానే ఉపయోగపడే జ్ఞాన గుణ నిధి, సంజీవని.
ఇప్పుడు గురుపూర్ణిమ ఏడాదికొక్క సారే 
కాదు.. గూగుల్ గురువుకు రోజుకు 
ఒక్కసారి అయినా మొక్కనిదే రోజు 
గడవని రోజులు. బద్ధకస్తులను నుంచి బుద్ధిమంతుల వరకు, సద్గుణోపేతుల నుండి ఉగ్రవాదుల వరకు అరచేతిలో అద్భుతం 
చెవి గూట్లో గూగుల్ గురువు. 
విశ్వ గురువు గూగుల్ గురుదేవుడు. 

మల్లేశ్వరరావు ఆకుల

No comments:

Post a Comment