Sunday, July 20, 2025

 పదిమంది తలుచుకుంటే మంచిని చెడుగా మార్చగలరు. వాటిలో "సాని" పదం ఒకటి. సాని అంటే వినకూడని, వాడ కూడని బూతు పదం కాదు. వ్యభిచారిణికి పర్యాయ పదం కాదు.

సాని అంటే సంపూర్ణ సంగీత పరిజ్ఞానం సంపాదించిన స్త్రీకి బిరుదుగా ఇచ్చేవారు. 

ఈ బిరుదును సంపాదించుకోవడానికి ప్రతి దేవనర్తకి ఎంతో కష్టపడాల్సివచ్చేది.
కొందరు రాణులను గౌరవప్రదంగా దొరసాని అని పిలిచేవారు.

ఎరుకలసాని, మంత్రసాని, దొరసాని 
అనే పదాలు గౌరవప్రదమైనవే కాని నీచమైనవి కావు.

పిల్లలమర్రిలోని ఎరుకలేశ్వరునికి దేవాలయం కట్టించిన బేతరాజు భార్యపేరు ఎర్రక్కసాని.
Copied

No comments:

Post a Comment