వర్షపునీరు, వృథానీటిని వృధాకా పోనీయ కుండ ఎక్కడికక్కడ ఆ జలాలను ఇంకుడుగుంతలలోనికి చేర్చ గలిగితే భూగర్భ జల మట్టం పెరగడానికి ఎంతగానో దోహదపడతాయి. ఆరుబయట, ఇళ్ల ప్రహరీ లోపల, బోర్ల చుట్టు పక్కల ఇంకుడుగుంతల నిర్మాణం చేపడితే భూగర్భ జలం పెరుగుతుంది. ఏటేటా తగ్గిపోతున్న భూగర్భ జలమట్టం వృద్ధికి ఇంకుడుగుంతలే శరణ్యం. వీటి నిర్మాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. వీటిని నిర్మించి వృథా నీటిని వాటిలోకి పంపించడం ద్వారా ఆ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెంపొందించుకోవచ్చు. ఇంకుడు గుంతలు నిర్మించి నందున ఆ చుట్టు ప్రక్కల పడిన వృధాగా పోయే వర్షపు నీరు ఆ గుంతలో చేరి భూగర్భ జల మట్టము పెరిగి ఇదివరకు ఎండిపోయిన గొట్టపు బావులు తిరిగి జలసిరితో నిండిన సందర్బాలు అనేకం...!!
No comments:
Post a Comment