దేవుడoతే....
కొన్ని
న్యురాన్లు
తో
ఓ పదార్థం
చేసి
దాన్ని
మెదడంటాడు ...!
దానికి
తెలివిచ్చి
కరుకుదనమిచ్చి
కుట్ర ఇచ్చి
ఖచ్చితత్వమిచ్చి
వ్యూహమిచ్చి
గెలుపుకు
ఉపయోగపడ్తుదంటాడు ...!!
అంతలోనే
కొన్ని
కండరాల
ముద్ద తెచ్చి
గుప్పెడంత
కుప్పగా చేసి
దాన్ని
"దిల్ "అంటాడు
దానికి
జ్ఞానమిచ్చి
దయ ఇచ్చి
కరుణ ఇచ్చి
మోహమాటమిచ్చి
మొహమిచ్చి
ప్రేమించు కో
ఫో ..
అంటాడు
నేను
నెత్తీ
నోరు
కొట్టుకుంటూ ...
ఇస్తే
దిమాక్ ఇవ్వు
యుద్ధం చేస్తా ..!
లేకుంటే
దిల్ ఇవ్వు
ప్రేమ యుద్ధం చేస్తా నని ..!!
మొత్తుకుంటూనే వున్నా...
వింటాడా
దేవుడు ...?
వినడు ...!
మస్తిస్కాన్ని
మనసుని
ఒక్క
దేహాo లోనే కుక్కాడు
షేరింగ్ ఆటో ల్లో జనాల్లాగా
మెదడు
యుద్దానికి సిద్ధమoటుంది
మనసు
ప్రేమించి చూడుమoటుంది
రెంటికీ చెడ్డ రేవడి లా
కొట్టుమిట్టాడు తుంది
దేహం ..
నా
తండ్లాట చూసి
చిరునవ్వులు
చిందిస్తున్నాడు
జగన్నాటక సూత్రధారి ..
దేవుడంతే
మరి...!!
No comments:
Post a Comment