Monday, December 1, 2025

 మనం ధ్యానం స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు  నేను నా ఆత్మ మరియు నా పూర్ణాత్మ మరియు నా భౌతిక శరీరంలో ఉన్నటువంటి సకల అణువులు పరమాణువులు కణాలు  మరియు మొత్తంగా నా భౌతిక శరీరం మరియు నా యొక్క ఏడు శరీరాలతో పాటుగా శంబాలా మాస్టర్స్ తో కలిసి శంబాలా ఎనర్జీస్ తో కనెక్ట్ అవుతూ ఈ భూమి మీద ఉన్నటువంటి ఈజిప్ట్ లో ఉన్నటువంటి గిజా పిరమిడ్ లో ఉన్న కింగ్స్ ఛాంబర్ మీద మేమంతా ఈ విశ్వంలో ఉన్న సకల గేలక్సీలలో ఉన్న సర్వ జీవరాసులు ధ్యానం చేస్తూ ఆనందంగా సంతోషంగా ఉంటూ  సకల జీవుల పట్ల ప్రేమతో ఉంటూ ఆత్మజ్ఙానం పొందటం కోసం ధ్యానం చేస్తున్నాము. 
 అదేవిధంగా ఈ ధ్యానానికి మాతో పాటుగా ఈ జన్మలో  నేను అనుభవిస్తున్న సకల భయాలకు కారణమవుతున్న దివ్యాత్మ స్వరూపులందరు వారి యొక్క దివ్యమైన చైతన్యంతో వచ్చి మాతో పాటు ధ్యానం చేస్తూ ఆనందంగా సంతోషంగా ఉంటూ  సకల జీవుల పట్ల ప్రేమతో ఉంటూ ఆత్మజ్ఙానం పొందుతారు.                                  అదేవిధంగా ఈ ధ్యానానికి మాతో పాటుగా ఈ జన్మలో గాని నా గత జన్మలలో గాని నేను చేసిన అజ్ఞానపు చర్యల వలన ఇబందిపడిన దివ్యాత్మ స్వరూపులందరు దయచేసి నన్ను క్షమించి వారంతా కూడా వారి యొక్క దివ్యమైన చైతన్యంతో వచ్చి మాతో పాటు ధ్యానం చేస్తూ ఆనందంగా సంతోషంగా ఉంటూ  సకల జీవుల పట్ల ప్రేమతో ఉంటూ ఆత్మజ్ఙానం పొందుతారు
అదేవిధంగా ఈ జన్మలో ఈ ధ్యానానికి మాతో పాటుగా ఈ భూమీద ఉన్నటువంటి మానవజాతి అంతా కూడా వారి యొక్క దివ్యమైన చైతన్యంతో వచ్చి మాతో పాటు ధ్యానం చేస్తూ ఆనందంగా సంతోషంగా ఉంటూ  సకల జీవుల పట్ల ప్రేమతో ఉంటూ ఆత్మజ్ఙానం పొందుతారు.  అదేవిధంగా ఈ ధ్యానానికి మాతో పాటుగా బ్రహ్మర్షి పత్రిజీ మరియు మహావతార్ బాబాజీ మరియు సదానంద యోగి మరియు ఈ విశ్వ కళ్యాణం కోసం మేము చేస్తున్న ఈ ధ్యానానికి ఎవరైతే తమవంతుగా భాగస్వామ్యం అవడానికి సిద్ధంగా ఉన్న మాస్టర్ అందరూ వారి యొక్క పరమాత్మపు చైతన్యంతో వచ్చి మాతో పాటు కలిసి ధ్యానం చేస్తారు.                    ధ్యానం అయిన తర్వాత ఇప్పటి వరకు నాతో పాటుగా ఈ విశ్వ కళ్యాణం కోసం ధ్యానం చేసిన దివ్యాత్మ మరియు పరమాత్మ స్వరూపులందరికీ నా యొక్క ధన్యవాదములు.

No comments:

Post a Comment