*✅తెలుసు కుందాం✅*
*🍋🍒🍎పండ్ల రుచిలో రహస్యమేంటి?🍇🍓🍊*
🟩రకరకాల పండ్లలో ఉండే రుచికి కారణం వాటిలోని రసాయనిక సంఘటనమే (chemical composition). ఒకే జాతి పండ్లయినా పచ్చిరంగులో ఉన్నప్పుడు ఒకలా, దోర దశలో ఒకలా, మిగుల మగ్గినప్పుడు ఒకలా రుచించడానికి కారణం కూడా ఇదే. పండ్లలో చక్కెరల శాతం మిగిలిన పదార్థాల కన్నా ఎక్కువగా ఉంటే అవి తియ్యగా ఉంటాయి. ఆమ్ల గుణమున్న పదార్థాలు (సిట్రిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ ఆమ్లం) ఎక్కువగా ఉంటే ఆ పండ్లు పుల్లగా ఉంటాయి. ఆల్కలాయిడ్లు, క్షార లక్షణాలు అధికంగా ఉండే పండ్లు వగరుగా అనిపిస్తాయి. ఆయా పండ్లలో రసాయనిక సంఘటన మీదనే రుచి, వాసన, రంగు, ఆహారపు విలువలు సైతం ఆధారపడి ఉంటాయి
No comments:
Post a Comment