*🙏🕉️ఓం నమః శివాయ🕉️🙏*
*మార్గశీర్ష ఆరుద్రా (శివ నక్షత్రం) నక్షత్రం ఆరుద్రోత్సవం*
సూర్యోదయానికి ముందు శివాభిషేకం, శివదర్శనం, శివపూజ అత్యంత పుణ్యప్రదం. మార్గశీర్ష ఆరుద్రా (శివ నక్షత్రం) నక్షత్రం లో శివుడు స్తంభాకారం ధరించి, మాఘమాసము కృష్ణ చతుర్దశి( *శివరాత్రి* ) రోజుకి అగ్నిస్తంభరూపానికి వచ్చాడు. అందుకే *ఈ మార్గశిర మాసం లో వచ్చే ఆరుద్ర నక్షత్రం మఱియు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి(శివరాత్రి)* శివునికి అత్యంత ప్రీతికరం. మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం *రేపు 07/12/2025 ఆదివారం ఉదయం 06.13 వరకు ఉంటుంది. కావున ఈరోజు రాత్రి నిశీధి కాలం 11.33 నుండి 12.25 మధ్య గానీ రేపు తెల్లవారుజాము నుంచి ఉదయం 06.00 లోపు గానీ విశేషంగా శివ పూజలు అభిషేకాలు చాలా గొప్పది... ఈశ్వర ప్రీతి ఆయన అనుగ్రహం విశేషంగా కలుగుతుంది.*
మార్గశీర్షంలో ఆర్ద్ర నక్షత్రం రోజున లింగాన్ని పూజిస్తే కుమారస్వామి కంటే శివునికి ఎక్కువ ఇష్టుడవుతాడు.*శ్రీ శివమహాపురాణం*
*ఆర్ద్రాయాం మార్గశీర్షేతు యఃపశ్యేత్ మాముమా సఖం!*
*మద్బేర మపివా లింగం స గుహాదపి మే ప్రియః!!*
*అలం దర్శనమాత్రేణ ఫలం తస్మిన్ దినే శుభే!*
*అభ్యర్చనంచేదధికంఫలం! వాచా మగోచరమ్!!*
*ఈశ్వరుడు ఒకసారి బ్రహ్మ, విష్ణ్వాది దేవతలారా! నాకు ఆర్ద్ర నక్షత్రం అంటే చాలా ఇష్టం, మార్గశీర్షమాస ఆర్ద్రనక్షత్రములో నేను కనబడకుండా స్తంభాకారం ధరించి, మాఘమాసము కృష్ణ చతుర్దశి (శివరాత్రి) రోజుకి అగ్నిస్తంభ రూపానికి వచ్చాను, అందుకే ఈ మాసం లో వచ్చే ఆరుద్ర నక్షత్రం మఱియు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి(శివరాత్రి)* అత్యంత ప్రీతికరం. ఈ కాలాల్లో చేసే పూజ చాలా గొప్పది. పూజ చేసిన వాడికి అనంతఫలం ఇస్తానని, నాకు ఈ ప్రపంచంలో కుమారస్వామి అంత ఇష్టుడు ఎవడూ లేడు. *మార్గశీర్షంలో ఆర్ద్ర నక్షత్రం వచ్చిన రోజున లింగాన్ని పూజిస్తే కుమారస్వామి కంటే నాకు ఎక్కువ ఇష్టుడవుతాడని శివుడు చెపుతాడు. ఆ శుభదినాన శివాలయానికి వచ్చి శివదర్శనం చేస్తే (కేవల దర్శన మాత్రాననే) మహా ఫలం లభిస్తుంది*. అత్యంత భక్తిశ్రద్ధలతో అర్చిస్తే వచ్చే ఫలం మాటాల్లో వర్ణించలేము, దృష్టితో చూడలేము. నామ స్మరణం చేసినా, శివకథ విన్నా అనంత ఫలాన్ని ఇస్తాయి.
ఆర్ద్ర , మృగశీర్ష నక్షత్రం వచ్చినప్పుడు సూర్యోదయానికి ముందే లేచి శివ దర్శనం చేసుకోవాలి. ఆర్ద్ర, మృగశీర్ష, చతుర్దశి సంధ్యాసమయంలో దర్శనం శాశ్వతంగా శివలోకప్రాప్తి కలుగుతుంది.
*శివోహం శివోహం శివోహం*
No comments:
Post a Comment