Thursday, July 10, 2025

 నేటి మంచిమాట
నీ శక్తి వేరు, పక్కోడి శక్తి వేరు 
నీ అదృష్ట దిశ వేరు పక్కోడి అదృష్ట దిశ వేరు 
నీ పుట్టుక చావు తేదీలు వేరు పక్కనోడి పుట్టుక చావు తేదీలు వేరు 
కాబట్టి ఇతరులతో పోల్చుకోకు, క్రుంగిపోకు..

జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని అంకెలు మార్చుకోమని ఇల్లు మార్చుకోమని ఇలవేల్పును మార్చుకోమని చెబుతారు కానీ బుద్ధి మార్చుకోవాలి అని ఎవరు చెప్పరు ఇదేమి విచిత్రం.

 వాదిస్తాడు వారిస్తాడు విసిగిస్తాడు వెనకేసుకొస్తాడు ఆటలాడుతాడు పోట్లాడుతాడు పోరాడుతాడు ప్రాణమిస్తాడు పద్ధతి ఏదైనా నీ తోడు మాత్రం విడవడు వాడే నీ ప్రాణ స్నేహితుడు.

రెండువేల రూపాయల చెప్పులను గుడి బయట వదిలేస్తాం , 20 రూపాయలు కొబ్బరికాయను గుడిలోకి తీసుకువెళ్తాం. కావున గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు ధనాన్ని చూసి కాదు అని గుర్తుంచుకుందాం. 

శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment