Sunday, July 20, 2025

 *మన ఆరోగ్యం…!

                       *బార్లీ..!*
                    
బార్లీ నీరు:

పోషకాలు అందించే బార్లీ వేసవికి సహజసిద్ధమైన ఔషధం లాంటిది. శరీరంలోని వేడిని తగ్గించి, తక్షణ శక్తిని అందించే గుణాలు ఇందులో అధికం. అసలు ఇది ఎలా మేలు చేస్తుందంటే…
బార్లీలోని పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
కాల్షియం, ఇనుము, మాంగనీసు, మెగ్నీషియం, జింక్‌, రాగి వంటి ఖనిజ లవణాలు… విటమిన్లు,  యాంటీ - ఆక్సిడెంట్లను అందిస్తుంది బార్లీ.
ఈ గింజలు హృద్రోగాలను దరి చేరనివ్వవు. అధిక బరువును తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాదు… వ్యాధి నిరోధకశక్తి కూడా పెరుగుతుంది.
బార్లీ శరీరంలో అధిక నీటిని కూడా తొలగిస్తుంది. మూత్ర సంబంధ సమస్యలను కూడా అదుపులో ఉంచుతుంది.
బార్లీ నీటికి మజ్జిగ, నిమ్మరసం, తేనె, నారింజ రసాన్ని కలిపి తాగితే… రుచిగా ఉండటమే కాదు, వేసవిలో శరీర ఉష్ణోగ్రతను సమతూకం చేస్తుంది. ఎవరైనా బార్లీ నీటిని తాగొచ్చు.

*మజ్జిగతో బార్లీ:*
బార్లీని లేత గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించుకుని, పొడి చేసుకోవాలి. మూడు కప్పుల నీటిని పొయ్యిపై పెట్టి మరిగించాలి. అలాగే రెండు చెంచాల బార్లీ పొడిని పావుకప్పు నీటిలో ముందుగా కలిపి ఉంచుకోవాలి. మరిగిన నీటిలో ఈ మిశ్రమాన్ని కలపాలి. పది నిమిషాలు ఉడికించి చల్లార్చి వడకట్టుకోవాలి. ఈ నీటికి పావు గ్లాసు పల్చని మజ్జిగ, చిటికెడు ఉప్పు వేసి ఈ వేసవిలో తరచూ తాగితే మంచిది.

*ఇలా కూడా...*
*ఒక  పాత్రలో  1 లీటర్  మంచి నీటిని  తీసుకుని ఆ నీటిలో  గుప్పెడు  బార్లీ  గింజలను  వేయాలి. 20 నిమిషాలపాటు  ఈ నీటిని  బాగా  మరిగించాలి.  దీంతో  బార్లీ  గింజలు  మెత్తగా  మారి, వాటిలోని  పోషకాలన్నీ  నీటిలోకి  చేరతాయి.  తర్వాత  ఆ నీటిని  చల్లార్చి, వడపోసి  అందులో  కొద్దిగా  నిమ్మ రసం  లేదా  తేనె  కలుపుకోవాలి.  ఈ నీటిని  నిత్యం  ఉదయాన్నే  పరగడుపున  తాగాలి.  లేదా  మధ్యాహ్నం  ఎండకు  బయటకు  వెళ్లి వచ్చిన వారు  కూడా  తాగవచ్చు.  ఫ్రిజ్ లో  ఉంచి  తాగితే  శరీరానికి  చల్లదనం  కలుగుతుంది.  అలాగే  ఈ బార్లీ నీటిని  తాగడం వల్ల  మనకు  ఇంకా  అనేక  లాభాలు  కలుగుతాయి.*

*బార్లీ  నీటిని  తాగితే  శరీరంలోని  వ్యర్ధ,  విష పదార్ధాలన్నీ  మూత్రం  ద్వారా  బయటకు  వెళ్లిపోతాయి.  మూత్రాశయం  శుభ్రంగా  మారుతుంది.  కిడ్నీ స్టోన్లు  కరుగుతాయి.  ముఖ్యంగా  వేసవిలో  మూత్ర  సమస్యలతో  బాధపడే వారికి  బార్లీ నీళ్లు  చక్కని  ఔషధం  అని  చెప్పవచ్చు.  బార్లీ నీటిని  తాగడం  వల్ల  శరీరంలో  ఉన్న  వేడి  బయటకు  పోయి  శరీరం  చల్లగా  మారుతుంది.  అలాగే  జీర్ణ  సమస్యలైన  గ్యాస్,  అసిడిటీ,  మలబద్ధకం  ఉండవు.  కీళ్లు,  మోకాళ్ల నొప్పులు  తగ్గుతాయి.  విరేచనాలు అయిన  వారు బార్లీ నీటిని  తాగితే  మంచిది.  బరువు  తగ్గాలనుకునే వారు  బార్లీ నీటిని  తాగాలి.  బార్లీ నీటిని  తాగడం వల్ల  శరీరంలో  ఉన్న  చెడు  కొలెస్ట్రాల్  కరుగుతుంది.  రక్త సరఫరా  మెరుగు పడుతుంది.  వడదెబ్బ  తగలకుండా  ఉండాలన్నా,  ఎండలో  తిరిగి  వచ్చిన  వారు  అనారోగ్యం  బారిన  పడకుండా  ఉండాలన్నా..  బార్లీ నీటిని  తాగాలి.*✍️-సేకరణ.
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment