గొప్పవారి వ్యంగ్యాస్త్రాలు, చమత్కారాలూ కూడా గొప్పగానే వుంటాయి.
🙂
ఒకసారి కవి సమ్మేళనం జరుగుతోంది. కవులందరూ విచ్చేసారు. మహాకవి శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ గారూ కూడా సభకు విచ్చేసారు. ఆయన్ని చూసి కవులందరూ వారిని సగౌరవంగా స్వాగతించారు.
శ్రీ జాషువా మాత్రం ఏదో పుస్తక పథనంలో ఉండిపోయారు.
ఆదిచూసిన విశ్వనాధ వారు జాషువాను ఉద్దేశించి,
"పక్షి నా రాకను గమనించలేదు" అన్నారు.
అది విని కవులందరూ ఇంతటి మహాకవి జాషువాని పక్షితో పొలుస్తారా అని ముక్కున వేలు వేసుకున్నారు.
కానీ జాషువా మాత్రం చిరునవ్వుతో లేచి విశ్వనాధారికి నమస్కరించి ,"మీలాంటి కిరాతకుల దృష్టి ఎప్పుడూ పక్షుల మీదే కదా" అన్నారు
.
విశ్వనాధుని ఈ జాషువా అంత మాట అంటాడా అని కవులందరూ నిశ్చేస్టు లయ్యారు.
🤔😕
కానీ జాషువా అన్న మాటకి విశ్వనాధులు పగలపడి నవ్వేశారు.
😄
దీని అంతరార్ధం ఏమిటంటే.. జాషువాని పక్షి తో ఎందుకు పోల్చేరంటే జాషువాకి ఆ సభలో "కవి కోకిల" (పక్షి కదా) అనే బిరుదు ఇస్తున్నారు. అందుకే జాషువాకి కోపం రాలేదట.
ఇక జాషువా విశ్వనాధుని కిరాతకుడు అన్నారు.
కిరాతకుడు అంటే విశ్వనాదులవారు
"శ్రీ రామాయణ కల్పవృక్షం" అని రామాయణం రాస్తున్నారు అందుకు జాషువా ఆయన్ని (కిరాతకుడు) వాల్మీకితో పోల్చాడు.
🙂
ఇంకో విషయం. జాషువా విశ్వనాధుల వారి అనుంగు శిష్యుడు !!
🙏🙂🙏
No comments:
Post a Comment