Saturday, November 1, 2025

 🙏🌹 *జీవన రేఖ* 🌹🙏

వ్యర్థం విన్నా, మాట్లాడినా, చూసినా చాలు... మనసు బరువై పోవడానికి.

వ్యర్థ విషయం చిన్నపాటి విషం వంటిది. మొదట దీని ఫలితంగా మనసు బరువు అవుతుంది.

తర్వాత బుద్ధి నిర్ణయ శక్తిని కోల్పోతుంది... ఫలితంగా నోరు, చేతల పై అధికారం కోల్పోతారు. చివరికి మాటిమాటికి సంతోషం మాయమైపోతుంది.

సరైన నిర్ణయాలు తీసుకోని, తీసుకోలేని జీవన రహదారిలో అడుగడుగునా అవరోధాలే... ఆటంకాలే...

కనుక సమయం దొరికినప్పుడు పరమాత్ముని జ్ఞాన సంబంధిత చర్చల్లో ఉండడం గాని, పుస్తకాలు చదవడంలో గాని మునిగి ఉంటే వ్యర్థం దూరం నుండే నమస్కరించి వెళ్లిపోతుంది.

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment