నీ ఎమోషన్స్ వల్ల నాశనం అయ్యేది నువ్వే..! | Chaganti koteswara rao Garu On Emotions | Jai Hindu
https://youtu.be/eztph335cTQ?si=wZGmpqILdeXyLv6r
ఎందుకు మీ వయసులో ఉన్న వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి అని అడిగితే దానికి ఒక్కటే కారణం జీవితంలో ఎమోషన్ అని ఒక మాట ఉంటుంది నేను చెప్పిన దాన్ని మీరు చాలా క్యాజువల్ గా తీసుకోకండి మీకు ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు ఇంటికి వెళ్లి విచారణ చేయండి కోటేశ్వరారు చెప్పిన మాటల వల్ల మనక ఏమనా ఉపయోగం ఉందా అని నేను చెప్పింది ఎంత యదార్థాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నానో మీకు అర్థం అవుతుంది. ఈ ఎమోషన్ అన్ని వయసుల్లోనూ ఒక్కలా ఉండదు నీళ్లు కాచుకుంటాం మనం స్నానం చేయడానికి ఇప్పుడంటే గ్యాస్ స్టవ్ మీద కాస్తున్నారు మా చిన్నతనంలో పొయ్యిలో కాచేవారు బాయిలర్ లో కాచేవారు నీరు కాచేటప్పుడు ఉండే శ్రద్ధ పాలు కాచేటప్పుడు ఉండే శ్రద్ధ వేరుగా ఉంటాయి. నీళ్ళు కాచేటప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టి మీరు ఇంకొక పని ఏదైనా కాసేపు పేపర్ చదివి వచ్చి చూడొచ్చు నీళ్ళ అలా మరిగిపోతున్నాయి అనుకోండి పెద్ద సమస్య ఏమ ఉండదు పొయ్యి ఆర్పేసి మీరు నీళ్ళు పట్టికెళ్ళిపోయి తొరుపుకొని నీళ్ళు పోసేసుకోవచ్చు అలా మీరు పాలు వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి ఇక్కడ నీళ్లు మరుగుతూ ఉంటాయి మీరు వచ్చేటప్పటికి పాలు ఉండవు పొంగిపోయి పడిపోతాయి పాల ఎమోషన్ వేరు నీటి ఎమోషన్ వేరు నేను మాట్లాడుతున్నది సైంటిఫిక్ గా కాదు తార్కికంగా మాట్లాడుతున్నాను. ఎమోషన్ అనేటటువంటి దాని స్థితి మీ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మీ ఏజ్ గ్రూప్ అంటే నేను మాట్లాడుతున్నది పిల్లల్ని ఉద్దేశించి ఎమోషన్ బతికున్నంత కాలం ఉంటుంది ప్రతివాడికి ఉంటుంది ఎమోషన్ నాకు ఉంటుంది ఎమోషన్ చిట్టచివర ఊపిరి పోయేటప్పుడు కూడా ఎమోషన్ ఉంటుంది. కానీ మీ వయసులో ఉండే పిల్లల యొక్క ఎమోషన్ వేరు ఇవ్వాళ నేను దీని మీద ఎడ్యుకేషన్ వాల్యూ గా ఎందుకు స్ట్రస్ చేస్తున్నాను అంటే ఇవ్వాళ జరుగుతున్నటువంటి కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారాలన్నీ ఏవి ఉన్నాయో వాటన్నింటిని కూడా ఎక్స్ప్లాయిటింగ్ ది ఎమోషన్ యొక్క మారుపేరే జరుగుతున్న వ్యాపారాలు మీరు గమనించండి ఎప్పుడైనా మీరు ఆ దృష్టికోణంలో ఒక్కసారి విచారణ చేయడం ప్రారంభించండి. నేను మీకు ఏదో ఒకటి రెండు ఉదాహరణలు చెప్పి వదిలేస్తాను కానీ మీరు ఆ దృష్టికోణాన్ని కంటిన్యూ చేయండి చేస్తే మీకు అర్థంఅవుతుంది. మీ ఎమోషన్ ని పణంగా పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయల సంపాదన జరుగుతుంది. మనం చాలా ఫ్రీగా మాట్లాడుకుందాం నాకేం అలమరిక లేకుండా నేను మాట్లాడతాను నాకేం భయం లేదు. నేను ఉన్న విషయాన్ని ఉన్నట్టు ప్రస్తావన చేయగలిగిన ధైర్యం ఉన్నంత కాలమే ప్రసంగాలు చేస్తాను నాకు ఆ ధైర్యం లేనినాడు నేను ఏ వేదికకి వెళ్ళను నేను ప్రసంగాలు చేయను. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా అని ఒకటి ఉంది. ఒకానికొకప్పుడు నా చిన్నతనంలో దానికి కొన్ని వేల కోట్ల ఆస్తులు లేవు. సంవత్సరంలో ఎప్పుడో ఒకటో రెండో మ్యాచెస్ జరుగుతూ ఉండేవి. ఇవ్వాళ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ లో ఉండేటటువంటి పదవుల కోసం పెద్ద పెద్ద వాళ్ళ మధ్య కూడా పెద్ద పెద్ద రాజకీయాలు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వాళ క్రికెట్ ఆడడం అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఐశ్వర్యం సంపాదిస్తున్నారు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి ఇండియాలో ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ పెట్టాలి అంటే పిల్లల పరీక్షలు జరిగే కాలం ఏమైనా ఉందా అని ఆలోచిస్తారు వెన్యూస్ ఖాళీ ఉంటాయా టైంలో కాలేజెస్ అవి పోలింగ్ బూత్లు పెట్టడానికి ఆలోచిస్తారు. మీకు అది ఏప్రిల్ కావచ్చు మే కావచ్చు క్రికెట్ షెడ్యూల్ పెట్టేటప్పుడు మాత్రం మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీ ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతుంది. మీకు క్రికెట్ చూడడం మీ ఎమోషన్ మీ ఎమోషన్ ని అడ్డుపెట్టుకొని మీరు నాశనం అయిపోయినా ఎవ్వరికీ అక్కర్లేదు. నోబడీ కేర్స్ ఫర్ దట్ కావలసింది ఏమిటంటే ఉదయం నుంచి రాత్రి వరకు అలా ప్రసారం జరుగుతూనే ఉంటుంది నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి నా దగ్గరికి వచ్చి ఎందరో పిల్లలు అడిగారు క్రికెట్ చూడకుండా ఉండలేక మా జీవితాలు పాడైపోతున్నాయండి ఒక పాప నా దగ్గరికి వచ్చి ఏడ్చింది ఒరోజున మా నాన్నగారు ఎంత చిన్న ఉద్యోగస్తుడో నాకు తెలుసు మా అమ్మగారు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నాకు తెలుసు ఇంత కష్టపడి నన్ను చదివిస్తున్నారని నాకు తెలుసు కానీ అంకుల్ నేను క్రికెట్ చూడకుండా ఉండలేకపోతున్నాను. క్రికెట్ చూడకుండా ఉందామని బలవంతంగా టీవీ కట్టేసినా నేను ఒకవేళ పుస్తకం చదువుతున్నా సరే నాకు ఆ పుస్తకం మీద ధ్యాస ఉండదు. నేను చదవడం అంటే చదివేయడం అలవాటు కాబట్టి కళ్ళు చూసేస్తాయి చదివేస్తాను పేజెస్ తిప్పేస్తాను నా దృష్టికోణం అంతా అందులో వన్ డే ఇంటర్నేషనల్ అయితే ఫస్ట్ వచ్చే బ్యాట్స్మెన్ కొంతమంది ఉంటారు లబ్ద ప్రతిష్టులు వాళ్ళ బ్యాటింగ్ అయిపోతుందేమో ఏమనా ఎంత బాగానే ఆడేస్తున్నారేమో నేను మిస్ అయిపోతున్నానేమో ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్ మీద ఉన్నటువంటి వాచింగ్ దృష్టి ఇవాళ ఒక క్రీడని క్రీడగా చూడడం మీద లేదు ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతుంది మీ పరీక్షలు మీరు చదువుకోవలసిన కాలం పోతున్నాయి. మీరు అలాగే ఒక న్యూస్ పేపర్ చూడండి నా చిన్నతనంలో నేను చదివిన న్యూస్ పేపర్ వేరు నేను ఇప్పటికీ చదువుతున్న న్యూస్ పేపర్ లో ఉండే న్యూస్ రిపోర్టింగ్ వేరు మా చిన్నతనంలో న్యూస్ రిపోర్టింగ్ అంటే ఏది ఎక్కడ జరిగిందో అది రాసేవారు హెడ్లైన్స్ కి ఒక ప్రాముఖ్యత ఉండేది పూరం ఉండేది రాత్రి 1:00 గంట వరకు హెడ్లైన్స్ కొట్టేవారు కాదు హెడ్లైన్స్ పేపర్ లో వేయాలి అంటే అలా హెడ్లైన్స్ లోకి కనపడాలంటే దానికి ఒక స్థాయి ఉండాలి ఆ స్థాయి లేకపోతే హెడ్లైన్స్ లోకి ప్రతి అడ్డమైన వాడి పేరు తీసుకొచ్చి హెడ్లైన్స్ లోకి వేయడం పేపర్స్ కి అగౌరవం వేసేవారు కాదు ఆ హెడ్లైన్స్ గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆ తర్వాత వేరొకరికిని పెద్ద ప్రమాదమే తప్పింది ఆ తమిళనాడులో ఒక రీజినల్ డైలీ ఒకటి ఉండేది ప్రతిరోజు వచ్చే చిన్న పేపర్ ఒక చెన్నైలో సర్క్యులేషన్ లో ఉండేది ఒక తమిళ్ పేపర్ దానికి సబ్ ఎడిటర్స్ గా ఉన్నారు ముల్లబూడి వెంకటరమణ గారు బాబు గారు ఇద్దరు ఉన్న రోజుల్లో ఎడిటర్ గారు పెద్దాయన ఓ ముసలయన ఉండేవారు ఆయన చాలా కోపిష్టివాడు ఆయన రాత్రి 11:30ర 12 ఇంటి వరకు ఉండి నాకు చాలా జ్వరంగా ఉందిరా నేను వెళ్లి పడుకొని నిద్రపోతాను మీరు టెలీ ప్రింటర్ దగ్గర కూర్చోండి ఆ రోజుల్లో ఆన్లైన్లు అవి లేవు టెలిప్రింటర్ దగ్గర ఉండండి స్టాలిన్ ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు ఒకవేళ స్టాలిన్ చచ్చిపోతే ఇదిగో స్టాలిన్ జీవిత చరిత్ర స్టాలిన్ అస్తమయం అని పెట్టి ఈ న్యూస్ అంతా వేసేసేయండి ఒకవేళ స్టాలిన్ చచ్చిపోకపోతే రెండు గంటల లోపల ఈ న్యూస్ హెడ్లైన్స్ కింద వేయండి ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో ఇదే వైటల్ న్యూస్ అని చెప్పి హెడ్లైన్స్ కి ఇచ్చి ఆయన వెళ్లి పడుకున్నాడు. ఈ పిల్లలుఇద్దరు కూర్చున్నారు టెలీ ప్రింటర్ ముందు పావుతకు రెండు ఆ టైం అవుతోంది స్టాలిన్ చచ్చిపోయినట్టు వార్త ఏం రాలేదు కాబట్టి మనం ఏదో ఇంకో హెడ్లైన్స్ వేసేద్దాం అనుకున్నారు స్టాలిన్ వెంట్ ఇంటు కోమా అని వచ్చింది. ఇద్దరు పిల్లలకి తెలిీదు కోమా అంటే ఏమిటో స్టాలిన్ వెంటింటు కోమా అంటే ఏమిటిరా అని అడిగాడు ముల్లపూడి వెంకటరమణ గారు అతే నాకు తెలిీదు వెంటింటూ కోమా అంటే ఏమిటిరా కామాలాగా అదేమిటి అని అడిగిన అంటే కాసేపు ఆ ఇద్దరు చర్చించుకని ఎడిటర్ గారిని లేపుదాం అని అడిగితే ఆయన నిద్రపోతున్నారు. మహా కోపిష్టి లేపితే దెబ్బలాడతాడు. వెంటు కోమ అంటే వాళ్ళు ఏం ఊహించారుఅంటే ఆయన స్వర్గలోకములోకి ప్రవేశించాడు అని చెప్పుంటారు బహుశా మనవాళ్ళు దివంగతుడు అయ్యాడు ఊర్ధలోకములలోకి వెళ్ళిపోయాడు అంటారు కదా అందుకని కోమా అంటే బహుశా ఊర్ధలోకములలోకి వెళ్ళిపోయినట్టు సో కొట్టేయండి అన్నారు స్టాలిన్ అస్తమయం కొట్టి స్టాలిన్ జీవితం వేసేసారు వేసేసి పేపర్ రిలీజ్ అయిపోయింది మరనాడు ప్రతి ఇంటి ముందు వేసేసారు పేపర్ ని హిందూ ఆ రోజుల్లో లీడింగ్ న్యూస్ పేపర్ అప్పటికంట ఇప్పటికీ కూడా చిత్రం ఏమైందంటే తెల్లవారకట్ట అందరూ తలుపులు తీసి పేపర్ తీసుకొని న్యూస్ తీశారు చీఫ్ మినిస్టర్ కూడా అన్ని పేపర్స్ పెడతాయి పొద్దున్న ప్రెస్ రిపోర్టింగ్ లో ఉంటాడు ఒక ఈ ప్రెస్ రిలేషన్స్ చూసి ఆయన ఏవండీ ఈ పేపర్ ఒక్కటే వేసిందండి స్టాలిన్ అస్తమయం అని ఎవర వేయలేదు అన్నారు చీఫ్ మినిస్టర్ తెల్లబోయి ఒక చిన్న లోకల్ న్యూస్ పేపర్ స్టాలిన్ అస్తమయం వేస్తే హిందూ పేపర్ లాంటి పేపర్ కూడా వేయలేదు ఏం ఆశ్చర్యం ఇది ఎలా వేయగలిగాడు అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి అందరూ ఈయనకి కంగ్రాాట్స్ చెప్పడం మొదలు పెట్టారు ఎడిటర్ గారికి ఏ న్యూస్ పేపర్ సాధించిన విషయాన్ని మీ వాళ్ళు సాధించారయ్యా ఎంత గొప్ప విషయం ఎలా వేశరయ్యా హెడ్లైన్స్ అని ఈయనకి 102 జ్వరం 105 అయిపోయింది ఎవరు వేయలేదు మనం వేసామ అంటే అసలు చచ్చిపోయాడా ఈయన అని ఆయన గబగబా ముల్లపూడి వెంకటరమణ గారిని పిలిచి అడిగాడు ఏమయ్యా ఎలా వేశరు ఎన్నింటికి వచ్చింది చూసి అని మీరు రెండు గంటల వరకు చూడమన్నారు కదండీ పావుతో రెండుకి స్టాలిన్ వెంటో కోమా అని వచ్చింది వేసేసామండి అన్నారు ఆయన హతాశుడు అయపోయాడు ఎంత పని చేశరురా అని అసలు స్టాలిన్ పొజిషన్ ఏమిటో ఎంక్వయరీ చేద్దాం అని ఫోన్ చేశడు. కనుక్కుంటే ఆ తర్వాత టెలీ ప్రింటర్ మీద వచ్చినటువంటి న్యూస్ రిపోర్ట్స్ అవి చూస్తే అదృష్టవశాత్తు తెల్లవారకట ఐదు గంటలకి స్టాలిన్ చచ్చిపోయాడు. అయితే ఆ ఎడిటర్ గారు ఆ విషయం ఎవరికీ చెప్పలేదు అక్కడ తెల్లవారదా జామున ఐదు గంటలకి స్టాలిన్ చచ్చిపోతే ఐదుపావుకి చచ్చిపోయిన విషయంతో పేపర్ ఇంటికి వచ్చేసింది. ఎలా వచ్చింది అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎవ్వరికీ తెలియదు. ఒకప్పుడు నేను ఇంతకీ ఈ విషయాన్ని ఎందుకు మనవి చేశాను అంటే న్యూస్ రిపోర్టింగ్ అంటే అంత జాగ్రత్తగా ఉండేది ఇప్పుడు న్యూస్ రిపోర్టింగ్ అంటే న్యూస్ పేపర్స్ లో ఎలా ఉంటుందంటే మనకి ఎమోషన్ క్రియేట్ చేస్తాడు వాడి వీధి గుండా చచ్చిపోయినా సరే పది హత్యలు చేసినవాడు చచ్చిపోయినా సరే ఓ పనికి మాలినవాడు చచ్చిపోయినా సరే వాడి గురించి తెలిసి ఉన్నట్టుగా బాలమురళీ కృష్ణ గారి గురించి ఎక్కడ వేరు బాలమురళీ కృష్ణ గారు స్వయంగా ఏడ్చాడు నాకు ఎప్పుడైనా తెలుగుదేశంలో నేను ఒకచోట తెలుగుదేశం అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశం అని తెలుగు మాట్లాడుకునేటటువంటి ప్రాంతాల్లో నేను వచ్చి కచేరీ చేస్తే ఆ బాలమురళీ కృష్ణ కచేరీలో ఈ గొప్ప విషయాలు ఉన్నాయని పేపర్లో మొదటి పేజీలో కనబడుతుందేమో అని నా జీవితంలో కోరిక జిల్లా ఎడిషన్ లో ఎక్కడో ఒక మూల ఓ చిన్నది బాలమురళీ కృష్ణ కచేరి అని వేస్తారు ఒకప్పటి న్యూస్ పేపర్ రిపోర్టింగ్ కి ఇప్పటి న్యూస్ పేపర్ రిపోర్టింగ్ కి సంబంధం లేదు అవి ఎమోషన్ తోటే చెలగాటం టెలివిజన్ ఎమోషన్ తో చెలగాటం సినిమా ఎమోషన్ తో చెలగాటం మీరు ఆలోచించండి ఎమోషన్ ని అడ్డు పెట్టుకుని దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకున్నట్టు ఎవరికి వాళ్ళు ఎంతసేపు మనకి యువకుల్లో ఎమోషన్ మన వైపు ఉంది అన్నది చూసుకొని దాన్ని బట్టి ఎన్రిచ్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నటువంటి రోజులు ఇంతగా మీ ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతే ఎడ్యుకేషన్ వల్ల వచ్చేటటువంటి మొట్టమొదటి వాల్యూ ఏమిటో తెలుసా అండి సెల్ఫ్ రెస్ట్రాయింట్ తెలుసుకోవడం తెలుసుకోవడం తెలుసుకోవడం అన్న మాటకి ఎడ్యుకేషన్ కి అర్థం ఏమిటంటే మీరు ప్రాక్టికల్ గా సైంటిఫిక్ డెవలప్మెంట్ ని ఆప్ చేయలేరు ఒక టెలివిజన్ ఉంది 130 ఛానల్స్ వస్తాయి మిమ్మల్ని పరమ ఉద్రేక పరచగలిగినవి మీ జీవితాన్ని తప్పు తప్పు త్రోవ వైపు తీసుకెళ్ళిపోగలిగినవి కూడా నిర్లజ్జగా ప్రసారం అయిపోతున్నాయి. అందరూ నిద్రపోతున్న వేళలో మీ భావాల్ని పాడు చేయగలిగిన నేరాలు ఘోరాలు కూడా వస్తాయి. మీరు నేరాలు ఘోరాలు ఆఫ్ చేస్తారా మీరు టెలివిజన్ లో వస్తున్నటువంటి పరమ భయంకరమై మీ జీవితాన్ని చెడు త్రోవ వైపుకి తీసుకెళ్ళిపోగలిగిన ఒక ఛానల్ ప్రసారాన్ని ఆఫ్ చేస్తారా మీరు సెల్ ఫోన్ కొనుక్కుంటే మీ సెల్ ఫోన్ లోకి సర్వీస్ మెసేజెస్ అని డౌన్లోడ్ సో అండ్ సో అని చెప్పి వస్తుంటాయి నా సెల్ ఫోన్ కి వస్తాయి నేను సిగ్గుపడుతూ ఉంటాను ఆ మెసేజెస్ చూసి సర్వీస్ మెసేజ్ అని వస్తుంది క్లిక్ ఆన్ జస్ట్ క్లిక్ యు విల్ గెట్ దిస్ అని అంత భయంకరమైన మెసేజెస్ వస్తూ ఉంటే మీరు సెల్ ఫోన్ లో ఇవ్వాళ మీరు వాడుకుందాం అని పెట్టుకున్న సెల్ ఫోన్ వ్యవస్థను మీరు ఆఫ్ చేస్తారా ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు పుస్తకాలు వేసేసి మ్యాగజైన్స్ అమ్మేస్తుంటే ఏవి కలర్ ఫొటోస్ వేస్తే యూత్ తొందరగా పాడై పేపర్ చూస్తారో న్యూస్ పేపర్ లో అవి మాత్రమే కలర్ ఫొటోస్ వేసి అబ్దుల్ కలాం గారి ఫోటో కూడా బ్లాక్ అండ్ వైట్ లో వేస్తారో అటువంటి పేపర్ల వ్యవస్థని మీరు ఆఫ్ చేస్తారా మీరు ఏం ఆఫ్ చేస్తారు చెప్పండి నేను అన్న మాటలు మీరు అర్థం చేసుకోలేని అమాయకులుఏం కాదు కానీ నేను మాట్లాడుతున్నది విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు మీకు ఒక యదార్థాన్ని ఇవ్వాళ తెలియచెప్పడం నా ప్రయోజనం నేను అందుకే చెప్పాను నేను మాట్లాడుతున్నది ఒక విద్వాంసుడిగా మాట్లాడటం లేదు నేను మీ మేనమామగా మీ పినతండ్రిగా మాట్లాడుతున్నాను అని చెప్పాను నేను మాట్లాడేటప్పుడు మీ క్షేమం కోరి మాట్లాడుతున్నాను మీరు భద్రంగా ఉండాలని కోరుకొని మాట్లాడుతున్నాను
No comments:
Post a Comment