*ఒక మంచి మాట.!!
*ఈరోజు భగవాన్ " రమణ మహర్షి.."
చెప్పిన ఓ మంచి మాటను విందాం.!!
*మరణం అంటే…
తన
నిజస్వరూపాన్ని
మరిచిపోవడమే.."!
*రమణ మహర్షి.!!
భగవాన్ రమణుల వారు గొప్ప ఆధ్యాత్మిక గురువు.ఆయన బోధనలు నేటికీ ఆధ్యాత్మిక వీచికలై పరిమళాల్ని వెదజల్లు తున్నాయి..!
మనిషి 'చావు బతుకుల' సంగమం…….
మరణం అంటే ఏమిటి? అన్న విషయంలో
రమణుల వారి బోధ ఎంతో విలువైంది.'మర
ణమంటే, తన నిజస్వరూపాన్ని మరిచిపోవ
డమే.." అంటే లౌకిక స్థితిలో వున్న దేహం
అంతరించడం..నశించడం.కనుమరుగు….
కావడం..!
మనిషి ప్రాణమున్నంత కాలం "నేను" అనే
దేహంతో వుంటాడు.మరణించాక' ఈ దేహం
తో పాటు “ నేను" కూడా నశిస్తుంది. అంటే
నేనుగా చెప్పబడుతున్న భౌతిక (నిజ)స్వరూ
పాన్ని కోల్పోతాడు.
*నేనెవరు ...? నువ్వెవరు. ?
ఈ రెండూ బోధపడితే మనిషి తన జన్మకు ఆనవాళ్ళు,తన అస్తిత్వానికి మూలాలు తెలుసుకున్నట్లే.భగవాన్ ఆధ్యాత్మిక గురు
బోధవల్ల మాత్రమే ఈ రెండూ తెలుస్తాయి.
ఇవి తెలుసుకున్న రోజున మానవుడి ఆనందా
నికి అంతుండదు.అవధులుండవు. అనంత
మైన ఈ జగత్తులో తాను పూసుకున్న లౌకిక భవబంధాల రంగువెలిసి పోతుంది... కళ్ళకు కప్పిన మాయపొర తొలిగి,సత్యం తెలిసిపో
తుంది.
అప్పుడు విశ్వం ఓ ఊయలవుతుంది .మనం అందులో పరుండే పసి పాపగా మారిపోతాం.
ఇన్నాళ్ళు లోకంలో పెంచుకున్న స్వార్థపు రేఖ
లు చెరిగిపోతాయి.భవబంధాల చిక్కుముడు
లు విడిపోతాయి.మనం అనుభవించిన బాధ
లు,మానసిక క్షోభ దూదిపింజలై ఎగిరిపోతా
యి. మన ముందుభూమ్యాకాశాలు కూడా.. పిల్లాడి చేతిలో ఆటవస్తువులుగా మారి
పోతాయి అంటారు భగవాన్ రమణ మహర్షి.
*చిత్రం..వంశీ.!
No comments:
Post a Comment