Sunday, July 20, 2025

 *🥀 మన సాహిత్య మకరందం 🥀*


*ల్లీ భల్ల లులాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ బలిముఖ చమరీ*
*ఝిల్లి హరి శరభ కరి కిటిమల్లాద్భుత కాక ఘూక మయమగు నడవిన్*

భావం : మగ, ఆడ భిల్లులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, గురుపోతులు, కొండముచ్చులు, చమరీ మృగాలు, ఈల పురుగులు, సింహాలు, శరభమృగాలు, ఏనుగులు శ్రేష్ఠమైన పందులతోను, ఆశ్చర్యాన్ని కలిగించే కాకులు, గుడ్లగూబలతో ఆ అడవి నిండి ఉంది. అటువంటి అడవిలో...

ఈ పద్యం పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోనిది. దట్టమైన అడవిని వర్ణిస్తూ అందులో ఉండే రకరకాల జంతువులను వివరించాడు పోతన. భిల్లీభల్ల అంటే భిల్లుజాతికి చెందిన స్త్రీ పురుషులు. లులాయకం అంటే అడవిదున్నపోతు. భ ల్లుకం అంటే ఎలుగుబంటి. ఫణి అంటే పాము. ఖడ్గ అంటే ఖడ్గమృగం. బలిముఖం అంటే కొండముచ్చు. చమరీ అంటే కస్తూరీ మృగం. ఝిల్లి అంటే ఈల కోడి. హరి అంటే సింహం. శరభం అంటే శరభమృగం. కరి అంటే ఏనుగు. కిటిమల్ల అంటే మేలుజాతి పంది. కాక అంటే కాకి. ఘూక అంటే గుడ్లగూబ. ఈ పద్యంలో ఇందులో ఇన్ని కొత్తపదాలకు అర్థాలు నేర్చుకోవచ్చు. అంతేకాక ఈ పద్యం తెలుగుభాషలో ఉన్న మంచి టంగ్‌ట్విస్టర్.

*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

No comments:

Post a Comment