Saturday, November 1, 2025

 *#సాధారణజీవితము-పరమాత్మఅవసరము:* *#పరమాత్మఅంటే ఎవరు?ఏమిటి?: పునర్జన్మ:*

సాధారణజీవితము-పరమాత్మఅవసరము:  
పరమాత్మను సదాస్మరిస్తూ గుర్తుంచుకుంటూ జీవితమును సాధరణముగా గడపాలి. ఆత్మశుద్ధమయినది. పవిత్రమయినది. నిత్యనూతన ఆనందము. సాధకుడు ఎటువంటి విపత్కర పరిస్థితులలోనున్నను, ఆత్మయొక్క ఈ పరమానందస్థితిని విస్మరించ కూడదు. ఇచ్ఛారహితస్థితిలో ఉండవలయును. ఇచ్ఛారహితస్థితి అనగా ఆనందమును వదలుకోమని కాదు. అన్ని కోరికల కంటె పెద్దకోరిక అయిన పరమాత్మపొందే అన్ని వాంఛలనుతీర్చగలదు. పరిపూర్ణతృప్తిని అన్ని ఆనందములకంటే ఆనందము అయిన పరమానందమును ప్రసాదించును.
బాంక్ లో టన్నులకొద్దీ డబ్బు ఉండవచ్చు. అది మనది కానప్పుడు ఆ డబ్బు వలన మనకేమి ప్రయోజనము? పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. కాని ఆ పరమాత్మతో మనకేమి ప్రయోజనం? భగవంతుని గొప్ప తనము గురించి ఎన్నో పుస్తకాలలో చదివాము, ఎంతోమంది చెప్పగా విన్నాము. కాని అట్టి భగవంతునితో ప్రత్యక్షసంబంధము లేనప్పుడు మనకేమి ప్రయోజనము?మనస్సు మరియు ఇంద్రియ పరివేష్ఠితమయి పరిమితమయిన  మానవమేథస్సుతో భగవంతునితో సంబంధము పెట్టుకొనలేము. పదార్థము యొక్క వెలుపలి పాక్షికమయిన ప్రత్యక్షము(Indirect)కాని విషయజ్ఞానమును మాత్రమె తెలుసుకోగలము. అపరిమితమయిన ఆత్మావబోధ(Intuition)పదార్థము యొక్క వెలుపలి మరియు లోపలి విషయ జ్ఞానమును పరిపూర్ణము గా ప్రత్యక్షము(direct)గా తెలుపగలదు.
కేవలము ప్రేమద్వారానే పరమాత్మని పొందగలము. ఆ ప్రేమ నూటికి నూరు శాతము ఉండాలి. ఒక్క శాతముకూడా తక్కువ ఉండకూడదు.  
పరమాత్మఅంటే ఎవరు?ఏమిటి?: 
చాలామంది ‘నీవు భగవంతుని చూశావా’ అని అడుగుతారు, అడుగుతూ ఉంటారు. పరమాత్మ మిథ్య కానే కాదు. అది పరమసత్యము. అవును ‘నేను భగవంతుని చూశాను, మాట్లాడాను, మీరూ చూడగలరు, మాట్లాడవచ్చు’. కేవలము క్రియాయోగా సాధనద్వారానే అది సాధ్యము.  నీవు పరమాత్మతో  ప్రత్యక్షానుభవములేకుండా చెప్పేదంతా ఊహాగానములేకాని సత్యము కానే కాదు, కానేరదు. నీరు అనగా హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ల(H2O) కలయికే అని ఘంటాపథంగా చెప్పగలవు. ఈ జగత్తులో రెండు ముఖ్యమయిన వస్తువులు ఉన్నవి. మొదటిది శక్తి(Force) రెండవది తెలివి(Intelligence). శక్తి(Force)కి తెలివి(Intelligence)కి చాలా వ్యత్యాసము ఉన్నది. విద్యుత్ అనేది శక్తి. దానిని bulb లో పెడితేనే వెలిగేది. bulb లోపెట్టించేది తెలివి(Intelligence).  ఈ జగత్తులో తెలివి(Intelligence)లేని వస్తువు(Element)లేదు. మానవశరీరము అనేది ఎన్నో ఇనుము బంగారము రాగి ఇత్యాది  వస్తువుల కలయిక (Combination)యే. ఆ వస్తువు(Element)లు అన్నీ సాధారణముగా అంగటిలో లభ్యమయ్యే వస్తువులే. కాని వాటిలో మానవశరీరమునకు ఉపయోగబడే రీతిలో తెలివి (Intelligence)లేనియడల అవి అన్నీ జడములే, మానవశరీరము కూడా జడముగానే ఉండును. ఈ తెలివి అనేది ఎక్కడినుండి వస్తున్నది? ఈ పశువులు, వృక్షములు, పురుగులు, ఇత్యాదివన్నీ వాటి వాటి పద్ధతులలో మనటానికి  తెలివి అనే ఒక కర్మాగారము (Factory) అనేది ఉంటేనేగదా లభ్యమయ్యేది. పరమాత్మ ఆ తెలివి అనే అటువంటిది వేరొకటిలేని ఒకే ఒక కర్మాగారము. దానిలోనుండి వ్యక్తీకరించబడిన వస్తువలు లయబద్ధము (Harmonious)గా స్థితివంతమవుతాయి. అటువంటి తెలివి అనే కర్మాగారము లేనియడల ఋతువులు ఉండేవికావు, క్రమబద్ధముగా వచ్చేటివికావు, ఆకలిని చల్లార్చుటకు ఆహారమూ ఉండెడిదికాదు. పరమాత్మ అనేది సర్వమూ తెలిసిన సర్వం వ్యాపించిన సర్వశక్తివంతమయిన అసమానమయిన అనంతమయిన తెలివి. 
పరమాత్మ అనే అసమానమయిన తెలివి వలననే ఈ జగత్తు, జగత్తులోని వస్తువులు వాటివాటి కక్షలలో క్రమబద్ధములో తిరుగుటకు కారణము. అంతే కాదు ఈ భూమి మరియు భూమిమీద మానవుడు మనటానికి కారణము. క్రియాయోగా ధ్యానములో మనకు అమితమయిన ఆనందము కలుగుట పరమాత్మయొక్క ఉనికికి నిదర్శనము. 
మానవుడు భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మిక జీవి. శారీరక ఆరోగ్యమును వ్యాయామము యోగాసనములద్వారా కాపాడుకొనవలయును. మానసిక ఆరోగ్యమును ఏకాగ్రతద్వారా పెంపొందించుకోవలయును. దీనిద్వారా శారీరక ఆరోగ్యము కూడా కుదుటపడును. ఆధ్యాత్మిక ఆరోగ్యమును పరమాత్మపై ఏకాగ్రతద్వారా పెంపొందించుకోవలయును.  దీనిద్వారా శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యములు అన్నీ కుదుటపడును. పరమాత్మతో అనుసంథానం ఏర్పరచుకుంటే అప్పుడు పరమాత్మ తన బిడ్డ అయిన సాధకునికి ధర్మబద్ధమయిన కోరికలన్నీ తీరుస్తాడు.ఆదిత్యయోగీ.
జీవము(Life) అనేది ఎలక్ట్రాన్స్ మరియు అణువుల తరంగము(Wave)లు,  జీవద్రవ్య(Protoplasm)తరంగములు, శక్తి (Power) తరంగములు, పరమాత్మ అనే సముద్రముపై తేలియాడే చేతనా  (Conscious-ness) తరంగములు. జీవము అనేది తెలివిగల క్రమ(Organized) పద్ధతిలో నడిచే కదలిక(Motion). ఆ కదలిక(Motion)యే పూలు రాళ్ళు మట్టి మనిషి అన్నీను.  మానవశరీరము అనేది ఆత్మను చుట్టబడిన ఎలక్ట్రాన్స్ (Electrons) ప్రాణశక్తి మరియు తెలివిలు. 
పునర్జన్మ: 
పునర్జన్మ అనగా ఒక వస్తువు లేదా మనిషియొక్క ప్రగతికొరకై జరుగు మార్పు. శరీరము అనిత్యము. ఆత్మ నిత్యము. ఈ ఆత్మ నిజమునకు చచ్చుటలేదు. రూపము మార్చుంటున్నది, మారుతున్నది. మార్పు సహజం. నిన్నటి నీరు ఈ రోజు త్రాగము. త్రాగితే జబ్బు చేస్తుంది. నిలిచిపోయిన నీరు వాసనకొడతాయి. కనుక నిరంతరమూ ఈ జగత్తులో మార్పు అవసరము. కదలిక అవసరము. అదే ప్రగతిపథము. మానవశరీరము పరమాత్మయొక్క వ్యక్తీకరణే. ఈ జగత్తులోనే జగత్తుతోనే మన ఉనికి ముడిపడియున్నది. 
స్థూలశరీరము అనేది గడ్డకట్టిన (Materialized) స్థూలశక్తి. శక్తి వ్యాధిగ్రస్తము అవ్వదుగదా! రోగము అనేది ఒక భ్రమ. భ్రమ అని అనుకోంగానే సరిపోదుకదా. తల గోడకు బలముగా కొట్టుకొని బాధపడుతున్నట్లుగా కలగంటాము. మేల్కొనంగానే ఆ బాధపోతుంది. క్రియాయోగసాధన చెయ్యాలి. పరమాత్మతో అనుసంథానం పెట్టుకోవటము సాధించాలి. అప్పుడు స్థూలశరీరము అనేది గడ్డకట్టిన  స్థూలశక్తి అని సాధకుడు గ్రహిస్తాడు. స్థూలశక్తి అనేది గడ్డకట్టిన పరమాత్మ చేతన అని సాధకుడు గ్రహిస్తాడు. చేతనద్వారానే మనము ఈ శరీరమును పరమాత్మను గ్రహిస్తాము. మరణము అనేది ఆఖరి మజిలీ కానే కాదు. మరణము ప్రగతికి సోపానము. వ్యాధి మరియు అనేక ఈతి బాధలతోను అలసి సొలసిన ఈ శరీరమునకు సాంత్వన కలుగజేసేది మరణము. మరణరూపములో విశ్రాంతి తీసికున్న తదుపరి మనలోని కోరికలు తిరిగి విజృంభించును. కోరికల విజృంభణ బలమయినప్పుడు ఆ కోరికలుతీర్చుకొనుటకై తిరిగి ఇంకొక స్థూలశరీరమును ఆశ్రయించుకొనును జీవాత్మ. ఇట్లా జీవాత్మ శుద్ధాత్మ అగు నంతవరకు ఆఖరి ఏ చిన్నకోరిక ఇక లేనంతవరకు జీవాత్మకు స్థూలశరీర ధారణ తప్పదు.ఆదిత్యయోగీ.
ప్రతి ఆలోచన నిత్యమయినదే. ప్రతి మాట లేక శబ్దము నిత్యమయినదే. నిత్యమయిన ప్రతిఆలోచన మరియు ప్రతిమాట లేక శబ్దము పరమాత్మ వ్యక్తీకరణయే. ఆలోచనలు గోప్యముగా ఉంటాయి. ప్రతి వ్యక్తికీ, స్త్రీ లేక పురుషుడు, ఆలోచనలు వస్తాయి. అవి ఎన్ని అని లెక్క పెట్టలేము. మాటవరసకి 16,000 ఆలోచనలు అన్నారు. గోప్యముగాఉండే ప్రతిఆలోచనా గోపికయే. కనుక ప్రతిగోపిక పరమాత్మ వ్యక్తీకరణయే. శ్రీకృష్ణపరమాత్మకి 16,000 మంది గోపికలు అనుటలో అంతరార్థము ఇదే.  ప్రథమంగా ఆత్మ ఈ శరీరముతో ఆడుకుంటూ క్రమంగా శరీరమునకు బందీ అవుతుంది. కనుక ఈ స్థూల ప్రకృతికి అతీతముగా ఉండుట క్రియాయోగసాధనద్వారా అభ్యసించాలి. మానసికఎదుగుదల స్థూలఎదుగుదలకన్నా మిన్న అయినది. ఆత్మ శుద్ధమయినది. కనుక అది సహజసిద్ధముగానే స్థూల సూక్ష్మ మరియు ఆధ్యాత్మిక ప్రకృతిలకి అతీతముగా ఎదిగి ఆఖరికి తన స్వస్థానమయిన పరమాత్మను చేరుతుంది. దీనినే వికాసము(Evolution)అంటారు. 
ఒక పట్టుపురుగు పెద్దదయ్యి సీతాకోకచిలుక అవుతుంది. కాని అది పట్టు పురుగుగా ఉన్నప్పుడే దానిని పట్టుకొని చంపి పట్టుతీస్తాడు సాలెవాడు. మన క్రియాయోగాసాధన అంకురించకముందే మనము మధ్యలోనే దానికి భంగపా టు కలగజేస్తాము. ఫలితము: రోగము, భయము, రోగము, అజ్ఞానము ఇత్యాదివి. మనము ఆలోచనతరువాత చేస్తున్నాము. పని ముందర చేస్తున్నాము. మనకి పరమాత్మ కావలసినంత శక్తినిచ్చాడు. కనుక సాధకుడు సాధన ఫలితమునిచ్చేటంతవరకు వేరే ఆలోచనలను పెట్టుకొనకూడదు, సాధననుండి లేవకూడదు.  శరీరమును మనస్సు పరిపాలించాలి. శరీరమును మనస్సుకు సేవకుడుగా గుర్తించాలి. రోగచేతననుండి  ఆరోగ్యచేతనకు మనస్సును మరల్చాలి. మనశరీరమునకు హానికలిగించు తామస రాజస ఆహారములను చెడు-అలవాట్లను విసర్జించాలి. ‘నేను రోగిష్టిని, నాకు రోగము వచ్చినది’ అనే నకారాత్మకతలంపు మానుకొనవలయును. ‘నాకు ఈ రోగము తగ్గదు’ అని అనుకొని అవచేతనలో రోగము తగ్గకూడదు అని వాళ్లకి వాళ్ళే బీజము బలంగా వేసికొంటున్నారు.  ‘నేను దేవునిబిడ్డను, నేను ఆరోగ్య వంతుడిని’ అని సకారాత్మకతలంపు బీజము బలంగా వేసికొనవలయును..*
.

ఒకే సమయంలో పూర్తి తీక్షణత మరియు సంపూర్ణమైన నిశ్చలతను కలిగి ఉండటమే యోగశాస్త్ర సారం.....*
.
*ఆధ్యాత్మిక కుటుంబం -1* ప్రధానంగా ఆధ్యాత్మిక సమాచారంతో పాటు మధ్యాహ్న సమయంలో 2 లేదా 3 సైకాలజీ, హోమియో సంబంధ పోస్ట్లు వస్తాయి. ఆసక్తి కలవారు జాయిన్ అవగలరు.                                                       🪷⚛️✡️🕉️🌹👇https://chat.whatsapp.com/H0zyZWXVQLr6ol6cJ25uR0?mode=ems_copy_t

No comments:

Post a Comment