Sunday, July 20, 2025

 ఇస్లామిక్ ఉచ్చులో హిందూ కులవృత్తులు
---
హిందువులకు సంబంధించిన, ప్రత్యేకించి హిందూ సంప్రదాయ ఆచార వ్యవహారాలతో ముడిపడిన దాదాపు ప్రతి కులవృత్తిలోనూ ఇస్లామిక్ ఛాందసులు చొరబడుతున్నారు. ముఖ్యంగా హిందువుల పవిత్ర పండుగల సమయంలోను, తీర్థయాత్రలు చేసేటప్పుడు వీటిపై ఏమాత్రం అవగాహన లేని ముస్లింలు పూజా వస్తువులు, ఆహార పదార్థాలను అమ్మడం చూస్తూనే ఉన్నాం. దారుణమైన విషయమేంటంటే, హిందువులకు వీరు అమ్మే వస్తువులు, పదార్థాలను అపరిశుభ్ర వాతావరణంలో అపవిత్రం చేస్తున్నారు.
 
తాజా పరిస్థితిని గమనిస్తే... క్షవరం (Hair cutting) చేయడం వంటి హిందువుల కులవృత్తుల్లోకి కూడా పలువురు ముస్లింలు చొరబడ్డారు. కొన్ని రోజుల క్రితం రిలయన్స్ వారు సెలూన్స్ తెరిస్తే.. కొందరు సోకాల్డ్ మేధావులు నానా రభస చేశారు. రిలయెన్స్ వారు ఒక కులం కడుపు కొడుతున్నారని గగ్గోలు చేశారు. కానీ.. ఇప్పుడు ఇదే పనిని ఇస్లామిక్ ఛాందసులు చేస్తే మాత్రం కిమ్మనడం లేదు. కోర్టు మెట్లెక్కి మరీ ఆ కులస్తుల బ్రతుకుదెరువుకు అడ్డం పడుతున్నారు.
 
ఇటీవల వికారాబాద్ పట్టణంలో ఫిరోజ్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి సెలూన్ షాప్ తెరిచాడు. దాంతో ఆగ్రహించిన రమేష్ అనే క్షురకుడు (హిందూ మతంలో మంగలి కులం / నాయీ బ్రాహ్మణులు) సదరు సెలూన్ వద్దకు తన తోటి కులస్తులతో కలిసి వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే హిందువుల్లోని కులవృత్తులలో ఒకరకమైన పకడ్బందీ కట్టుబాటు వ్యవస్థ ఉంటుంది. ఆయా వృత్తులు చేసే వ్యక్తులు లేదా కుటుంబాలు గ్రామంలోని ఇతర కులస్తుల కుటుంబాలకు వారి ఆచార వ్యవహారాలను అనుసరించి అందుకు తగిన సేవలు చేస్తారు. ఇందులో సమాజ ఆర్థిక సమానత్వ సూత్రం దాగి ఉంది. ఉదాహరణకు మంగలి కులం విషయానికే వస్తే, పురుడు పోయడం, పుట్టు వెంట్రుకలు తీయడం, శ్మశాన వాటికకి వెళ్లి హిందువులకు క్షురకర్మ చేయడం, మైల ప్రోలు వ్రాయడం, ఎవరి ఇంట్లోనైనా పుష్పవతి అయితే గోర్లు తీయడం, శుభకార్యాల్లో సన్నాయి వాయించడం వంటివి హిందూ ఆచారాలకు అనుగుణంగా చేస్తారు. ఇవి ముస్లింలకు తెలియవు, చెయ్యలేరు. అయినప్పటికీ క్షురకవృత్తిలోకి రావడంపై నాయీ బ్రాహ్మణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ పరిస్థితుల్లో ఒక ముస్లిం వ్యక్తి పెట్టుకున్న క్షౌరశాల (సెలూన్)పై రమేష్ అభ్యంతరాన్ని సహించని కొందరు కోర్టుల్లో కేసులు వేశారు. ఒక వర్గానికి అన్యాయం జరుగుతుందని అరిచి గోలచేసి ముస్లిం వ్యక్తి  క్షౌరశాలకు పోలీసులు బేషరతు భద్రత కల్పించే విధంగాను,  అది నడిచేలా ప్రభుత్వం భరోసా కల్పించాలనే రీతిలో పరిస్థితిని తీసుకొచ్చాయి.
 
ఇక ఇప్పటికే అనేక వ్యాపారాలలో వేళ్ళూనుకుపోతున్న ఇస్లామిక్ దండయాత్ర హిందూ కులాల వ్యవస్థలో జొరబడి జీవన విధానాన్ని కూడా విచ్చిన్నం చేయడానికే సంకల్పించినట్లుగా కనపడుతోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బ్రతకడానికి ఎన్నో రకాల మార్గాలుండగా మరో వర్గంలోని కులవ్యవస్థను, దాని నుంచి విడదీయరాని బంధాలను తెంచడానికే ఒకపక్క సదరు కులస్తులు వ్యతిరేకిస్తున్నా కూడా వెనక్కి తగ్గకుండా చట్టాలలోని లోపాలను,  రాజ్యాంగం ఇచ్చిన అతి స్వేచ్ఛను ఇష్టానుసారంగా ఇలా వాడుకుంటూ హిందూ సమాజానికి నష్టం చేస్తున్నారు. ఇది ఒక రకంగా చూస్తే ఒక వర్గంపై మరో వర్గం చేసే సామాజిక దాడిగా భావించాల్సి ఉంటుంది. ఇందులో ఎంత మాత్రం బ్రతుకు తెరువు అనే మాట లేషమాత్రమైనా మనకు కనిపించదు.
 
కోర్టు తీర్పుతో నాయీ బ్రాహ్మణుల కీలక నిర్ణయం.. 
 
ఎవ్వరైనా ఏ కులవృత్తినైనా చేపట్టవచ్చంటూ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో నాయీ బ్రాహ్మణులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమ వృత్తులను ఇతర కులస్తులే కాకుండా ఏకంగా ఇతర మతస్తులు సైతం చేపట్టారని, తమ పరిస్థితి ఏం కావాలని, ధర్మం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. సాటి హిందూ సమాజం నుంచి సైతం మద్దతు రాని పరిస్థితి ఉందంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వికారాబాద్ జిల్లాలో నాయీ బ్రాహ్మణులు అత్యంత సంచలన నిర్ణయం తీసుకున్నారు.
 
జిల్లాలో వారం రోజుల పాటు గ్రామాల్లో జరిగే తమ పరిధిలోకి వచ్చే ఏ కార్యక్రమానికి కూడా తాము హాజరవ్వబోమని, తమ సేవలను అందించేది లేదని వికారాబాద్ జిల్లా నాయీ బ్రాహ్మణులు తేల్చి చెప్పారు. ఏ కులవృత్తినైనా ఎవరైనా చేసుకోవచ్చునని, తాము హైకోర్టు తీర్పుని గౌరవిస్తామని ప్రకటించారు. అయితే.. వారం పాటు మాత్రం తమ విధులను బహిష్కరిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తెలంగాణ నాయీ బ్రాహ్మణ జేఏసీ ప్రకటించింది.
 
తాము ఎవరి ఇంటికీ వెళ్లి పురుడు పోయమని, ఎవరి ఇంటికి వెళ్లి పుట్టు వెంట్రుకలు తీయమని, జిల్లాలో ఏ శ్మశాన వాటికకి వెళ్లి క్షురకర్మ (శిరోముండనం / గుండు) చేయబోమని, మైల ప్రోలు వ్రాయమని ప్రకటించారు. అలాగే ఎవరి ఇంట్లోనూ పుష్పవతి అయినా గోర్లు తీయమని కూడా ప్రకటించారు. వీటితో పాటు సన్నాయి కూడా వాయించబోమని తేల్చి చెప్పారు. "ఏ పనైనా ఎవ్వరైనా చేయవచ్చని అంటున్నారు కదా.. వీటిని ఇతర మతాల వారితోనూ చేయించుకోండి" అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమపై ఒత్తిడి తెచ్చి మాత్రం చేయించవద్దని తేల్చి చెప్పారు. వారం లోపు తమకు సరైన న్యాయం జరక్కపోతే మాత్రం మిగతా జిల్లాల్లో కూడా ఈ సేవలను నిలిపేస్తామని హెచ్చరించారు.
 
కల్యాణ కట్టల్లో పనిచేసే తమను పర్మినెంట్ చేస్తామని ఎన్నో ప్రభుత్వాలు ప్రకటించాయని, కానీ.. తమను మోసం చేస్తున్నాయి కానీ, పర్మినెంట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కూడా తమకు న్యాయం చేయకుంటే కల్యాణ కట్టల్లో కూడా తలనీలాలను తీయబోమని తేల్చి చెప్పారు. తలనీలాలను కూడా దేవాలయాల్లో హైందవేతరులతోనే తీయించుకుంటారా? వారు బొట్టు పెట్టి తీస్తారా? అంటూ నాయీ బ్రాహ్మణులు నిలదీశారు.
 
సెలూన్ షాపు ముసుగులో అక్రమంగా తుపాకుల అమ్మకం...
 
ఇదిలా ఉంటే సెలూన్ షాపు ముసుగులో అక్రమంగా తుపాకులు అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాదులో ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీలోని రాంపూర్‌కి చెందిన మహ్మద్ జీషన్ 2016లో తన కుటుంబంతో హైదరాబాద్ వచ్చాడు. సంతోష్ నగర్‌లో వుంటూ రక్షపురం, గోల్కొండ, బాలాపూర్‌లో హెయిర్ సెలూన్‌లు తెరిచాడు. తన స్నేహితుడు అమీర్ (24)ని కూడా సెలూన్‌లో భాగం చేశాడు.
 
వీటి నుంచి వచ్చే డబ్బు తన జల్సాలకి సరిపోవడం లేదని, ఆయుధాల వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నారు. దీంతో యూపీలో అక్రమ తుపాకుల తయారీదారులతో సంబంధాలు కలిగి వున్న మరో స్నేహితుడు అర్షిఖాన్‌ను సంప్రదించారు. ఐదు రకాల తుపాకులను తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. వాటిని హైదరాబాద్ కి తీసుకొచ్చి, సంఘ వ్యతిరేక శక్తులకు 2 లక్షలకు విక్రయించడానికి తనవద్ద వుంచుకున్నాడు.ఈ విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు. వీరిని అరెస్ట్ చేశారు.
 
దీనిని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఈ సంఘటనను ప్రస్తావిస్తూ నాయీ బ్రాహ్మణులు వ్యాఖ్యానిస్తున్నారు.

No comments:

Post a Comment