Sunday, July 20, 2025

 *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*


*ప్ర: 'మంగళవారం' అనే పేరులోనే 'మంగళం' ఉంది. కానీ ఆ రోజున* *'అమంగళం'గా భావించి ఏ పనినీ మొదలు పెట్టరెందుకు?*


 *జ :* 'మంగళవారం' పేరులో మంగళ శబ్దం కుజగ్రహానికి చెందిన పేరు. అంతేకానీ 'మంగళం' అనే భావంతో పెట్టినది కాదు. ఆ రోజు సూర్యోదయం కుజ (మంగళ) హోరలో జరుగుతుంది కనుక అది 'మంగళ' (భౌమ, కుజ) వారమయ్యింది. కుజగ్రహ ప్రభావం ఉన్న రోజు కనుక - గ్రహ లక్షణాలను బట్టి ఆ రోజున కొన్ని పనులు ప్రారంభించరాదన్నారు. అంతేకానీ ఆ రోజు 'అమంగళం' కాదు. ఆ మాట కొస్తే ఏ రోజూ అమంగళం కాదు. ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రయోజనం కలిగి ఉంటుంది.

*🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*

No comments:

Post a Comment