Saturday, November 1, 2025

 🌷💐భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ గారి వర్థంతి సందర్భంగా......💐🌷

**#ఇందిరా గాంధీని అభిమానించే అమెరికా అద్యక్షుడు ఎవరు?**

##భారతీయులను,ఇందిరా గాంధీని ఇష్టం పడని అమెరికా అద్యక్షుడు ఎవరు?###

#అణుయుగంలో, అంతరిక్ష యుగంలో భారతదేశాన్ని అడుగు పెట్టించిన ఘనత ఇందిరా గాంధీదే. సోవియట్ వ్యోమ నౌకలో భారతీయులను పంపడానికి చొరవ తీసుకుంది ఆమే.ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ను ఘోరంగా ఓడించి, దానిలో అంతర్భాగంగా వున్న ప్రాంతాన్ని విడిపోయేందుకు దోహదపడి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారకురాలై, ప్రపంచంలో భారతదేశాన్ని ఒక బలీయమైన శక్తిగా రూపుదిద్దిన ఘనత కూడా ఇందిరా గాంధీదే. #పోఖ్రాన్‍లో మొదటిసారిగా భూగర్భ అణ్వాయుధ ప్రయోగం జరిపించడం ద్వారా, ప్రపంచ అణ్వాయుధ పటంలో భారతదేశానికి ఒక స్థానం ఏర్పరిచిన ఘనత ఇందిరా గాంధీదే. అగ్ర రాజ్యాల అణ్వాయుధ నిబంధనలకు తమ దేశం కట్టుబడి వుండదన్న సంకేతాలను పరోక్షంగా ఇచ్చింది ఇందిర. అంతర్జాతీయ రంగంలో ఎవరి పక్షం వహించదని, తమ విదేశాంగ విధానం "భారత అనుకూల విధానం" అనీ ఎలుగెత్తి చాటి చెపుతూ, అలీన విధానాన్ని పాటించే దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్ళింది ఇందిరా గాంధీ. సోవియట్ యూనియన్ తో మైత్రి చేసినప్పటికీ, అమెరికా వ్యతిరేకిగా ముద్ర పడకుండా జాగ్రత్త పడింది. అవసరమైనప్పుడు, తప్పదను కున్నప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఎదురు తిరిగి తన సత్తా ఏమిటో నిరూపించింది.

#ఇందిరాగాంధీ పేరు-ప్రతిష్టలు, దూరదృష్టి, ఖండ-ఖండా తరాలు దాటిపోయింది. మానవాళి మొత్తం ఆమె విదేశాంగ విధానం వల్ల లబ్ది పొందింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశానికి ప్రధానమంత్రిగా వున్న ఆమె విధానాలు-నిర్ణయాల మూలంగా, అంతర్జాతీయ సంబంధాలలో గణనీయమైన పురోగతి కనిపించింది. అంతర్జాతీయ స్థాయిలో అమెకు అరుదైన గౌరవం, మర్యాదలు దక్కాయి.

దేశ తొలి #మ‌హిళా ప్ర‌ధానిగా ఇందిర ఎన్నో సేవలు అందించారు. తన పాలన సమయంలో ఎన్ని సంక్షోభాలు ఎదురైనా ప్రధాని హోదాలో ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకోని ముందుకు నడిచారు. నెహ్రూ భారతదేశ వైభవానికి ప్రాతినిధ్యం వహిస్తే, ప్రపంచ దేశాల మధ్య ఇందిర భారతదేశ శక్తికి ప్రతీకగా నిలిచారు.

ఇందిర 1917, నవంబర్ 19న జన్మించారు.. ఆమె జవహర్ లాల్ నెహ్రూ ఏకైక సంతానం. ఇందిర బెంగాల్‌లోని విశ్వభారతి విశ్వ విద్యాలయంలో చదివారు. ఇంగ్లండ్‌లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో సోమర్ విల్ కాలేజీలో చదివేటప్పుడు 1930లో ఇండియాలీగ్‌లో చేరారు. తండ్రి జవహర్ లాల్ నెహ్రూ వారసురాలిగా 1938 లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేశారు.

1960 సెప్టెంబర్ 8న ఫిరోజ్ గాంధీ.. 1964 మే 27న జవహర్ లాల్ నెహ్రూ మరణించడంతో ఇందిర జీవితంలో విషాదాలు ఎదురయ్యాయి. తండ్రి మరణం తర్వాత ఇందిర రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత రాజకీయ పరిణమాలతో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారి.. 1966 జనవరి 24న ఇందిర మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించారు. దేశ మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రిగా కొత్త రికార్డ్ దక్కించు కున్నారు.

1966లో తాష్కెంట్‌లో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణించగా, ఇందిరా గాంధీ పార్టీలోని సాంప్రదాయవాది మొరార్జీ దేశాయ్‌ను ఓడించి ప్రధాన మంత్రి అయ్యారు. అయితే ఆమె నేతృత్వంలో మొదటి సాధారణ ఎన్నికల్లోనే పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎనిమిది రాష్ట్రాల్లో ఓటమి పాలైంది. పార్లమెంట్‌లో కూడా పార్టీ సభ్యుల సంఖ్య తగ్గింది.
#దాంతో సోషలిస్ట్ పార్టీ నేత రామ్ మనోహర్ లోహియా '#గూంగీ గుడియా' (మూగ బొమ్మ) అంటూ ఇందిరను పరిహాసం చేసేవారు.

ఇందిరమ్మ 1966 నుంచి 1977 వరకు వరుసగా మూడుసార్లు.. 1980లో నాలుగోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1977లో సంచలన నిర్ణయంతో ఎమర్జెన్సీని ఉపసంహరించి ఎన్నికలకు వెళ్లారు.. కానీ ఎన్నికలలో ఓటమి తప్పలేదు. ఇందిరా గాంధీ రాయ్ బరేలీలో ఓడిపోయారు. తర్వాత 1978లో ఇందిరా కాంగ్రెస్‌ను ఏర్పాటు చేసి ఉప ఎన్నికలలో విజయం సాధించారు. తర్వాత 1980 మధ్యంతర ఎన్నికలలో ఘన విజయం సాధించి మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు ఆమె.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. 

#ప్రధానమంత్రిగా:

#ఇందిరా గాంధీ 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఈ కాలంలో #రాజభరణాల రద్దు, 1966లో రూపాయి #మూల్య న్యూనీకరణ, 1969లో #బ్యాంకుల జాతీయీకరణ లాంటి నిర్ణయాలతోపాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి హరిత విప్లవం, పేదరిక నిర్మూలన కై గరీబీ హటావో నినాదం, 20 #సూత్రాల పథకము లాంటి ప్రజాకర్షక పథకాలు చేపట్టింది. 1971 పాకిస్తాన్ తో యుద్ధంలో నిర్ణయాత్మక విజయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 1974లో రాజస్థాన్ ఎడారి లోని పోఖరాన్ లో అణుపాటవ పరీక్ష చేసి అమెరికా కన్నెర్రకు గురైంది. అంతేకాదు, ఆ చర్య వల్ల భారత అణు కార్యక్రమానికి బలమైన పునాది పడింది.

ఈమె హయంలో #రాజాభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం, హరిత విప్లవం, బంగ్లాదేశ్ విమోచన, 1971 పాకిస్తాన్ తో యుద్ధంలో గెలుపు మొదలగు సంఘటనల వల్ల ప్రజాదరణ పెరిగింది.అధికోత్పత్తినిచ్చే విత్తనాలు, మెరుగైన సాగునీటి వసతుల కల్పించడం ద్వారా ఆమె వ్యవసాయ రంగ స్థితిగతుల్ని మార్చి ఆహారధాన్యాల్లో మిగులును సృష్టించారు.

#ప్రపంచ గుర్తింపు.

*#లిండన్ జాన్సన్‌కు ఇందిరా గాంధీ అంటే ప్రత్యేకమైన అభిమానం*

1968లో ఇందిరా గాంధీ అమెరికా వెళ్లినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్‌కు ఆమెను ఏమని సంభోదించాలనే సంశయం వచ్చింది. అప్పటి అమెరికా రాయబారి బీకే నెహ్రూను అడిగితే ఆయన నేరుగా ఇందిరా గాంధీనే ఈ ప్రశ్న అడిగారు.
‘‘నన్ను ప్రధానమంత్రి అనొచ్చు లేదా నా పేరు పెట్టి పిలవొచ్చు’’ అని ఆమె చెప్పమన్నారు.
నా మంత్రివర్గంలో కొందరు నన్ను 'సర్' అని కూడా పిలుస్తారు...ఈ విషయం కూడా వారితో చెప్పండి అని ఇందిరా గాంధీ బీకే నెహ్రూకు చెప్పారు.

#అమెరికా అధ్యక్షుడు లిండన్ బి.జాన్సన్ దౌత్య సంప్రదాయాలకు భిన్నంగా, స్వయంగా వాషింగ్టన్‌లోని భారత రాయబారి నివాసానికి వచ్చి ఇందిరతో సమావేశమయ్యారు.
లిండన్ జాన్సన్‌కు ఇందిరా గాంధీ అంటే ప్రత్యేకమైన అభిమానం. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదని ప్రముఖ జర్నలిస్ట్ ఇందర్ మల్హోత్రా గుర్తు చేసుకున్నారు.

#నిక్సన్ అమెరికా అధ్యక్షుడు గా ఉన్నప్పుడు:

##నిక్సన్ కు భారతీయులంటే ఇష్టం ఉండేది కాదు## ఇందిరాగాంధీ అంటే అతడికి అలుసు. అయితే ఇందిరా గాంధీ  వైపు నుంచి కూడా అలాంటి తీరే ఉండేది.1971 నవంబర్‌ 4న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ వైట్ హౌస్‌లో నిక్సన్‌తో భేటీ అయ్యారు. అయితే, విరామ సమయంలో నిక్సన్.. కిసింజర్‌తో మాట్లాడుతూ.. మరోసారి భారత మహిళలపై అక్కసును వెళ్లగక్కారు. ‘భారత మహిళలు నాకు నచ్చరు. అసలు వారెవరికైనా నచ్చుతారా? చెప్పు హెన్రీ’ అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.

*ఒక సమావేశంలో చైనా యుద్ఢంలో భారతదేశం ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేసి భారతదేశాన్ని అవమానించాడు. అదే సమావేశంలో ఇందిరా గాంధీ వియత్నాం  యుద్ఢంలో అమెరికాకు జరిగిన ఘుర అనమానాన్ని ప్రస్తవించి అమెరికాను అవమానించి ప్రతీకారం తీర్చుకుంది. ఇందిరాగాంధీని ‘ఓల్డ్ విచ్’ అంటూ నిక్సన్ తిట్టుకునేవారు*

1967లో నిక్సన్‌ను మొట్టమొదటిసారి దిల్లీలో కలిసినప్పుడు మాట్లాడిన ఇరవై నిముషాలకే ఇందిరాగాంధీ విసుగు చెందారు.సంభాషణ మధ్యలో తన విదేశాంగ కార్యవర్గంవైపు తిరిగి..."ఈ మనిషిని ఇంకా ఎంతకాలం భరించాలో" అని హిందీలో అడిగారు.
నిక్సన్ మాట్లాడటం ఆపాడు.
నిక్సన్ అహంకారపూరిత వ్యాఖ్యలు, వైఖరి వల్లే ఆయన తన పదవిని పోగొట్టుకున్నారని భారత నేతలు మండిపడ్డారు. నిక్సన్ తక్కువ స్తాయి వ్యక్తి, ఇలాంటి ప్రవర్తన కారణంగానే వాటర్ గేట్ కుంభకోణంలో అభిశంసనకు గురై పదవి కోల్పోయాడని విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి నట్వర్ సింగ్ ధ్వజమెత్తారు.

#స్త్రీలలో ఇంతటి శక్తి సామర్థ్యాలు.....

పశ్చిమ దేశాల సహాయంతోను, ప్రపంచ బ్యాంకు సహాయంతోను దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని ఆమె ఆశించింది. అందుకే ఆమె అమెరికా ప్రయాణమయింది. మధ్యలో పారిస్ లో ఆగి అప్పటి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఛార్లెస్ డిగాలేని కలిసింది. స్త్రీల శక్తి సామర్థ్యాల మీద ఏ మాత్రం నమ్మకం లేని ఛార్లెస్ ఇందిరాగాంధీతో మాట్లాడాక, "స్త్రీలలో ఇంతటి శక్తి సామర్థ్యాలు ఉంటాయని నేనూహించలేదు. ఆమెలోని సామర్థ్యం చూసిన వారికి ఆశ్చర్యం కలుగక మానదు. ఆమె ఏమైనా సాధించగలదు." అని వ్యాఖ్యాంచించారు.

 #రష్యా ప్రధాని అలెక్సి కోసిజిన్ తోను, ప్రపంచ బ్యాంకు అధికారులతోను, అంతర్జాతీయ ద్రవ్యనిథి అధికారులతోను చర్చలు జరిపింది. ఆ చర్చలు చాలా ప్రాముఖ్యతను పొందాయి. ఆమె భారత దేశ గౌరవానికి, ఉన్నతికి ఏ మాత్రం భంగం కలుగకుండా మాట్లాడిన తీరు, ఆమె కనబరచిన రాజకీయ పరిపక్వత చురుకుదనం అందరినీ ఆకట్టుకుంది.

#ప్రపంచాభిమానిగా:

1960లో ఏల్ యూనివర్షిటీ వారిచే హాలెండ్ మెమొరియల్ అవార్డ్,
1965లో ఇటాలియన్ ఇసబెల్లా డిఎస్టే అవార్డులు వరించాయి.
1967, 1968లల్లో రెండుసార్లు ఈమెని ఫ్రెంచ్ ప్రజలు, మిక్కిలి అభిమాని పాత్రురాలైన నాయకురాలుగా, ఎన్నుకున్నారు.
అంతరిక్షంలో ఉన్న వ్యోమగామితో మాట్లాడిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ
అమెరికావారి గ్యాలప్ పోల్ లో ప్రపంచాభిమానిగా ఈమె యావత్ ప్రపంచప్రజల అభిమానాన్ని పొందింది.

16 సంవత్సరాలపాటు ప్రధాన మంత్రిగా దేశాన్ని పరిపాలించింది. ప్రధానంగా ఈమె హయంలో రాజభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం, హరిత విప్లవం, బంగ్లాదేశ్ విమోచన, 1971 పాకిస్తాన్తో యుద్ధంలో గెలుపు మొదలగు సంఘటనల వల్ల ప్రజాదరణ పొందాయి.

#ఇందిరాగాంధీకి అలీన ఉద్యమ నేతగా, శాంతి కాముకురాలిగా, స్వాతంత్రాభిలాషిణిగా ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. 1983 లో న్యూఢిల్లీలో జరిగిన అలీన దేశాల ఉద్యమ ఏడవ సమావేశంలో ఛైర్ పర్సన్‌గా ఎన్నిక కావడంతో ఆమె పేరు-ప్రతిష్టలు ఇనుమడించాయి.

#బిరుదులు:
1971లో భారత ప్రభుత్వపు అత్యున్నత అవార్డు భారత రత్నను స్వీకరించి ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళగా స్థానం సంపాదించింది.
1983-84 లో రష్యా దేశపు లెనిన్ శాంతి బహుమతి లభించింది.

1971 లో బంగ్లాదేశ్ విమోచనాన్ని విజయవంతంగా సాధించిన సందర్భంలో నాటి ప్రతిపక్ష నేత #అటల్ బిహారీ వాజపేయి ఆమెను #దుర్గామాతగా #కీర్తించాడు.
తన అంగరక్షకుల తుపాకి గుళ్ళకు 1984 అక్టోబర్ 31న బలైంది.
🙏🙏🌷🌺🌹🙏🙏
Collected by
Dr.A.Srinivasa Reddy
9912731022
Zphs 75Tyalluru,
Pedakurapadu mandal Palnadu district.

No comments:

Post a Comment