🔔 *పెద్దల మాట* 🔔
🔔"రేపటి వెలుతురు చూడాలంటే నేటి చీకటిని భరించాలి._
_రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధని భరించాలి."_
🔔 _మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు.మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోడానికి పది చేతులు వస్తాయి."_
🔔 ప్రయత్నం అనేది విత్తనం లాంటిది.నాటుతూ ఉండాలి...
చిగురిస్తే మానై పెరుగుతుంది. లేదంటే మన్నులో ఎరువుగా తయారవుతుంది."
🔔 తనవరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది...
అప్పటివరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది..🙏🚩
No comments:
Post a Comment