Saturday, July 19, 2025

 🙏🔥 🔥🔥🙏" 
💐"*Empathic* *Communications*
( *సానుభూతి, కాదు "సహానుభూతి భావప్రసారం*) 
     🚩🚩🚩
*MAZUMDAR*
 *BANGALORE*
      🙏🇮🇳🇮🇳🙏
🩸" *మన ఎదుటివారు సంభాషించేటప్పుడు చాలాసార్లు మనం వారు చెప్పేది మనం వినం*.
*సరియైన "నిర్ధారణ కాకుండానే"  ముందు సిఫార్సు చేస్తూ!, ఉంటాం*!
*మీ పిల్లవాడు ఈ స్కూలు నాకు నచ్చటం లేదు అని అన్నాడనుకోండి*?  
*మనము ఏదో తొందరపడి, కొన్ని చర్చించి కొందరి సలహాలతో సమస్యలను త్వర, త్వరగా పరిష్కరించాలని కోవటం మానవ నైజం*  *"అసలు సమస్య ఏమిటి? కనుక్కునేందుకు సమయం తీసుకోము, సమస్య గురించి లోతుగా మూలాలలోకి పోయి ఆలోచించం అర్థం చేసుకోము*.   "*ముందు అర్థం చేసుకోండి?"  తర్వాత "అర్థం అవ్వండి" .   ఈ సూత్రమే ప్రభావంతమైన పరస్పర భావప్రసారానికి కీలకమైనది*
.
💐" *శీలము, భావప్రసారము*".
*మీరు చదవటమే! కాదు రాయడము కూడా*!   *భావప్రసార సాధనాలే!   అట్లాగే మాట్లాడటము వినటము కూడా ఈ నాలుగు ముఖ్యమైన ప్రచార సాధనాలు*" *వీటిని మనము ఆచరిస్తూ!  ఉంటాము, కానీ సక్రమముగా సరి అయిన పద్ధతిలో ఆచరించటం, మన 'ప్రభావశీలత' కు నిదర్శనము.   అత్యంత కీలకము* కూడా!
*జీవితంలో అత్యంత ముఖ్యమైన నైపుణ్యము "భావప్రసారము*" .  *ఎదుటి మనిషి తన ఆలోచనని ఏ దృక్పథం నుంచి మనకి చేర వేస్తున్నాడు, ఓపికగా వినే శిక్షణ నేడు ఉన్నదా*!
అది *వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలలో భాగంగా మాత్రమే ఉంటుంది* *ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే సత్య శీల ప్రాతిపదికెన గాని, సత్సబంధాల ప్రాతిపదికనగాని, ఉండదు  'శీలం' ప్రతిపాదికంగా సంబంధాల ప్రాతిపదికగా "ఎదుటి మనిషి చెప్పేది వినటం"  చాలా ముఖ్యం*.

"🙏 *నేడు ఈ లౌకిక ప్రపంచంలో వ్యవహరించటానికి,  మీ జీవన భాగస్వామిని,     మీ సంతానాన్ని, మీ బాస్ ని, ఇరుగుపొరుగుని, సహోద్యోగిని, స్నేహితులను వారిని అర్థం చేసుకోవాలి కదా*!

"  🌷 *మీరు నైపుణ్యాన్ని అనుసరిస్తే! ఎదుటి వ్యక్తి  మీలోని కపటత్వాన్ని కనిపెడతాడు*? *నీ ఉద్దేశమేమిటి*? *అని ఆలోచిస్తాడు కూడా*!
*కావున, మీది ఒక ఉదాహరణగా మాత్రమే ఉండాలి*  *మీ వైఖరి, ప్రవర్తన మీ "శీలం"  నుంచి వస్తాయి,  మీ నిజస్వరూపంలో నుంచి వస్తాయి. అంతేకానీ, మిమ్మల్ని గురించి ఇతరులు చెప్పే దాన్ని బట్టి గాని, ఇతరులు మిమ్మలని ఎలా అనుకోవాలి అని, మీరు ఆశించే దాన్ని బట్టి కాదు.   మీరు ఉండే వాస్తవమైన అనుభవాలు ద్వారానే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.   మీ జీవితంలో అన్నీ వైరుధ్యాలే!  ఉంటే, మీరు ఒక్కొక్కసారి కఠినంగా, మరొకసారి కరుణా భరితంగా ఉంటే, వీటన్నిటికీ మించి మీ "వ్యక్తిగత ప్రవర్తన", సమాజంలో మీ ప్రవర్తన విరుద్ధంగా ఉంటే,  మీతో ఎవరు మనసు విప్పి మాట్లాడరు.   వారికి  ప్రేమ కావలసివున్న, నీతో అవసరం ఉన్నా!  కూడా వారి అభిప్రాయాలను మీ ముందు విప్పడానికి ఇష్టపడరు.  ఒకవేళ చెప్పనా  క్షేమంగా ఉంటాయని భావించరు,   వారిలోని సున్నితమైన భావాలను, మీతో పంచుకోరు?  ఏమో అలా చెప్పకుంటే? ఏమవుతుందోనని సందేహిస్తారు కూడా*!

☀️ *మీరు "సహానుభూతి" తో వినటం ముందు నేర్చుకోవాలి.  " నిష్క పట్వాన్ని", నమ్మకాన్ని  ఇచ్చేది" సత్య శీలమే" హృదయ సంబంధాలను పరిపుష్టం చేసుకోవాలంటే!  "అంతః కరణ".  బ్యాంకు ఖాతాలను పెంచుకుంటూ! ఉండాలి*,

🙏🏽"*Empathic Listening*"                     ( *సహాను భూతి శ్రవణం*")
" *ముందు అర్థం చేసుకోండి"  మన దృక్పథంలోనే గణనీయమైన మార్పు  రావాలి*.  *ఎదుటివారిని అర్థం చేసుకునే ఉద్దేశంతో వినరు.  ఎదుటివారు మాట్లాడే సమయంలో తాము మాట్లాడవలసిన దాన్ని సిద్ధం చేసుకుంటూ! ఉంటారు*.   " **ఎదుటివారు చెప్పే మాటలను," తమ దృక్పథం" ప్రకారము వడపోసుకుంటూ ఉంటారు*.   *ఇతరుల జీవితాలలో తమ సొంత జీవనాన్ని అనుభవాలని చూసుకోవటానికి ప్రయత్నిస్తూ! ఉంటారు*.
*నాకు అలాగే జరిగింది, నా అనుభవం చెప్తా! విను,  తమ స్వంత అనుభవాలన్నీ ఎదుటివారి మీద "ప్రాజెక్ట్ చేస్తూ!" ఉంటారు*

" 🪷 *వాడు నీ మాట వినడు కనుక నువ్వు వాడిని అర్థం చేసుకో లేక పోతున్నావు*". *ముందు వారు చెప్పేది వినాలి*.
"*పిల్లవాడి మనసులో జరిగే "ఘర్షణ"  గురించి, చిన్న ఊహ కూడా లేదు*. *తన మనసులోకే తొంగి చూసుకొని ప్రపంచం అంతా అందులోనే ఉందను కుంటున్నాడు. పిల్లవాడి మనస్సు కూడా*!
"*ఇతరుల మనసులో ఏముందో? అర్థం చేసుకునే ప్రయత్నం ఉండదు*.

🌹" *అవతల వ్యక్తి మాట్లాడేటపుడు 'మనం ' వింటాము.   నాలుగు స్థాయిలలో ఉంటుంది.   మనం ఆ వ్యక్తిని ఉపేక్షిస్తాం!  అంటే  అతన్ని పరిగణలోకి తీసుకోం!. "అసలు వినటం" అన్నమాట.   ఒకసారి విన్నట్టు నటిస్తాం!  మధ్య మధ్యలో "ఊ"  అనే" "నిజం" అనో " ఓహో" అనో!,  అంటూ ఉంటాం!. ఒక్కొక్కసారి కొంత విని, కొంత వినక - ఉంటాం! చిన్నపిల్లలు అదేపనిగా మాట్లాడుతుంటే  ఈ పద్ధతి ద్వారా అవలంబిస్తాం*.!

🔥 *ఒక్కొక్కసారి "మనసుపెట్టి వింటాం!  " కూడా కానీ మనలో చాలా కొద్ది మాత్రమే ఐదవ స్థాయిలో వింటారు,. అదే "*సహానుభూతి శ్రవణం*"
*వినటం ఒక్కొక్కసారి చెప్పేవాడిని అనుమానించే రీతిలో కూడా ఉంటుంది అది తప్పకుండా  'ఆత్మ కథాత్మకంగా'  కూడా ఉంటుంది.   మనం 'శ్రవణ నైపుణ్యాలు' ప్రదర్శిస్తే! వినేటప్పుడు ఆత్మకథలు చెప్పకపోయినా! అవి మన ఆలోచన నిండా ఉంటాయి*.
                                🇮🇳  
 *సహానుభూతితో వినటం అంటే అర్థం చేసుకునే ఉద్దేశంతో వినటం అంటే! ముందు మనం అర్థం చేసుకోవటం నిజంగా అర్థం చేసుకోవడం అనేది మళ్లీ పూర్తిగా భిన్నమైన దృక్పథం*.  *సహానుభూతి శ్రవణం లో చెప్పే వ్యక్తి మనసులోకి వెళ్ళిపోతాం!  అతని "ఆలోచన విధానం" లోకి వెళ్లి పోతాం !  ఆ దృక్పథం నుంచి మనము అతను చెప్పే విషయాన్ని చూస్తాం*! *అతను ప్రపంచాన్ని చూసే విధంగానే మనము చూస్తాం! అతని "దృక్పథం" మనకి అర్థమవుతుంది*. *అతను ఎలా భావిస్తున్నాడు అనుభూతిస్తున్నాడో అర్థం చేసుకుంటాం*.
"👌 *సహానుభూతి"  అంటే "సానుభూతి" కాదు*.  "*సానుభూతి"  అంటే ఒక రకమైన " ఆమోదము", "తీర్పు", అది ఒకప్పుడు సరి అయిన "స్పందనే". చాలామందికి "సానుభూతి   కడుపు నింపుతుంది*". *అటువంటివారు "పరాధీనులుగా" ఉంటారు*".
*సహానుభూతిలో వినటం అంటే?  చెప్పే వారితో పూర్తిగా అంగీకరించటం*. *వారు చెప్పింది ఆమోదించటం కాదు.  చెప్పే వారిని లోతుగా సంపూర్ణంగా అర్థం చేసుకోవడం.   మానసికంగా, భౌతికంగా కూడా*         "*సహానుభూతి" శ్రవణం అంటే చెప్పేదంతా గుర్తుపెట్టుకోవటం*. ( *మాటలతో సహా*)
*'భావప్రసార నిపుణులు'  అనేది "మన భావాలు 10 శాతం మాత్రమే* *ప్రాతినిధ్యం వహిస్తాయి*. *మరో 30 శాతం మనం చేసే "శబ్దాలు ప్రాతినిధ్యం" వహిస్తాయి*.   *మిగతా 60 శాతం మన "దేహ భాష" (బాడీ లాంగ్వేజ్) ప్రా తినిత్యం వహిస్తుంది. "సహానుభూతి " శ్రవణంలో మీరు చెవులతో వింటారు. మీరు ముఖ్యంగా "కళ్ళతో" కూడా వింటారు.   హృదయం తో వింటారు*. *మీరు ఆ మాటల్లోనే భావాలను అర్ధాలను తెలుసుకోవటానికి వింటారు.    ప్రవర్తనని అర్థం చేసుకోవటానికి వింటారు.    వినేటప్పుడు మీ 'మెదడు' యొక్క రెండు పార్శాలను ఉపయోగిస్తారు.  మీరు అర్థం చేసుకుంటారు"*. *అనుభూతిస్తారు*.

🌹" *సహానుభూతి" శ్రవణం.   చాలా శక్తివంతమైనది*. "*ఎందుకంటే? అందులో మీకు కావలసిన ఖచ్చితమైన సమాచారం దొరుకుతుంది*.  *చెప్పేవారి మనసులోని హృదయంలోని "వాస్తవికతను" అర్థం అందుకుంటాం!. అంతేకాదు "సహానుభూతి శ్రవణం" మన అంతఃకరణ ఖాతాను పెంచుతుంది*". *ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఆమోదిస్తేనే! తప్ప , మనం వేసిది ఏది,  ఖాతాలో జమకాదు*.      "*సహానుభూతి*"
*శ్రవణం*  *శ్రవణం ఒక చికిత్స లాంటిది మనసు గాయాలను మాన్పే లేపనంలా పనిచేస్తుంది.  కొత్త ఊపిరిని ఇస్తుంది*.
*మనం సహానుభూతితో *ఎదుటి మనిషిని , ఆ వ్యక్తికి అటువంటి మానసికమైన ఉరట*,  *ఉత్సాహం ఇచ్చినట్లే!*
*ఆ ఉత్సాహము ఊపిరి*  *ఇచ్చింది తరువాతే సమస్యల పరిష్కారము" ప్రభావితం చేయటం వంటివి ఆలోచించాలి   ఈ మానసికమైన ఉత్సాహము కలిగించటం అనేది జీవితంలోని ప్రతి రంగంలోనూ! భావప్రసారాన్ని ప్రభావితం చేస్తుంది.  *ఇతరులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోకపోతే మనం పరస్పర ఫలిత సంబంధాలతో ఉత్తమ ఫలితాలు సాధించలేము*.
*సహానుభూతి సేవడం కాస్త సహాసోపేతమైనది కూడా!  వినే వారి క్రమంలో మీరు కూడా మీ మనసు విప్పి మాట్లాడతారు. కనుక అందుకు మీకు గట్టి అంతరంగ భద్రత ఉండాలి*.
  
 👍 " *బాడీ లాంగ్వేజ్ లో మరికొన్ని "కొటేషన్స్*
        🇮🇳🇮🇳🇮🇳
🥁1)" *సాంస్కృతికంగా" "బాడీ లాంగ్వేజ్" ఉన్న తేడాలని రూపుమాపటం లో 'అమెరికన్ టెలివిజన్' ప్రబలమైన పాత్ర పోషిస్తుంది*."

🥁2)" *ఇతర , దేశ విదేశాలలో, సంస్కృతులలో వినయాన్ని ప్రదర్శిస్తే, హావభావాల గురించి నీకు తెలియకపోతే అక్కడ స్థానికులను అడగండి*."

🥁3)" *నిజానికి "నెపోలియన్" 5 "4 "పొడవు ఉండేవాడు.  కానీ చిత్రంలో మాత్రము ఆయన" ఆరు అడుగుల" పొడగరిగా కనిపిస్తారు*.

🥁4)" *ఒక ఇటాలియన్ పౌరుడి రెండు చేతులని కట్టేసి చూడండి.  అతనికి ఒక్క మాట కూడా మాట్లాడలేడు. ( వారు ఎదుటివారిని స్పృశిస్తూ! మాట్లాడతారు.  దానికి కారణం ఎదుటి మనిషిని మాట్లాడనివ్వకుండా నిరోధించటానికి వాళ్లు అలా ప్రవర్తిస్తారు*)

🥁5)" "*అరచేతులను రుద్దుకునే వేగమే ఆ వ్యక్తి ఎవరి ప్రయోజనాన్ని ఆశిస్తున్నాడు చెప్పేస్తుంది*."
     🙏🙏🙏
   ""*మజుందార్*"
🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

No comments:

Post a Comment