తీసుకునే ఆహారం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారమే మనసు.
ఉదాహరణకి దేవాలయాలలో పెట్టే ప్రసాదం దైవానుగ్రహ శక్తి కలిగి ఉంటుంది. అందుకే కళ్ళకి అద్దుకొని తింటాం. ఈ ప్రసాదంలో 6వ వంతు మనస్సుగా మారుతుంది. మనసులోని ఆలోచనలు ప్రచోదితం అయ్యి చాలా సమస్యలకి అంతర్లీనంగా పరిష్కారం లభిస్తుంది. అందుకే దైవ ప్రసాదానికి అంత ప్రాముఖ్యత ఉంది..
అదే ఏ మాంసాహారమో తిన్నారనుకోండి.. అందులో 6వ వంతు కూడా మనసుగా మారుతుంది. ఆ జంతువు అప్పటి వరకు ఏమి చేసింది? దాని స్వభావం ఏమిటి? ఇవన్నీ మనసులో పుట్టే ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. జంతువుల స్వభావం ఏమిటి? కనబడిన చెత్త తినడం, సంభోగం, బెదిరిపోవడం, భయపడటం, ఎవరైనా ముద్ద పెడితే విశ్వాసం కల్గి ఉండటం. ఇంతకుమించి ఏం తెలుసు వాటికి. అందుకే చూడండి. మాంసాహారం తినేవారిలో ఎక్కువ పిరికితనం, భయం, అనవసరమైన పొగరుబోతుతనం, బెదురు, భయం సంభోగ కాంక్ష కలిగి ఉంటారు..
సాత్విక ఆహారం తీసుకునేవారి మనసు ఎక్కువగా నెమ్మదిగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు ఉండవు. బుద్ధి కుశలత కలిగి ఉంటారు. ఎందుకంటే దైవానికి దగ్గరగా ఉండేది ఎక్కువ వీరే. దైవానికి దగ్గరగా ఉంటే దైవశక్తి వీరి మనసుని ప్రచోదితం చేస్తుంది కనుక శారీరకంగా మానసికంగా దృఢంగా, ఆలోచనల్లో స్పష్టంగా ఉంటారు.
శరీరం, మనసు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ఆహారమే ప్రదానం. ఆహారమే ఆయుస్సు, ఆహారమే శరీరం, ఆహారమే మనస్సు, ఆహారమే శ్వాస క్రియను క్రమపద్దతిలో ఉంచుతుంది. శ్వాసే ఆయుస్సు.. శ్వాస ఎంత నెమ్మదిగా తీయగలిగితే జీవితకాలం అంత పెరుగుతుంది. ఇది కూడా ఆహార వ్యవహారాలు బట్టే ఉంటుంది.
ఏకమేవ అద్వితీయం 👏
సర్వే జనాః సుఖినోభవంతు
లోకా సమస్తా సుఖినోభవంతు
No comments:
Post a Comment