Monday, December 1, 2025




 *శివానుగ్రహం స్థిరత్వం ,శక్తి, మోక్షం కోసం శ్రీ అజైకపాద మూర్తి గురించి తెలుసుకుందాం*

            *అజైకపాద మూర్తి*
చన్ద్రార్ధ శోభిత కపాల ధారీ,
శూల మృగౌ వనమాలై ర్ధరమ్ |
త్రాసాద్భి ర్దేవై రనీకైశ్చ యుతం,
పితామహోరుద్భవమూర్తి మేకపాదం భజే ||

*రూప వర్ణన*
శివుడు ఏకపాదంపై ఒకే పాదంపై స్థిరంగా నిలబడి ఉంటాడు. మిగిలిన పాదం సాధారణంగా మడచబడి, పైకి ఎత్తి ఉంటుంది లేదా అదృశ్యంగా ఉంటుంది ,శిరస్సుపై అర్ధచంద్రుని ధరించి ఉంటాడు , ఆయన చేతిలో లేదా అలంకరణలో కపాలం (పుర్రె) ఉంటుంది ,చేతులలో త్రిశూలం  మరియు జింక  ధరించి ఉంటాడు, ఆయన వన మాలలు ధరించి, అరణ్యవాసి వలె కనిపిస్తాడు.
ఈ రూపం బ్రహ్మ దేవుని నుండి ఉద్భవించినట్లుగా కూడా కొన్ని పాఠాంతరాలలో చెప్పబడింది.

భయభ్రాంతులైన దేవతల సమూహంచే పరివేష్ఠితమై ఉంటాడు. ఈ దేవతలు తరచుగా అష్టవసువులు లేదా ఇతర రుద్రులుగా చెప్పబడతారు.

*ధ్యాన ఫలం*
ఏకపాద రూపం స్థిరత్వానికి, శక్తికి మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఈ మూర్తిని ధ్యానించడం వలన ఏకాగ్రత మరియు సంకల్పం బలంగా మారుతాయి.

దేవతలు భయభ్రాంతులై ఉన్నట్లు వర్ణించడం వలన, ఈ రూపం శత్రువులను మరియు అపశక్తులను సంహరించే శక్తిని సూచిస్తుంది.
మరియు ఈ రూపం రుద్ర స్వరూపంగా, యోగానికి మూలంగా పరిగణించబడుతుంది, ఇది మోక్ష ప్రాప్తికి సహాయపడుతుంది.
***********
శ్రీ గోవింద నారాయణ మహాదేవ 
*రాళ్ళబండి శర్మ*





No comments:

Post a Comment