తెలంగాణ బోనాల పండుగ అంటే ఒక ఇంటికో ఒక ఊరికో పరిమితమయింది కాదు రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలంగా జరుపుకునే బోనాల పండుగ..
తెలంగాణలోని అత్యంత ప్రముఖమైన మరియు ప్రాచీనమైన సాంస్కృతిక ఉత్సవాలలో బోనాల పండుగ ఒకటి. ఈ పండుగ 600 సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి ఉంది. పల్లవుల పాలన కాలం నుండి ఈ పండుగకు మూలాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. తరువాత, కాకతీయ రాజులు, శ్రీకృష్ణదేవరాయలు, కుతుబ్ షాహీలు కూడా ఈ పండుగను వైభవంగా జరుపుకున్నారు. కుతుబ్ షాహీలు ఈ పండుగను నెల రోజుల పాటు జరుపుకునేవారట...
బోనం అంటే ఇదే!
తెలుగు భాషలో ప్రకృతి వికృతి పదాలలో భోజనం అనే ప్రకృతి పదానికి బోనం అనేది వికృతి పదం. అమాయకపు భక్తులు అమ్మవారికి ప్రేమగా అందించే భోజనమే బోనం. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతుంది..
బోనాల వెనుక ఆచారం
తెలుగు సంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని అందుకే అమ్మవారికి ప్రీతికరమైన భోజనం, చీర, సారెలు సమర్పిస్తారని విశ్వాసం. ఒక కుటుంబం తమ కుమార్తెను తమ ఇంటికి తిరిగి వస్తే ఎంత ప్రేమగా స్వాగతిస్తారో, అదే విధంగా, భక్తులు అమ్మవారికి ఆప్యాయత అనురాగాలతో సాంప్రదాయ రీతిలో బోనాలు సమర్పిస్తారు...
🙏🕉️🙏
No comments:
Post a Comment