Tuesday, December 2, 2025

 *మనసు మాయ గురించి ఆలోచించకండి...* *ఆలోచించ వలసింది సరైన సాధన గురించి, సరైన ప్రచారాలు చేసేవారి తరగతులు వినడానికి ప్రయత్నాలు చేయండి...* *మానవ సమాజం ప్రతీరోజూ ఏదోక సమస్యతో భయాందోళనలను కల్గియుంటున్నారు...* *అలాంటి వారు ముందుగా నమ్మకం, విశ్వాసంతో సరైన సాధన ద్వారా అభయాలను పొందండి...* *అది మీ చేతుల్లోనే, మీయొక్క సరైన ద్వారా మాత్రమే సాధ్యం అనే అధ్యాత్మిక సత్యాన్ని ముందుగా అర్దం చేసుకోండి...* *అటు తర్వాత మీలోనే మీతోనే ఉండే అంతరాత్మ శక్తిని "అల్లావుద్దీన్ అద్భుత దీపం " ఎలా ఆనందకరమైన జీవితాన్ని అనుభవించడానికి ఉపయోగ పడుతుందో అనుభవపూర్వకంగా సాధకులు తెలుసుకుంటారు...* *సరైన సాధన ద్వారా అక్షయ పాత్ర, కామధేనువు, అధ్బుతమైన దీపం మీ చేతుల్లోనే.... మాయ కమ్మి మాయా ప్రచారాలు చేసేవారిని దూరంగా ఉంచండి... వారి మాయలో పడకండి..ఎందుకంటే సరైన సాధన ద్వారా పరమాత్మ స్వరూపం అయిన ఆత్మ మీకు తోడుగా నీడగా ఉంది... నీలో ఉన్న ఆత్మ శక్తికి మించిన మరొక శక్తి లేదుగాక లేదు.... కొద్దిగా అర్థం చేసుకోండి... మరి కొద్దిగా సరైన సాధన మాత్రమే చేయండి.... సరైన సాధన ద్వారా నిప్పుపై కప్పబడిన నివురును తొలగించండి... ఆత్మ జ్ఞానం ద్వారా అంతరాత్మ సందేశాలు వినడం అలవాటు చేసుకోండి.... భౌతిక జీవితంలో కోన్ని భౌతిక పరిణామాలు కొన్నిసార్లు కొందరి ఆలోచనల వలన కొంత అసౌకర్యం కలుగుతుంది... అందుకే నెగెటివ్ అలోచనలు ఎప్పటికప్పుడు దగ్దం చేసుకొని నెగెటివ్ అలోచనలు వాస్తవరూపం కావాలి అనే చిన్న ఆలోచన ద్వారా సరి చేసుకోవచ్చు...*
      ద్యానం తెలియనప్పుడు ఎవరు చెప్పినా విన్నాం, చేశాం... తెలిశాక చేయవలసింది సరైన సాధన మాత్రమే... వినవలసింది ఆత్మ సందేశాలు మాత్రమే..

No comments:

Post a Comment