Saturday, July 19, 2025

 *గౌట్ వ్యాధి* అనగా శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వలన శరీరంలో ఉన్న ప్రతి కీళ్లు నొప్పితో బాధించడం జరుగుతుంది. నొప్పితో పాటు కీలుపై వాపు రావడం జరుగుతుంది. దీని కారణంగా నడవడం, కూర్చోవడం, తమ పని తాము చేసుకోకపోవడం, బాత్రూం కి పోలేనంత ఇబ్బందికరంగా మారుతుంది.

 *ఆయుర్వేదంలో మాత్రమే శాశ్వత పరిష్కారం లభిస్తుంది.*
*ఆయుర్వేదం.....*
ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడి యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోండి..!

శ‌రీరంలో యూరిక్ యాసిడ్ నిల్వ‌లు ఎక్కువ‌గా పెరిగిపోతే గౌట్ అనే స‌మ‌స్య వ‌స్తుంది. దీంతో కీళ్ల‌లో రాళ్ల లాంటి స్ఫ‌టికాలు ఏర్ప‌డుతాయి. ఈ క్ర‌మంలో తీవ్ర‌మైన నొప్పులు వ‌స్తాయి. కీళ్ల వ‌ద్ద వాపులు, నొప్పి, ఎరుపు ద‌నం ఉంటాయి.

1.*పున‌ర్న‌వ*
ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇది కీళ్ల‌లో వాపుల‌ను త‌గ్గిస్తుంది. యూరిక్ యాసిడ్‌ను బ‌య‌టకు పంపుతుంది. దీంతో వాపులు, నొప్పులు త‌గ్గుతాయి. పున‌ర్న‌వ ట్యాబ్లెట్లు, పొడి రూపంలో ల‌భిస్తుంది. ఆయుర్వేద మందుల షాపుల్లో ల‌భ్య‌మ‌వుతుంది. ప్యాక్‌పై సూచించిన విధంగా లేదా డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు వాడుకోవాల్సి ఉంటుంది.

2.*గుగ్గులు* 
గుగ్గులుకు చెందిన ట్యాబ్లెట్లు ల‌భిస్తాయి. వీటిని వాడ‌వ‌చ్చు. ఇవి పెయిన్ కిల్ల‌ర్‌లా ప‌నిచేస్తాయి. దీంతో నొప్పి, వాపులు త‌గ్గుతాయి.

3.*తిప్ప‌తీగ‌*
యూరిక్ యాసిడ్‌పై ఇది బాగా ప‌నిచేస్తుంది. శరీరంలో పిత్త దోషాన్ని త‌గ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్ ను త‌గ్గిస్తుంది. దీని రసాన్ని రోజూ ఉదయం 30 ఎంఎల్‌ మోతాదులో తీసుకోవచ్చు.

4.*తుంగ ముస్త‌లు*
గౌట్ స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో ఇవి బాగా ప‌నిచేస్తాయి. వీటి పొడిని రాత్రి నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే మ‌రిగించి అనంత‌రం వ‌డ‌క‌ట్టి తాగేయాలి. స‌మ‌స్య త‌గ్గుతుంది.

5.శొంఠి, ప‌సుపుల‌ను నీటితో క‌లిపి పేస్ట్‌లా చేసి ఆ మిశ్ర‌మాన్ని కీళ్లపై రాస్తే నొప్పులు, వాపులు త‌గ్గుతాయి.

 *ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు, ఆయుర్వేద విశిష్టతలు, ఆయుర్వేద చిట్కాలు స్వయంగా మీ వాట్సాప్ లో పొందాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింకును క్లిక్ చేసి జాయిన్ అవ్వండి*🍃👇👇👇👇
https://chat.whatsapp.com/DXl9tZ1r0wuDWLvrSnYioI?mode=ac_t

*ఇట్లు,*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*Dr. Shiva Shankar*
*8978621320*

No comments:

Post a Comment