*మధ్యతరగతి ప్రజలను మరచిపోతున్న ప్రభుత్వం*
*నిజమే పేదలకు ప్రభుత్వం సహాయం చెయ్యవలసినదే కాదని ఎవరు అన్నారు కానీ ఆ సహాయం పేదలను సోమరిపోతులుగా మారేడట్లు లేదా మార్చేటట్లు మాత్రం ఉండకూడదు ఈనాడు ప్రభుత్వానికి టాక్స్ రూపం లో పన్ను కట్టేది జనాభాలో ఎక్కువమంది మధ్యతరగతి లేదా ఎగువ మధ్యతరగతి వాళ్ళే ఆ ధనం దేశ సౌభాగ్యానికి సక్రమంగా వినియోగబడుతోందా?* *ఇది అందరు ఆలోచించవలసిన విషయం. పేదవాడికి ఓటు హక్కు వుంది కాబట్టి వారిని సంతృప్తి పరిస్తే చాలు మళ్లి మనం ఎన్నికల్లో సులువుగా బంపర్ మెజారిటీ తో గెలవవచ్చు అనే భావన రాజకీయ పార్టీలలో నాయకులలో బాగా నాటుకుపోయింది అందుకే దేశాభివృద్ధి కుంటుపడింది* *పేదవాడికి డబ్బు ఎలా సంపాదించాలో నేర్పాలి కావలసిన ట్రైనింగ్ ఇవ్వాలి అవకాశాలు కల్పించాలి అప్పుడే పేదవాడు కష్టపడతాడు డబ్బు సంపాదించుకుని దానితో కావలసినవి కొనుక్కుని తృప్తి పడతాడు*. *సంపాదించిన డబ్బు తో ఏదైన కొంటే కలిగే ఆనందం సంతోషం ఉచితంగా ఏదైనా అందుకుంటే అందులో ఉంటుందా?*
*ఉదాహరణకు మహిళలకు టికెట్ లేకుండా ఉచితంగ బస్సు ప్రయాణం అన్నారు. దీనివలన ప్రభుత్వానికి ఎన్ని కోట్లు నష్టం ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు. ఐనా స్త్రీ పురుషులు సమానమే అన్నప్పుడు ఈ ఉచిత సదుపాయం స్త్రీలకు మాత్రమే ఎందుకు? తెల్ల రేషన్ కార్డు వున్న వాళ్లందరికీ కల్పించండి ఆడ మొగ తేడాలేకుండా. మిగతా జనాభా డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుంటారు. డబ్బులున్న మహిళలు కూడా ఉచితంగా బస్సు లో ప్రయాణం చేస్తే ఎలాగ?*
*సరే ఇంక మధ్యతరగతి ప్రజలు/కుటుంబాలు గురించి ఆలోచిద్దాం. పిల్లలని కంటే వాళ్ళ పోషణ చదువుల ఖర్చు భరించలేక పిల్లలని కనడం మానేసే మధ్యతరగతి కుటుంబాలు నేడు చాలానే ఉన్నాయి. చిన్న చిన్న పట్టణలలోను హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ ఇంటి అద్దెలు విపరీతగా పెరిగిపోయి ఆ ఊళ్ళల్లో నివాసముండడమే గగనం గా మారింది* *ఇంక పిల్లల్ని కాస్త మంచి స్కూల్ లో వేయాలంటే ఎల్ కేజీ నుండే ఏభై వేల నుండి లక్షల రూపాయల్లో ఫీజు లు డొనేషన్ లు సరేసరి ఇంక హై స్కూల్ ఇంటర్ డిగ్రీ చదువులంటే బ్యాంకు లోన్లు ఇల్లు పొలాలు తాకట్టు పెట్టడం ఎక్కువడ్డికి బయటనుండి అప్పులు తేవడం తప్పని సరి. ఏదికోనాలన్న జిఎస్టి కట్టవలసిందే క్రెడిట్ కార్డు వాడితే మళ్ళీ తీర్చేటప్పుడు టాక్స్ అదనంగా కట్టాలి కట్టడం లేట్ అయితే పెనాల్టీ అధిక వడ్డీ. అవసరమొచ్చి బ్యాంకు నుండి మన డబ్బే మనం ఎక్కువసార్లు తీసుకుంటే పెనాల్టీ. కష్టపడి పిల్లలను చదివించిన డబ్బు ఖర్చయి అప్పుల పాలవడమే తప్ప ఉద్యోగం వస్తుందన్న గారంటీ లేదు. వచ్చినా అవన్నీ కాంట్రాక్టు ఉద్యోగాలే. పెర్మనెంట్ కాదు ఎప్పుడు తీసేస్తారో తెలీదు. ఇంక పిల్లల పెళ్లి పెళ్ళిఖర్చు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఆంత మంచిది. పెట్రోల్ ఖర్చు గ్యాస్ సిలెండర్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆలా ఆలా పైకి పోవడమే కానీ క్రిందకి దిగిరావు. ఇంక సరదాగా కుటుంబం తో కలసి సినిమా కి వెళ్లాలనే కోరిక ప్రతి మధ్య తరగతి కుటుంబీకుడికి ఉంటుంది ఆలా వెళ్లాలంటే పదిహేను వందలకు పైగా ఖర్చవుతుంది* *చాలిచచాలని జీతం డబ్బులతోనే నెలంతా నెట్టుకురావాలి లేదంటే అధిక వడ్డీకి ఆప్పు తెచ్చుకోవాలి. ఎందుకంటే మెరుగయిన సిబిల్ స్కోర్ లేకపోతే బ్యాంకులు అప్పులు ఇవ్వవు. మరిన్ని కష్టాలు పడుతున్న మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం ఏ విధంగా సహాయం అందింస్తోంది అంటే ఏ జవాబు ఉండదు* *అందుకే మధ్యతరగతి ప్రజలు నీరసం బాధ తో కూడిన మందహాసం చిందించడం తప్ప మరేమిటి చెయ్యగలరు?*
బి మల్లికార్జున దీక్షిత్
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
No comments:
Post a Comment