*రాజు అయినా, మంత్రి అయినా, బలవంతుడు అయినా, అందగాడైనా ఎవరికైనా స్నేహం అనేది ఎంత అవసరమో ఈ చిన్న పిట్ట కథ ద్వారా తెలియచేయబడింది*.
" విచారంగా ఉన్న ఒక కోతి ఒక రోజు తన జీవితాన్ని చాలించాలని నిద్రపోతున్న సింహం చెవులను లాగింది. సింహం కోపంతో తప్పకుండా చంపుతుందని దాని అలోచన.
*ఆ సింహం గర్జిస్తూ ఈ పని ఎవరు చేశారు? మరణాన్ని ఎవరు ఆహ్వానిస్తున్నారు అని అడిగింది*.
నేనే మాహా రాజా! స్నేహితులు లేక నా జీవితం నిస్సారంగా మారి మానసిక ఆందోళకు గురి అయింది. చనిపోవాలని అనుకొంటున్నాను. నన్ను చంపెయ్యండి మాహా రాజా అని కోతి బదులిచ్చింది.
సింహం నవ్వుతూ నీవు నా చెవులు లాగినప్పుడు ఎవరైనా చూసారా అని అడిగింది. *ఎవరూ చూడలేదని కోతి బదులిచ్చింది*.
*చెవులు లాగుతుంటే భలే మజాగా ఉంది. ఇంకొన్ని సార్లు లాగమని ఆదేశించింది సింహం*
అలా ఆ రెండూ స్నేహంగా జీవించి సరదాగా చాలాకాలం బ్రతికాయి.*
నీతి ఏమిటంటే ఒంటరిగా ఉంటే కోతికే కాదు. సింహాన్ని కైనా జీవితం నిస్సారమౌతుంది.
అందుకే
*స్నేహితులు ఉంటే జీవితం సరదా సరదాగా ఉంటుంది. వసపిట్టలా వాగుతూ, ప్రేమగా వీపు తడుతూ, ఆప్యాయంగా* నాలుగు దెబ్బలు వేస్తూ నవ్విస్తూ మనల్ని ఆనందంగా ఉంచుతారు*.
అందుకే,
*పాత స్నేహితులతో కూడా టచ్ లో ఉండండి. సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యండి*.💃🧎🏼🧎🏻♀️
No comments:
Post a Comment