మా ఫ్రెండ్ బందువుల్లో వారివదిన గారికి షుగర్ వ్యాధి ఉంది. ఆమెకు పెదవి మీద 5 నెలల క్రితం పొక్కు వచ్చి పుండు లా అయింది.
కాకినాడ లోని ఒక కార్పొరేట్ హాస్పటల్ లో చూపించగా
బై-ఆప్సీ (ముక్క తీసి) టెస్ట్ చేసి కేన్సర్ గా నిర్ధారించి రిపోర్టు ఇచ్చి, హాస్పటల్ లో జాయిన్ అయి రెండు రోజులు ఉండమని తరువాత ఆపరేషన్
చేసి, రేడియేషన్ ఇస్తామని చెప్పారు.
మేము ఆమెను కాకినాడ కార్పొరేట్ హాస్పటల్ లో జాయిన్ చేయకుండా ఆమెను తీసుకొని (అనకాపల్లి దాటాక)
“అగనంపూడి” లోగల “హోమిబాబా” కేన్సర్ హాస్పటల్ (టాటా హాస్పటల్) కి తీసుకొని వెళ్ళాము.వారు రిపోర్ట్ లు చూసి "ఇన్ని రకాలు టెస్ట్ లు ఎందుకు చేయించారు ? మీకు డబ్బు ఎక్కువగా ఉందా"
అని నవ్వి, "కాకినాడ హాస్పటల్ వారు తీసిన ముక్క లో కొంత భాగం వారి దగ్గర ఉంటుంది మీరు 15 సంవత్సరాలలో ఎప్పుడైనా తీసికోవచ్చు అది మీ “ హక్కు" వెళ్లి అది తీసుకొని రమ్మన్నారు.
మేము తిరిగి వచ్చి
కాకినాడ కార్పొరేట్ హాస్పటల్ వారిని టెస్టింగ్ కోసం తీసిన ముక్కలో టెస్ట్ కు పోగా ప్రిజర్వ్ చేసిన ముక్క అడుగగా
"మీకు రిపోర్ట్ ఇచ్చాము కదా ముక్క ఎందుకు ఇవ్వాలి ?ఇవ్వం" అంటే మేము పెద్దగా కేకలు వేసిన తరువాత ఇచ్చారు.
మరల మేము అది తీసుకొని టాటా హాస్పటల్ కు వెళ్ళాము వారు కాకినాడ లో తీసిన భాగం టెస్ట్ చేయగా కేన్సర్ కాదని రిపోర్ట్ వచ్చినది.
మరల వారు ఆ భాగం లో ఫ్లూయిడ్ తీసి టెస్ట్ చేశారు.కేన్సర్ కాదని వచ్చినది.
ఈ లోగా ఉన్న పుండు మాడిపోయినది, దానిని ఆపరేషన్ చేసి టెస్టు చేశారు, కేన్సర్ కాదని రిపోర్ట్ వచ్చినది. ఆమె ఏ మందులు వాడకుండా పూర్తి ఆరోగ్యం గా వున్నారు. అదే కాకినాడ కార్పొరేట్ హాస్పటల్ లో అయితే లక్షలాది రూపాయలు వసూలు చేసి ఆమె ప్రాణాలు కు హాని తెచ్చేవారు. దీనికి టాటా హాస్పటల్ మొత్తం ఖర్చు 3000/- కూడా కాలేదు.
టాటా హాస్పటల్ లో కేన్సర్ కు సంబందించిన అత్యున్నత నిపుణులైన డాక్టర్లు 10మంది కంటే ఎక్కువ మంది ఉంటారు వారు అందరూ కేస్ డిస్కస్ చేసి చావు అంచుకు వెళ్లిన వారిని కూడా బ్రతికిస్తారు. ఆరోగ్యశ్రీ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్ వారికి ఉచితంగా వైద్యం చేస్తారు.మిగిలినవారికి కార్పొరేట్ హాస్పటల్ లో 15 లక్షలు ఖర్చు అయితే ఇక్కడ 50 వేలు అవుతుంది. ఇక్కడ డాక్టర్లు ,స్టాఫ్ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. హాస్పటల్ చాలా పరిశుభ్రం గా ఉంటుంది.ఇది కేన్సర్ పేషంట్లకు ప్రాణ భిక్ష పెట్టే దేవాలయం లాంటిది.
ఇది కేంద్ర ప్రభుత్వ సహకారం తో టాటా క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, ముంబై వారు నిర్వహిస్తున్న కేన్సర్ హాస్పటల్.
నేను ముంబై టాటా కేన్సర్ హాస్పటల్ కు కూడా వెళ్ళాను.అక్కడ వందలాది మంది నిపుణులైన డాక్టర్ల తో సుమారు 200 ఎకరాల విస్తీర్ణం లో కేన్సర్ హాస్పటల్ టాటా గ్రూప్ వారు నడుపుచూ లక్షలాది మంది ప్రాణాలు నిలుపు చున్నారు.
కలుషిత ఆహారం, వాతావరణం వలన మనము తరచు మనకు తెలిసిన వారు ఎవరో ఒకరు కేన్సర్ రోగులను చూస్తున్నాం. చాలా కార్పొరేట్ హాస్పటల్స్ దానిని ఆసరాగా చేసుకుని అరాకొర వైద్యం అందించి లక్షలాది రూపాయలు వసూలు చేసి, వారి ప్రాణాలు కూడా హరింప చేస్తున్నారు. మీకు తెలిసిన వారికి, గ్రూపు లకు ఈ మెసేజ్ పంపి కొన్ని ప్రాణాలైన కాపాడమని మనవి............
(షేర్ చేయబడిన మెసేజ్)
“”””””””””””
Sekarana
No comments:
Post a Comment