*దుాషనల ఫలితం…..*
*పాండవులు వనవాసం చేస్తున్న రోజుల్లో కుంతీమాతకి కుటీరం లో బియ్యం నిండుకున్నాయి...అడవిలో పనులకు వెళ్లి న తన అయిదుగురు కమారులు వచ్చే వేళయింది...భోజనం వండ టానికి బియ్యం గింజ లేదు...!! బీముడికి మరీ ఆకలి ఎక్కువ..ఎలా చేయాలి? ఎవరిని అడగాలి అనుకుంటుా వుండగా..పక్కనే ఒక గ్రామం వుందని తెలుసుకున్న కుంతీ దేవి..ఆగ్రామంలోకి వెళ్లింది..*
*అక్కడ ఒక ఇంటికి వెళ్లి గోడ చాటుగా నిలబడి..అమ్మా!! నేను ఒక అయిదుగురు బిడ్డలు తల్లిని.నా బిడ్డలు పనులు మీద కి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి వచ్చే వేళయింది..అన్నం వండటానికి ఇంట్లో బియ్యం గింజ లేదు...కొంచెం బియ్యం ఇస్తే నేను వెళ్లి భోజనం చేస్తాను...!! అని ఆత్మాభిమానం చంపుకొని కొంగు చా చింది...!!*
*ఆ ఇంటి ఇల్లాలు పరమ గయ్యాళి ...కరెక్ఠుగా కుంతీ మాత అలాంటి ఇంటికి వెళ్లింది...!! ఏమి చేద్దాం...విధి.చదరంగం ...!!*
*ఆ ఇల్లాలు గంపంత నోరేసుకొని నేను నా పిల్లలు కి స్నానం చేసి వాళ్ళను ముస్తాబు చేసుకుంటున్నాను...నాకు ఓపిక లేదు.అసలు మాఇంట్లో బియ్యం లేవు ఏమి లేవు.." నీవు అయిదుగురు బిడ్డల్ని పందిలాగా కని పారేసి ఇలా అడుక్కుతిని చాకాలా...!!?? వాళ్ళు తినకుంటే వాళ్లే ఆకలికి మాడి చస్తారు..!" నీవు పో మా ఇంటి దగ్గర నుండి ...!! దరిద్రపు గొట్టుదానా!! మా ఇల్లే దొరికిందా నీకు? పోనీవు తక్షణమే ఇక్కడనుండి..లేకపోతే చీపురు తో కొట్థి తరుముతాను..అని దుర్భాషలాడింది...!! నిష్కారణంగా నిందించింది..!!*
*బియ్యం అడిగినందుకు అవమానించి తరిమింది..ఇంకా నీచజంతువులతో పోల్చి తిట్థింది..!*
*కాలం పరిస్థితులు పాండవులని పరీక్షించదలిచాయి కేవలం....లేకపోతే కుంతీ మాతకి ఇలాంటి దుస్తితా?*
*పాండవులు సాక్షాత్తు దేవతల అంశాలు వారికి జన్మనిచ్చిన కుంతీ మహాసాద్వీ పతివ్రత ..సహనముార్తీ...!!*
*ఆ ఇంటి ఇల్లాలు తిడుతుా దుాషిస్తున్న నీచంగా మాట్లాడుతున్నా మారు పలకలేదు.!! తలవంచుకొని హృదయం లో కలిగిన క్షోభను పైకి కనపడకుండా ఇంటికివచ్చింది...*
*ఆ రోజు సమయానికి పాండవులు వస్తుా వస్తుా తమతో పండ్లు ఫలాలు తెచ్చి ఆనాటి ఆకలిని తీర్చుకున్నారు..!! ఆ రోజు గడిచిపోయింది..*
*తెల్లారి ఆ గ్రామంలో ఒక కలకలం రేగింది...ఒక ఇంట్లో ని పిల్లలందరుా.పడుకున్నవాళ్ళు పడకున్నట్లు మృతి చెందారు...కారణం లేదు..ఆవిషయం అందరుా చెప్పుకుంటుంటే...ధర్మరాజు కుాడా విన్నాడు...*
*ఎందుకు అలా జరిగివుంటుంది.అని తనకున్న వివేకంతొి ఙ్ఙానంతో తన దివ్య దృష్టిలో చుాసాడు..!!*
*ధర్మరాజు కి మెుత్తం అర్థం అయింది...*
*ఆఇంటి గృహిణి ఎన్ని దుర్భాషనలు తిట్లు శాపనార్దాలు పెట్టిన ఒక్కమాట అనకుండా తలవంచుకొని వచ్చిన తన తల్లి సహన క్షమ గుణాలకు ధర్మరాజు ఆశ్చర్యం పొంది తన తల్లి కి మనసులో నే నమస్కారించుకొన్నాడు...తరువాత తల్లి దగ్గరకు వచ్చి తల్లి...నిన్నటి రోజు పక్కన గ్రామంలోకి ఎవరింటికైనా బిక్షం కోసం వెళ్ళావా? అని అడిగాడు...కాని కుంతీదేవి లేదు..నేను నిన్నటి రోజు ఎక్కడికి వెళ్ళ లేదంది...లేదు తల్లి నిజం చెప్పు...అంతా నాకు తెలుసు...ఆ గృహిణి నిన్ను అవమానించిన మారు పలకనందుకు ఆ దుాషనలు తిరిగి ఆమె బిడ్డలకే తగిలి మరణించారు.*
*ఎదుటి వారు మనల్ని నిష్కారణంగా మనల్ని దుాషించినప్పుడు ఆ మాటలు చేసే గాయానికి నీవు ఓర్చావు..!! మనం మౌనంగా వున్నప్పుడు ఆ మాటలు మన ఎడమ కాలి గోటిని కుాడా తాకవు...కాని మళ్ళీ మనం తిరిగి మనం తిరిగి శాపనార్దం పెడితే వాళ్ళ కి తిట్టినవారికి ఏమి కాదు..చెల్లు కు చెల్లు...కానీ మౌనంగా నీవు ఒక్క మాట అన నందున ఆ శాపనార్ధాలు ఆమె బిడ్డలకి కొట్టుకొని వాళ్ళు మంచలోనే పడుకున్నవాళ్ళు పడుకున్నట్లు మృతినొందారు..*
*కాని నీవు తక్షణమే వెళ్లి ఆ గృహిణి తిరిగి దుాషించిరా....!! అని ధర్మరాజు అనగానే...కుంతిదేవి గ్రామంలో నిన్న బిక్షకి వెళ్లి అడిగిన ఇంటికి వెళ్లి ...తిరిగి దుాషించగానే మరణించిన ఆమె పుత్రులు నిద్రలో లేచి నట్లు లేచారు....!!*
*ఆవిధంగా ఆ సంఘటన తో కుంతిదేవి సహనం కరుణ క్షమ గుణాలు , మరియుా పాండవుల విలువ ఆ గ్రామమంతా తెలుసిపోయింది...!!*
*ఎవరైనా మనల్ని అకారణంగా దుాషిస్తే అది వారికే తగులుతుందని అంటారు..ఏ చెట్టు కింద రాలిన పండ్లు ఆ చెట్టుకింద నే పడతాయి కాని వేరే చెట్ల కిందకి వచ్చి పడవు..!! అలాగే ఎవరి కర్మ వారికే ఫలితం వెతికి మరీ ఇస్తుంది ..!!*
*ఈ కధ ఈ ప్రస్తుత కలికాలంలో సమాజానికి కనువిప్పు కలిగిస్తుంది .*
No comments:
Post a Comment