Thursday, July 10, 2025

 *అమ్మ అంశ, ఆడపిల్ల. "తనకు మారుగా" భగవంతుడు సృష్టించిన ఒక అవతారం అమ్మ అయినప్పుడు, మరి ఆ లక్షణాలు పుణికి పుచ్చుకున్న ఆడపిల్ల అంశ కాక మరెవరు?*🙏

*ఆడపిల్లని మనం పెంచుతాము అనుకోవడం, మన పెంపకమే అనే అనుభూతి కేవలం మన తృప్తి కోసం. భగవంతుడే అలా పంపుతాడు. ఆడపిల్ల "నాన్న కూతురు" అని అనిపించుకున్నా కూడా, అమ్మ తరపున నాన్నను ప్రేమించే ఆమె, అమ్మ కూతురే.*💕

*మగపిల్లలు కూడా వారి పుట్టుకతోనే వచ్చే లక్షణాలు కలిగివుంటారు. అందుకే చాలా సందర్భాల్లో చెప్పినమాట ఆడపిల్ల వింటుంది కానీ, మగపిల్లవాడు కాదు.*

*దయ, జాలి, ప్రేమాభిమానాలు, దీక్ష, పట్టుదల, కారుణ్యం, సహనం,‌ ఓర్పు... ఇలాంటి లక్షణాలు కేవలం స్త్రీ సొత్తు. సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టి, కాపాడే బాధ్యత భగవంతుడు ఆమెకే ఇచ్చాడు. పురుషుడు ఒక సహకారం అందించే వాడు మాత్రమే.*

*"త్యాగశీలవమ్మా మహిళా, అనురాగ శీలవమ్మా..."*❤️

*శుభోదయం.*🙏

No comments:

Post a Comment