Sunday, July 20, 2025

****జీవితంలో డబ్బు కంటే ముఖ్యమైనది* *ఏమిటి?*

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*

  *ఓం నమో భగవతే వాసుదేవాయ*

🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁

*జీవితంలో డబ్బు కంటే ముఖ్యమైనది*

                      *ఏమిటి?*


*ఒక మనిషిని ప్రేమించడం. ఇదే ముఖ్యమైనది. మనల్ని ప్రేమించే వారు, కావాలనుకునే వారు, ఇష్టపడే వారిని చాలా సార్లు బాధ పెడుతూ ఉంటాము. సరిగ్గా వారిని అర్థం చేసుకొము. వారిపైన మన కోపతాపాలు చూపిస్తూ ఉంటాము. ఒక్కసారి కూడా వారి వైపు నుంచి ఆలోచించము. మన ప్రవర్తన, మాటలు సరిగా ఉండదు. మన పంతం మనదే.* 


*ఒక రచయిత అన్నట్టు, నాలుక అగ్ని వంటిది, బహు జాగ్రతగా మాట్లాడడండి అంటారు. మన కష్టాలు, బాధలలో ఎంతో సహాయం చేస్తారు, ఒక చిన్న పొరపాటుతో వారిని దూరం చేసేసు కుంటము. వారి తప్పు లెంచుతాము. నానా రకాల మాటలు, గొడవలు పడుతుంటాం. ఒక్కసారి కూడా మనం ఆలోచించము. నేను చేస్తున్నది సరైన పద్దతి కాదు అని అనుకోము వారు దూరం అయ్యేంత వరకు. అయినా కూడా వారు మనల్ని* *మన్నించి ప్రేమిస్తారు. మన తప్పు తెలుసుకొని వారిని క్షమాపణ అడిగే సరికి ఒక్కోసారి చాలా ఆలస్యం అవుతుంది, ఆ అవకాశం కూడా కోల్పోతాము. అప్పటికే మనకి మనము వారి నుంచి దూరం అయిపోతాము. ఎంత బాధగా ఉంటుంది. అనిన ప్రతి మాట, ప్రవర్తన గురుచి పశ్చాతాపం పడుతూ, క్షమాపణ అడగలేక సత మత మయిపోతూ ఉంటాము.* 


*బ్రతికున్నంత కాలం గుండెల్లో ఒక మూలన ఆ బాధను గూడు కట్టుకొని ఉంటాము. మర్చి పోవాలని ప్రయత్నించిన సాధ్యం కాదు. అది ఒక ముళ్ళు లాగ ఉండి పోతుంది. ఒక్క తప్పు వల్లన మీరు నేరస్తులు కాకండి. మిమ్మలిని ప్రేమించే వారిని తోసి పారేయొద్దు. నిస్వార్థమైన మనిషిని దూరం చేసుకో వద్దు. బ్రతుకు శూన్యంగా కనబడుతుంది అటు వంటి వారు మనకి లేక పోతే. సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోండి. ఏమి ఆశించని వారి ప్రేమ పొందడం అదృష్టం. అది దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం. నిస్వార్థమైన ప్రేమ పొందలేని బ్రతుకు ఒక శ్మశానంలో బ్రతికున్నట్టుగా ఉంటుంది.*

🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁

*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*

🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴

No comments:

Post a Comment