Sri Ramyananda Bharathi Swamini First Ever Podcast With @itsutvchannel |Sri Sakthi Peetam Tirupati
Sri Ramyananda Bharathi Swamini First Ever Podcast With @itsutvchannel |Sri Sakthi Peetam Tirupati
https://youtu.be/v6IOB84KIU0?si=QZaET_U7xA6Yv3-d
https://www.youtube.com/watch?v=v6IOB84KIU0
Transcript:
(00:01) మీరు ఇప్పుడు పీఠాధిపతరాలు కదా అసలు ఈ రంగంలో మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకున్నారఅమ్మా యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః గుడిలోకి వెళ్లి అమ్మవారికి దండం పెట్టాలనిపిస్తుంది గుడి బయటకి వచ్చి అమ్మాయిని చూస్తే అదే భావన కలగటం లేదు చాలా మందిలో నేను కూడా చాలానే ఎదుర్కున్నాను ఎదుర్కుంటున్నాను కూడా డాక్టర్స్ కి ఇలాంటి ఒక స్పిరిచువల్ డివోషనల్ సైడ్ ఉండడము అసలు సైన్స్ ఇవన్నిటిని నమ్ముతుందా అమ్మ పుట్టడటం చూడంగానే ఆనందం కలుగుతుంది మనవాళ్ళు మరణించంగానే బాధ కలుగుతుంది కానీ ఈ వైద్య వృత్తిలో రెండు ఒకేసారి చూడటం అనేటువంటిది మనసు మీద చాలా ప్రభావం
(00:34) చూపిస్తుంది. నిజంగా మంత్రం మన శరీరంలో జరిగే మార్పులకు ఏ విధంగా అసలు నయం చేయగలుగుతుంది. మంత్రానికి ఆ శక్తి ఉన్నటువంటి వాట వాస్తవమే కానీ వితంతువులు ఉంటారు కదమ్మా వాళ్ళని శుభ కార్యాలకి పిలవరు ఒకవేళ వస్తే అరిష్టంగా భావిస్తారు. తంతువు అనేటువంటి శబ్దాన్ని పూర్వ సువాసిని అని అంటారు వాళ్ళను కూడా పూజించేటువంటి సంప్రదాయం మనకు ఉన్నది.
(01:02) ముత్యాలమ్మవారు ఈ గ్రామ దేవత కదమ్మా మరి ఇక్కడ ప్రతిష్టాపించడానికి ఈ దేవాలయం కట్టాలని అమ్మ సంకల్పించింది తల్లి మీకు శ్వేత వారాహి దేవి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఇంకఎక్కడా లేదు దక్షిణ భారతదేశంలో నిజంగా అమ్మవారు పూనుకోవడం అనేది ఉంటుంది అమ్మ నిజం నమ్మకం అని రెండు ఉన్నాయి అసలైన నిజాన్ని నమ్మించాల్సిన పని లేదు.
(01:22) అయితే నమ్మకం అనేది ఎప్పుడు నిజమవుతుందో చెప్పలేను. అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ యు టీవీ డివోషనల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ శక్తి పీఠాదీశ్వరి మంత్ర మహేశ్వరి మాతాజీ శ్రీ శ్రీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని వారు. ఇక ఆలస్యం చేయకుండా అమ్మతో మాట్లాడేద్దాం. నమస్కారం అమ్మ. అమ్మవారి ఆశీసులు తల్లి. అమ్మ అసలు ఎంబిబిఎస్ చేసి దాని తర్వాత సన్యాసినిగా ఇప్పుడు పీఠాధిపతిగా అసలు ఎందుకు మారాల్సి వచ్చిందమ్మ మీ ప్రయాణం ఎలా జరిగింది? తప్పకుండా నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురుపరంపరాం ముందుగా జగన్నాథుడైనటువంటి
(02:05) నారాయణునకు జగద్గురువులైనటువంటి ఆదిశంకరులకు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులైనటువంటి మా పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఏ వ్యక్తి అయినా సరేజీ జీవితంలో ఫలాని కావాలి ఫలాని జరగాలి అని కోరుకుంటూ ఉంటారు.
(02:32) కోరుకున్నది జరిగితే సంతోషం కొన్నిసార్లు జరగకపోతే దుఃఖం లేదా సరిపెట్టుకోవటం అనేది మామూలుగా మానవ జీవితంలో జరుగుతుంది. అయితే కోరుకున్నది కాక అనుకున్నది కాక అనుకోనిది అనోహ్యమైనటువంటివి కూడా మానవ జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అలానే నా జీవితంలో కూడా అటువంటి సంఘటనలు అటువంటి మార్పుల వల్ల జీవిత గమనం అనేటువంటిది మారిపోయింది. సుమారుగా ఒక 12 సంవత్సరాల క్రితం అంటే 2012 లో జరిగినటువంటి మార్పు ఇది నేను మీరు అన్నట్లుగా మెడిసిన్ చదివానమ్మ మెడిసిన్ చదివిన తర్వాత ఈ జీవితం అనేటువంటిది మారింది అయితే దీనికి బీజం మూలం అనేటువంటిది నా చిన్నతనంలోనే పడింది.
(03:13) దానికి కారణం ఏంటంటే కుటుంబ నేపథ్యం మా కుటుంబానికి ఇప్పుడు ప్రస్తుతం మా గురుదేవులుగా ఉన్నటువంటి కుర్తాళం పీఠాధిపతుల వారికి పూర్వాశ్రమంలో బంధుత్వం ఉండటం చిన్నతనం నుండే వారిని చూడటం వారి దగ్గరికి వెళ్ళటం అది కాక ఇంట్లో కూడా అమ్మవారి పూజలు అనేటువంటివి ఎక్కువగా జరగటం అనేటువంటి దాని వల్ల చిన్నప్పటి నుంచే కూడాను దైవభక్తి అనేటువంటిది అలవడింది అమ్మ వల్ల ఆ తర్వాత మంత్ర సాధనలో నా 14 15వ ఏట 16వ ఏట వచ్చేటప్పటికీ అప్పటికి ఇంకా మా గురువుగారు సన్యాసం తీసుకోలేదు మా పూర్వాశ్రమంలో బంధువులుగా ఉండేవారు వారిని చూడటానికి వెళ్ళినప్పుడు వారును
(03:52) ఆశీర్వదించడం జరిగింది ఆ తర్వాత సన్యాసం వారు తీసుకున్న తర్వాత నేను దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి నాకు మంత్రోపదేశం చేయటం ఆ తర్వాత మంత్రము చదువు అనేటువంటివి రెండు పారలల్ గా జరిగాయి కానీ చదువు పూర్తఅయిన తర్వాత ఒక అనోహ్యమైనటువంటి స్థితిలో ఒక దివ్యమైన నటువంటి పరిస్థితిలో ఈ మార్పు అనేటువంటిది జరిగింది.
(04:16) అదొక దేవతాత్మకమైనటువంటి సూచనగా దేవతలు అనుకుంటే ఏదైనా జరుగుతుంది ఒక్క క్షణంలో జీవితాన్ని మారుస్తారు దేవతలు అంటారే అలా నా జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చి సుమారుగా 12 13 సంవత్సరాల క్రితం 2012 లో శ్రావణ పూర్ణిమనాడు మామూలుగా ఉన్నటువంటి నా జీవితం ఈ సన్యాస మార్గంలోకి ప్రవేశించడం ఆధ్యాత్మిక పదంలోకి ప్రవేశించడం అనేటువంటిది జరిగింది.
(04:42) అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఎంబిబిఎస్ చదివి ఆ సుమారుగా 24 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎవరైనా నాకు వైరాగ్యం కలిగింది నేను సన్యాసం తీసుకుంటాను అంటే సమాజం ఏమంటుంది నీకేమనా పిచ్చా ఇంత మంచి చదువు చదువుకున్నావ్ ఎంతో మానవ సేవ మాధవ సేవ అంటున్నారు చేయగలుగుతావు కదా ఇది వదిలేసి ఈ మార్గంలోకి రావటం ఏమిటి అని మామూలుగా అనేవాళ్ళు ఆనాడు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
(05:11) అయితే అప్పుడు ఒక చిత్రమైన సంఘటన జరిగింది. మామూలుగా ఏమిటి అనింటే మనం పురాణాల్లో చదువుతాం ధ్రువుడు తపస్సు చేస్తే స్వామి కనిపించాడు వెంకటేశ్వరుడు పరమేశ్వరుడు విష్ణుమూర్తి కనిపించాడు అని ఇలా ప్రహ్లాదుడు కోసం నరసింహుడు వచ్చాడు అని దేవతలు వచ్చినప్పుడు వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చారో ఒక ధ్రువుని ఎలా మార్చారో ఒక ప్రహ్లాదుని ఎలా మార్చారో మార్చదలుచుకున్న సమయం వచ్చేటప్పుడు వాళ్లే వచ్చి మారుస్తారు నా విషయంలో కూడా అదే జరిగింది.
(05:40) శ్రావణ పూర్ణిమ నాడు స్వామి వారు మా గురువుగారు నాకు దీక్షను అనుగ్రహించారు. ఒక ప్రత్యేకమైనటువంటి భైరవ మంత్రాన్ని కాలభైరవుడు ఉపదేశించారు. అందరూ అడిగినప్పుడు ఇదే సమాధానం చెప్పాను నేను ఏమిటి భైరవుడు భైరవుడు కనిపించాడు చెప్పాడు భైరవుడు కనిపించడం ఏమిటి హాల్యూసినేషన్ ఇల్యూషన్ డెల్యూషన్ మేము ఇన్నేళ్లుగా పూజ చేస్తున్నాం ఇన్నేళ్లుుగా సాధన చేస్తున్నాం ఇన్నేళ్లుుగా తపస్సు చేస్తున్నాం మాకు కనిపించలేదు ఒక 25 ఏళ్ళ అమ్మాయికి నీకు కనిపించడం ఏమిటి నువ్వు మారిపోవటం ఏమిటి ఏమిటిది అని అనుకున్న వాళ్ళు ఉన్నారు అన్నవాళ్ళు ఉన్నారు. నేను మా గురువు గారిని అడిగాను
(06:15) స్వామివారు ఎట్లా ఏంటి అంటే దీనికి సమాధానం చెప్పవలసింది నేను కాదు నిన్ను ఎవరైతే ఇక్కడ ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చారో ఈ మార్పుని ఎవరైతే నీలోకి ప్రవేశపెట్టారో ఆ భైరవుని అడుగు అన్నారు అడిగాను అడిగితే పూర్ణిమనాడు దీక్ష తీసుకోవడం జరిగింది అమావాస్యనాడు వచ్చేటప్పటికీ హోమకుండం ముందర కూర్చున్నాను భైరవుడి ముందర హోమం చేస్తూ ఉన్నాను అందరూ భక్తులు కూర్చొని ఉన్నారు.
(06:40) కూర్చొని ఉంటే అదిగో భైరవుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సందరి ఎదురుకుండానే సమాధానం చెప్తున్నాడు చూడు అన్నారు. హోమకుండల్లో నుండి ఒక ఏకముఖి రుద్రాక్ష బయటికి రావటం అనేటువంటిది అందరి కళ్ళ ముందే జరిగింది. అలా భైరవ అనుగ్రహం దేవతా అనుగ్రహం వల్ల నా జీవితం మలచబడింది అని నాకే కాక ఆనాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వామి తెలిసేటట్టుగా చేశాడు ఇప్పటికి కూడా దేవతలు అలా తెలియజేయడం అనేటువంటిది జరుగుతున్నది కాబట్టి మానవ ప్రయత్నం అనేటువంటిది కాకుండా ఇది పరమేశ్వరి యొక్క నిర్ణయం అమ్మవారి ఇచ్చ అమ్మవారి కోరిక వల్ల నా జీవితం అనేటువంటిది ఆ నాడు మలచబడి
(07:19) ఈ నాడు ఎన్నో మెట్లు ఎక్కి ఈ స్థితిలో ఉండటం అనేటువంటిది జరిగింది. చిన్నప్పటి నుంచి ఇంట్లో పూజలు ఇవన్నీ ఎక్కువ చేయడం వల్ల మీకు అనే మీకు ఈ దైవం పట్ల నమ్మకం అనేది ఉంది ఒప్పుకుంటా కాకపోతే ఎంబిబిఎస్ చదివి ఒక డాక్టర్స్ కి ఇలాంటి ఒక స్పిరిచువల్ డివోషనల్ సైడ్ ఉండడము అసలు సైన్స్ ఇవన్నిటిని నమ్ముతుందా అమ్మ ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఉంటుంది మీరు చూడండి హాస్పిటల్స్ లో గనుక చూస్తే మామూలుగా మెడికల్ కాలేజెస్ లో హాస్పిటల్స్ లో గనుక చూస్తే గైరిక్వార్డ్ లో అప్పుడే ప్రసవించినటువంటి డెలివరీస్ అవ్వటం న్యూ బార్న్ బేబీస్ ఉండటం జరుగుతుంది ఒక పక్క సీరియస్ కేసెస్
(07:57) ఐసయు మార్చురీస్ డెత్స్ జరుగుతూ ఉంటాయి అంటే జననాన్ని మరణాన్ని ఒకే సమయంలో చూసేటువంటి ప్రొఫెషన్ ఏంటి అంటే అది డాక్టర్ ప్రొఫెషన్ే అంటే జనన మరణాలకు ఒక అతీతమైనటువంటి స్థితిగా ఉండగలిగేటువంటి స్థితి డాక్టర్లకు వచ్చేస్తుంది. ఏదైతే మన శాస్త్రం మన పురాణం చెప్తున్నదో పుట్టినవాడు జన్మించక తప్పడు జన్మించిన వాళ్ళు గిట్టగా తప్పదు అనేది సూత్రాన్ని మామూలు వాళ్ళు ఆకళింపు చేసుకోవడం కష్టం పుట్టటం చూడంగానే ఆనందం కలుగుతుంది మనవాళ్ళు మరణించంగానే బాధ కలుగుతుంది.
(08:26) కానీ వైద్యవృత్తిలో రెండు ఒకేసారి చూడటం అనేటువంటిది మనసు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అవును ఆ అతీతమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్తుంది మొదటిది రెండవది మెడిసిన్ అనేటువంటిది ఒక సైన్స్ మామూలుగా చూడండి డాక్టర్స్ కూడా చాలా చోట్ల చాలామంది ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ అంటారు. అంటే సాధారణంగా మెడిసిన్ లో జరగనటువంటిది ఒక అద్భుతం జరిగింది దానికి సమాధానం మెడికల్ సైన్స్ లో లేదు ఏమిటి అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఆధ్యాత్మికమైనటువంటి శక్తి మనది మెడికల్ సైన్స్ అనేది మోడరన్ సైన్స్ అయితే ఆధ్యాత్మిక శాస్త్రం అనేటువంటిది ఇట్స్ ఆన్ ఏన్షియంట్ సైన్స్
(09:04) రెండు కూడా శాస్త్రాలే ఆ శాస్త్రానికి శాస్త్రానికి రెండిటికీ కూడా సంబంధం ఉన్నది అయితే అది తెలుసుకున్న వాళ్ళకి ఏమిటి అనేటువంటిది పూర్తిగా అవగాహన ఉంటుంది లేకపోతే అది ఒక భావనగా ఒక నమ్మకంగా మిగిలిపోతుంది కొంతమంది నమ్మకుండా కూడా ఉండొచ్చు. అమ్మ ఇప్పుడు మీ దినచర్య ఎలా ఉంటుందమ్మా మీ రోజున మీరు ఏ విధంగా ప్రారంభిస్తారు నేను ఇక్కడ అమ్మవారిని మీరు దర్శించుకొనే ఉంటారు తల్లి మరకత శక్తికాళి అమ్మవారు అన్నారు.
(09:35) ఉదయం పూట అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి. అది కాకుండానే నిద్ర లేవంగానే కూడాను నా ప్రత్యేకమైనటువంటి పూజా మందిరంలో అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలతోటి ఉదయం మొదలవుతుంది. సరే ముందర ధ్యానం అనండి యోగా అనండి అవి జరుగుతాయి తర్వాత దేవాలయానికి వచ్చి కూర్చున్నప్పుడు కొన్ని వందల మంది వస్తూ ఉంటారు రకరకాలైనటువంటి కష్టాలతోటి ఇబ్బందులతోటి సమస్యలతోటి వాళ్ళకు తగినటువంటి మార్గోపదేశం చేయటము ఆ తర్వాత ఇక్కడ అన్న ప్రసాద వికరణ జరుగుతుంది.
(10:05) నేను వెళ్లి మళ్ళీ నా ధ్యాన కార్యక్రమాల్లో నిమగ్నం అవుతాను. సాయంకాలం అవసరమైనప్పుడు భక్తులు ఎవరైనా వస్తే చూడటము లేదంటే ఇప్పుడు ఇలా మీలాగా అడగటానికి ఎవరైనా సందేహాలు అడగటానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడటము జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఏమిటి అంటే జపము ధ్యానము దేవాలయ సందర్శనము అమ్మవారి పూజలు ఆ మాధవ సేవ మానవ సేవగా మారటానికి వచ్చినటువంటి భక్తులకి కావలసినటువ అందించడానికి నేను నా సమయాన్ని అంతా కూడాను ఉపయోగిస్తూ ఉంటాను తల్లి మీ జీవన ప్రయాణం గురించి చెప్పారు మీ దినచర్య గురించి చెప్పారు అసలు ప్రతి రంగంలోనూ ఆడవాళ్ళకి ఎన్నో ఇబ్బందులు అనేటివి ఉంటూ ఉంటాయి వాటిని ఎదుర్కొని
(10:43) ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అవును మీరు ఇప్పుడు పీఠాధిపతిరాలు కదా అసలు ఈ రంగంలో మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కున్నారఅమ్మా అన్ని రంగాల్లోన మామూలు మనుషులమే ఏముంది అమ్మవారు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నది. ఇప్పుడు మనం దేవీ భాగవతం గనుక చూస్తే ఒక మహిషాసురుడిని సంహరించడానికి వెళ్ళినప్పుడు శుంభని శశుంభులను సంహరించడానికి అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళు ఆమెను దేవతగా చూడలేదు కామదృష్టితో చూసి ఆమెనే కావాలని కోరుకున్నారు నువ్వు ఒక ఆడదానివి నువ్వు ఏమి యుద్ధం చేయగలవు మాతో అన్న వాళ్ళను సమస్త దేవతల కంటే తానే శక్తిమందురాలని నిరూపించి వాళ్ళని సంహారం
(11:16) చేసినటువంటి దేవి ఆమె కూడా ఆమె పట్ల కూడా అటువంటి రాక్షస ప్రవృత్తిని ప్రవర్తించడం అనేటువంటిది మన పురాణాల్లోనే కనిపిస్తున్నది కాబట్టి ఈ సమాజంలో అటువంటివి జరుగుతూనే ఉన్నాయి నేను కూడా చాలానే ఎదుర్కున్నాను ఎదుర్కుంటున్నాను కూడాను ఎలా ఉంటుందంటే సమాజంలో మన సిద్ధాంతం చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంతం యత్ర నార్యస్త పూజ్యంతే రమంతే తత్ర దేవతాః గుడిలోకి వెళ్లి అమ్మవారికి దండం పెట్టాలనిపిస్తుంది గుడి బయటకి వచ్చి అమ్మాయిని చూస్తే అదే భావన కలగటానికి కలగటం లేదు చాలామందిలో అదేవిధంగా ఇప్పుడు నా విషయానికి వచ్చేటప్పటికి కూడాను ఎంతోమంది శత్రువులు
(11:53) ఇవేమిటి సన్యాసం తీసుకోవడం ఏంటి సన్యాసం తీసుకొని ఈ పీఠం ఏమిటి ఇదేమిటి అదేమిటి ఎలాగైనా సరే కిందకు లాగాలి లేదా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి లేదంటే ఇంకో రకంగా దుష్ప్రచారం చేయాలి అని చేసిన వాళ్ళు ఉన్నారు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అయితే రక్షగా రక్షణగా పరమేశ్వరి యొక్క కృప అమ్మ అనుగ్రహం ఉండటం వల్ల ఆమె ఎప్పటికప్పుడు ఎలా రక్షించాలో అలా రక్షిస్తూ ఉన్నది ఎందుకంటే ధర్మం కోసం నా జీవితం ధర్మ మార్గంలో వెళ్తున్నటువంటి జీవితం ఆ ధర్మం వస్తూ ఉంటుంది ఏదో ఒక రూపం ఎదురిస్తూ ఉంటుంది ఆ ఎదురించిన ప్రతిసారి ధర్మ స్వరూపిణ అయినటువంటి దేవత రక్షణగా
(12:29) నిలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం గమనించాల్సింది ఏమిటంటే మామూలుగా పీఠాధిపతులు అనంగానే పురుషులు గుర్తుకొస్తారు. అవును వెళ్ళంగానే వాళ్ళని చూడంగానే ఒక నమస్కారం చేయటం ఒక సాష్టాంగం చేయటం ఇవన్నీ చేయడం అనేటువంటిది అనిపిస్తుంది. కానీ స్త్రీని చూస్తే అవతల ఉన్నటువంటి స్త్రీ ఎంత గొప్పదైనా సరే చేయాలనేటువంటి భావన చాలా కష్టం చేయాలనిపించదు.
(12:53) ఆ ఆడవాళ్ళకు నమస్కారాలు చేసేది ఏమిటి? ఎందుకంటే నా విషయంలో నేను అనుభవించినటువంటి ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాను. నాలుగు గోడల మధ్య వచ్చి నాకు సాష్టాంగం చేసి మా కష్టాలు ఇబ్బందులు అన్నీ తీరాయి అని చెప్పిన వాళ్ళు పబ్లిక్ లో ఉన్నప్పుడు ఆ సాష్టాంగం చేయటానికి వెనుకాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇంక అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయటం.
(13:13) దాని గురించి నేను నాకు బాధలు ద్వేషాలు ఇవేవి ఉండవు కానీ ఒక్క భావన మాత్రం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది ఏమిటంటే ఇవాళ నేను ఉన్నటువంటి స్థితి నేను ఉన్నటువంటి స్థానం నేను కొన్ని వందల వేల మంది మహిళల కోసం చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం వాళ్ళ ఆత్మగౌరవం కోసం నిలబడుతున్నటువంటి ఈ స్థానం వీటన్నిటికీ వచ్చేటువంటి గౌరవం నాకు మాత్రం సంబంధించింది కాదు స్త్రీ జాతికి సంబంధించింది అనేటువంటి భావన నాలో ఉండటం వల్ల అప్పుడప్పుడు కొంచెం మనసు మనసులో అనిపిస్తూ ఉంటుంది ఏమిటి ఈ సమాజం ఈ పోకడ ఏమిటి వీళ్ళు నిద్రలేస్తే అమ్మవారి దగ్గరికి వెళ్తారు నమస్కారం చేస్తారు కోరికలు కోరుకుంటూ ఉంటారు కానీ
(13:50) వచ్చేటప్పటికల్లా ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటారుఏం కొంతమంది అంటే అందరూ అని చెప్పను కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఉంటున్నారు ఉంటారు వాళ్ళతోటే మనం ఈ సమాజంలో జీవిస్తూ మనం అనుకున్నది మనం సాధించగలగాలి. ఒకప్పటి కాలంలో అమ్మ స్త్రీలు సీతలాగా చక్కగా సాఫ్ట్ అండ్ సెన్సిటివ్ గా ఈ విధంగా ఉండడం అయితే మనకు తెలుసు ఇప్పటి కాలంలో స్త్రీల పట్ల జరిగేటివ అన్నీ కూడా మనం కళ్ళ ముందే చూస్తున్నాము ఇప్పుడు స్త్రీ మహిషాసుర మర్దినిగా మారే పరిస్థితి వచ్చింది అంటారా ఎప్పుడో అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించింది ఆమె అవతారమే ఇప్పుడు దసరాలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఆవిడ మహిషాసుర
(14:27) మర్దినిగానే అవతరించింది. మీరు సీత గురించి చెప్తూ చాలా సాఫ్ట్ గా సెన్సిటివ్ గా ఉన్నటువంటి వ్యక్తిగా వర్ణించారు సీతాదేవిని ఆమె శివధనస్సుని విరిచినటువంటి వాడికే ఆమెను ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు వాళ్ళ తండ్రి కారణం తెలుసు కదా రామాయణంలో కనిపిస్తూ ఉంటుంది సీతాదేవి చిన్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ శివధనసు ఉన్నటువంటి బల్లం జరిపేసిందిట చేత్తో అంత శక్తిమంతురాలు సీతాదేవి అయితే ఆమె తనలో ఉన్నటువంటి పరాక్రమాన్ని వీరత్వాన్ని చూపించడం అనే అనేటువంటిది మనకి పెద్దగా రామాయణంలో కనిపించదు కానీ ఆమె మాత్రం అబల కాదు సబలే ఆమె దుఃఖము ఆమెను పెట్టినటువంటి బాధే రావణాసురుడి
(15:08) సంహారానికి కారణం అయింది. కాబట్టి సీతగా ఉన్నటువంటి స్త్రీ మనసుని నొప్పిస్తే ఆ మనసులో నుండి వచ్చేటువంటి ఆవేశము కోపము బాధే మహిషాసుర మర్దిని రూపంలో వచ్చి ఇబ్బంది పెట్టిన వాళ్ళని శిక్షిస్తుంది. అయితే ఇది మనం స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ పురుషులకు కూడా కష్టాలు ఉంటున్నాయి. ఆడవాళ్ళు పురుషులని కష్టాలు పెడుతున్న వాళ్ళు ఉన్నారు మగవాళ్ళు స్త్రీలను కష్టాలు పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఆడవాళ్ళను కష్టాలు పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇలా అన్ని రకాలైనా సరే ఏదైనా సరే కష్టం అనేది తప్పటం లేదు మానవ జీవితంలో
(15:41) అవును ఆ కష్ట నష్టాలకి అతీతంగా ఉండటం అనేటువంటిది చెప్పటం తేలికే గానీ సామాన్య జీవిత జీవితం గడిపేటువంటి వాళ్ళకి ఒకే రకంగా చూడటం కష్టం కాబట్టి అమ్మవారిని ఆరాధించండి ప్రతి స్త్రీలోనూ అమ్మవారిని చూడటానికి ప్రయత్నం చేయండి అది మీ జీవిత గమనాన్ని మార్చుకోవడానికి మొదటి మెట్టు అవుతుంది. చాలా చక్కగా చెప్పారమ్మ మీ జీవిత ప్రయాణం విన్న తర్వాత కచ్చితంగా మీరు చాలా మందికి కూడా ఆదర్శం అని నాకు అనిపిస్తుంది.
(16:09) అమ్మ ఒక చిన్న సందేహం మీరు చెప్తున్నప్పుడు మంత్రోపదేశం గురించి ఒక మాట అన్నారు కదా ఆడవాళ్ళు మంత్రోపదేశం చేయొచ్చా అమ్మ ఆడవాళ్ళు మంత్రోపదేశం చేయొచ్చా అంటే చేయొచ్చు అని చెప్తున్నది మన శాస్త్రం మన పురాణం లలితాదేవి ఉన్నది ఆమెకు సంబంధించినటువంటి మంత్రాలను అగస్త్యుడు అగస్త్యుడి భార్య అయినటువంటి లోపాముద్రాదేవి ఇద్దరూ కూడా చేశారు.
(16:33) ఆనాడు వాళ్ళు చేసినటువంటి మంత్రాలను వాళ్ళు తరతరాలుగా వస్తున్నటువంటి వాళ్ళ శిష్యులకు ఇవ్వటం ఆ శిష్యుల నుంచి ఇంకా శిష్యులకు రావటం అంటే గురు శిష్య పరంపర అనేటువంటిది వస్తూ ఉన్నది. అంటే అనాదికాలం నుండి కూడా స్త్రీలు మంత్రోపదేశం చేస్తున్నారు అనేటువంటిది లలితాదేవి సంప్రదాయంలో మనకు కనిపిస్తూ ఉన్నది.
(16:55) అయితే ఈ మంత్ర ఉపదేశం చేయటానికి ఏమైనా అర్హతలు ఉండాలా ఉపదేశం అంటే మనం పక్కవాళ్ళకు చెప్పటం ఉపాసన అంటే మనకు మనం చేసుకోవటం రెండు చేయొచ్చు స్త్రీలు చేయొచ్చు పురుషులు చేయొచ్చు అయితే ఆ ఉపదేశం అనేటువంటిది ఒక సద్గురువు దగ్గర మనం ఉపదేశం పొందగలగాలి అసలైన గురువును అన్వేషించుకొని మనం ఉపదేశం పొంది మనం చేయాలి. మనకి మంత్రం ఇచ్చేటువంటి అధికారం వచ్చింది అంటే మంత్రోపదేశం చేసేటువంటి స్థాయి వచ్చింది అని మన గురువు మనల్ని సర్టిఫై చేస్తే అప్పుడు మనం చేయొచ్చు.
(17:29) ఇప్పుడు నేను ఉన్నాను నేను మంత్రోపదేశం ఇవ్వటం అంటే మా గురువుగారు నువ్వు మంత్రం ఉపదేశం స్థితికి నువ్వు వచ్చావు నీకు మంత్ర సిద్ధి కలిగింది నువ్వు ఉపదేశించు అన్న క్షణం నుంచి నేను ఉపదేశిస్తున్నాను. ఓకే అట్లా గురువు కృప అనేటువంటిది గురువు ఆజ్ఞ అనేటువంటిది దానివల్ల ఇప్పుడు మీరు ఇక్కడ గనక చూస్తే మన ఆశ్రమంలో మహిళలు మంత్రం జపాలు చేస్తూ ఉంటారు చక్కగా ఎవరికి వాళ్ళు హోమాలు చేసుకుంటూ ఉంటారు అంటే కష్టం వచ్చినో వచ్చినప్పుడో ఇబ్బంది వచ్చినప్పుడో మీరు ఎవరి దగ్గరికో వెళ్లి మాకోసం కాస్త హోమాలు చేసి పెట్టండి మంత్రాలు మాకు చేసి పెట్టండి అనేది
(18:03) కాకుండా ఈ రంగంలో కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు మహిళలు నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో మహిళలకు మంత్రోపదేశం చేయటం అనేటువంటిది కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. తద్వారా మంచి ఫలితాలను వాళ్ళు సాధిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో ఉచితంగా గురు దక్షిణ లేకుండా ఈ మంత్రోపదేశం అనేది తీసుకుంటే ఫలితం ఉంటుందా అమ్మ ఇక్కడ ప్రతిరోజు కూడా అందరికీ ఉచితంగానే మంత్రోపదేశం ఇవ్వడం జరుగుతుంది ఎన్ని వేల మంది వచ్చినా ఎంతమంది వచ్చినా ఉచితంగానే ఇస్తూ ఉన్నాం.
(18:34) అయితే గురు దక్షిణ అనేటువంటిది ఇవ్వాలి అని శాస్త్ర వాక్యం అయితే ఆ దక్షిణ కేవలం ధనం రూపంలోనే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఇవ్వగలిగితే ఇస్తారు ఇవ్వాలనుకుంటే ఇస్తారు ఇవ్వలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు నాకు దక్షిణ ఇస్తే తప్ప నేను నీకు మంత్రం చెప్పను నువ్వు నాకు దక్షిణ ఇస్తేనే నేను నీ కష్టాన్ని తీరుస్తాను.
(18:54) అనేటువంటిది నిజమైన గురువు లక్షణం కాదు. నువ్వు నీ కష్టం తీర్చుకో తీర్చుకున్న తర్వాత నాకేం కావాలి ధర్మాన్ని నిలబెట్టడం కావాలి నువ్వు ధర్మ మార్గంలో నడువు నువ్వు 10 మందికి సహాయం చెయ్ పది మందికి అన్నదానం చెయ్ ఆవులకు గోసేవ చెయ్ నువ్వు నువ్వు నీ మంత్రం ఏ దేవత అయితే నిన్ను అనుగ్రహించిందో ఆ దేవత గొప్పతనాన్ని గురించిప మందికి చెప్పు ఇంకొక పది మందిని ఆ దేవతకు భక్తులుగా తయారు చెయ్ ఈ ధర్మ మార్గ విస్తరణ చేయటంలో గురుదక్షిణ అనేటువంటిది కేవలం ధనం వరకు మాత్రమే కాకుండా వాళ్ళ జీవితం లో వాళ్ళు ఏది ధర్మం వైపు సమర్పించగలరో అదే ఇక్కడ అసలైన
(19:31) గురుదక్షిణగా భావించడం వల్ల ఇక్కడ మంత్రోపదేశానికి దక్షిణ తీసుకోవడం అనేటువంటి ఆచారము సంప్రదాయము లేవు అద్భుతం అమ్మ అంటే ధనంతోనే వెలకట్టకుండా మంచిని ధర్మాన్ని కూడా నలుగురికి పంచడం కూడా గురుదక్షిణ కిందకే వస్తుంది నిజమే నిజమే అంతేకాకుండా ఇక్కడ కొన్ని సందర్భాలలో మనం ఉచితంగా హోమాలు చేస్తాం ఇక్కడ బ్రహ్మోత్సవాల సమయంలో అలాగే సంవత్సరంలో కొన్నిసార్లు చూసుకొని ఎన్ని వేల మంది గోత్రనామాలు ఇస్తే అన్ని వేల మందివి కూడా అమ్మవారి దగ్గర పెట్టి మనవాళ్ళు చదివి ఉచితంగా హోమాలు చేస్తారు.
(20:02) అయితే ఆశ్రమము ఇక్కడ జరిగేటువంటి నిత్యానదానము ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు కావాల్సినటువంటి వాటికి మాత్రం భక్తులు ధనం ఇస్తూ ఉన్నారు ఆ కార్యక్రమాలు వాటికి అవి జరుగుతూ ఉన్నాయి ఇవ్వలేని వాళ్ళ కోసం కూడా ఇక్కడ ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. అమ్మ మీరు మెడిసిన్ చదివారు కాబట్టే నాకు ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఉంది.
(20:23) ఏంటంటే మంత్రం శరీరంలో జరిగే మార్పులకు అనారోగ్య సమస్యలకు మంత్రం నయం చేస్తుంది అని అంటూ ఉంటారు మీరు చెప్పండమ్మా నిజంగా మంత్రం మన శరీరంలో జరిగే మార్పులకు ఎలా ఏ విధంగా అసలు నయం చేయగలుగుతుంది మీరు పురాణాల్లో చదివే ఉంటారు కథలు చదివే ఉంటారు ఇప్పుడు ఋషులో దేవతలో శాపించ శాపం ఇవ్వటం వల్ల శపించడం వల్ల ఒకళ్ళకి క్షయ వచ్చింది ఇంకొకళకి కుష్టు వ్యాధి వచ్చింది అనేటువంటి కథలు మనకు ఉన్నాయి కదా అవును అవును అంటే ఒక శాపా నికి ఒక మంత్ర శక్తికి శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యానికి దాన్ని బాగు చేయగలిగినటువంటి శక్తి ఉంది దాన్ని ఆరోగ్యాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి
(21:02) ఉన్నది అయితే మంత్రానికి ఆ శక్తి ఉన్నటువంటి మాట వాస్తవమే కానీ ఆ మంత్ర శక్తిని చూపించగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇవాల్టి రోజులు మీరు చూడండి పూర్వకాలంలో మనం గనుక చూస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి కథల్లో చంద్రుడికి క్షయ వచ్చింది ఆయన ఏదో దేవతారాధన చేసుకొని పోగొట్టుకున్నాడు అని ఉన్నది.
(21:25) మ్ మరి వాళ్ళ కేవలం దేవతలకి వాళ్ళకు కూడా అన్ని శక్తులు ఉన్నప్పటికీ కూడా దేవ వైద్యులు అని ఉన్నారు అశ్వి దేవతలు ఉన్నారు ధన్వంతరి ఉన్నాడు అంటే ఆరోగ్యానికి సంబంధించి మనకి ఏదన్నా సమస్య వస్తే అది తీర్చుకోవడానికి మణి మంత్రము ఔషధి ఈ మూడు మార్గాలు చెప్పారు దాంట్లో ఔషధులు మందులు ఖచ్చితంగా వేసుకుంటూ దాంతో పాటుగా మంత్ర మార్గం అంటే ఇట్స్ ఆన్ ఆల్టర్నేటివ్ థెరపీ ఇవాళ్ళ ఏదైతే మనం ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని చెప్పి యోగా చేయండి ఇప్పుడు మనం రీసెర్చస్ చూడండి లేటెస్ట్ రీసెర్చస్ ఏమ వస్తున్నాయి మెడిసిన్ ని ఇంటిగ్రేట్ చేయాలి అలోపతీని ఇంటిగ్రేట్ చేయాలి నాచురోపతీని ఇంటిగ్రేట్
(22:06) చేయాలి అలాగే ఈ మంత్రాన్ని చాలా రీసెర్చస్ లో ఓంకారం చేస్తే హార్ట్ బీట్ మీద ఎట్లా పనిచేస్తుంది ఆటోనామిక్ నెర్వస్ సిస్టం ఎట్లా పనిచేస్తున్నది ఇవన్నీ కూడాను రీసెర్చస్ జరిగి మంత్రం అనేటువంటిది ఆరోగ్యం మీద మంచి ప్రభావమే చూపిస్తుంది అని రీసెర్చస్ ఉన్నాయి మరి చెడు ప్రభావం చూపించదా అంటే కొంతమంది ఉంటారు ఇప్పుడు ఇప్పుడు నేను మీకు చెప్పాను చూడండి శాపం ఏమిటి వీడి ఆరోగ్యం నాశనం అయపోవాలి అని శాపించారు వాళ్ళు చేసినటువంటి తప్పు వల్ల శాపం అనేటువంటిది పొందారు.
(22:37) అట్లా పక్కవాళ్ళ ఆరోగ్యం బాగుండకూడదు అని చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు గనుక కొంచెం గట్టిగా అనుకున్నా చేసినా అవి కూడా కొంత ఫలితాన్ని చూపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు అందుకని చూడండి ఏ కారణం కనిపించట్లేదు మాకు ఆరోగ్యం బాగుంటంలేదు డాక్టర్లకు చూపించుకున్న కొన్నిసార్లు ఆరోగ్యం బాగుంటంలేదు అన్ని బాగున్నాయి అని చెప్తున్నారు అని వచ్చేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు.
(22:59) అది కాకుండా మెడిసిన్స్ వాడుతున్నాము ఇంత టైం పడుతుంది కానీ ఇంకొంచెం తొందరగా తగ్గాలి అని అనుకున్నప్పుడు మనం ఇచ్చినటువంటి మంత్రాన్ని తీసుకొని డాక్టర్స్ చెప్పినటువంటి టైం కంటే కూడా తక్కువ టైంలోనే మందులు వాడుతూ మంత్రాన్ని చేస్తూ ఆరోగ్యాన్ని పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే రెండు రకాల వాళ్ళు మనకు కనిపిస్తారు అంటే మంత్ర ప్రభావం ఎలాంటిది అంటే కత్తి లాంటిది అది ధర్మాన్ని రక్షించడానికి దేశాన్ని రక్షించడానికి ఉపయోగించొచ్చు నీకు కోపం వస్తే కత్తు పెట్టి పొడిచి ఎదుటి వాడిని చంపడానికి ఉపయోగించొచ్చు అంటే ఇట్స్ ఏ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ స్వర్డ్ లాంటిది
(23:31) దేనికైనా నువ్వు వాడొచ్చు కాబట్టి మంత్రానికి ఆ శక్తి ఉన్నది అయితే మంత్రానికి ఆ శక్తి ఉన్నప్పటికీ కూడాను చేయగలిగినటువంటి వాళ్ళు చేస్తేనే ఆ శక్తి అనేటువంటిది పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఇచ్చిన దానికి చదువుకున్న డాక్టర్ ఇచ్చిన దానికి కేవలం బుకిష్ నాలెడ్జ్ తో డిగ్రీ లేకుండా ఇచ్చిన వాళ్ళకి ఎలా ఎంత తేడా అయితే ఉంటుందో మంత్రం అనేటువంటిది ఉపాసన చేసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అనో కేవలం పుస్తకాల్లో చదువుకున్న దానికి చాలా తేడా ఉంటుంది.
(24:02) నేను మంత్రం వల్ల ఏ విధంగా మంచి చేయొచ్చు ఒక మనిషికి అనే విధంగానే ఆలోచించాను తప్పించి ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్తున్నప్పుడు కలిగిన ఇంకొక ప్రశ్న ఏంటి అంటే చెడు కూడా చేయొచ్చు అని అన్నారు మీరు చేస్తారు తల్లి ఇప్పుడు మనకి లలితా సహస్రనామావళిలోనే ఉన్నదమ్మ ఏమిటి దేవతల మీదే ప్రయోగం చేశారు రాక్షసులు జయవిఘ్న యంత్రము లలితాదేవి సైన్యం యుద్ధంలో యుద్ధం చేసి గెలుస్తున్నది అని చూసాడు భండాసురుడు అనేటువంటి రాక్షసుడి మీద అమ్మవారి సైన్యం యుద్ధం చేస్తున్నది మామూలుగా యుద్ధంలో ఏం చేస్తారు ఉదయం నుంచి సాయంకాలం వరకు యుద్ధం చేస్తారు స్తారు
(24:32) తర్వాత సాయంకాలం యుద్ధం ఆపేసేవాళ్ళు మళ్ళీ మర్నాడు మొదలు పెట్టేవాళ్ళు అది యుద్ధ ధర్మం గెలవట్లేదు వాళ్ళు ఓడిపోతున్నారు ఏం చేయాలి అందుకని ఏం చేశడు ఒక జయవిగ్న యంత్రం అనేది అమ్మవారి కోట శిబిరంలో యుద్ధ శిబిరంలో ఎవరికీ తెలియకుండా పెట్టాడు ఆ ప్రయోగ ఫలితం దేవతలందరి మీద పడింది. మళ్ళీ అమ్మవారు గణపతిని సృష్టించడం ఆ ప్రయోగ ఫలితాన్ని పోగొట్టడం అనేటువంటిది జరిగింది.
(24:55) అది కాక యుద్ధం జరిగేటప్పుడు రెండు మూడు అస్త్రాలు వేసాడు. తృషాస్త్రం అని ఒకటి సర్వరోగాస్త్రం అని ఒకటి అంటే అన్ని రోగాలు వచ్చేసాయి వీళ్ళకి ఒక మంత్ర అస్త్ర ప్రభావం వల్ల అప్పుడు అమ్మవారు అచ్యుతుడు అనంతుడు గోవిందుడు అని చెప్పి వాళ్ళని సృష్టిస్తే వాళ్ళ అన్ని వ్యాధులని కూడా తొలగించి పైకి వెళ్ళిపోయారు అలాగే తృషాస్త్రం అంటే డహైడ్రేట్ అయ్యేటట్లుగా వేశరు వీళ్ళంతా దప్పికతో అలమటిస్చిపోతూ ఉంటే అమ్మవారు మళ్ళీ దానికి ఒక మార్గం చూడటం జరిగింది అంటే దేవతల కాలం నుండే మంత్ర శక్తితోటి అనా అనారోగ్యాన్ని కలిగించటం అలాగే అనారోగ్యాన్ని పోగొట్టటం రెండు కూడా
(25:36) మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనం నేర్చుకున్నవి ఎక్కడి నుంచి నేర్చుకుంటాం మన పై నుంచి మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. ఎక్కడ అనిఅంటే పురాణాల్లో ఋషుల దగ్గర నుంచి వాళ్ళు దేవతల దగ్గర నుంచి అలా అలా అలా మన పరంపరలో మనం చూస్తూ ఉంటే ఒక శక్తిని మంచికి ఉపయోగించే వాళ్ళు మనకు కనిపిస్తున్నారు చెడుకి ఉపయోగించే వాళ్ళు కనిపిస్తున్నారు.
(26:00) శక్తిని చెడుకి ఉపయోగించడం అన్న మాటకి ఈ ఈ సో కాల్డ్ ఈ బ్లాక్ మ్యాజిక్ ఇంకా నరదృష్టి అన్న పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవి ఒక్కటేనా అమ్మ మీరు చెప్తుంది అంటే ఇట్ కెన్ టేక్ ఎనీ ఫామ్ ఇప్పుడు నరదృష్టి లేకపోతే బ్యాడ్ వైబ్రేషన్స్ లేదా బ్లాక్ మ్యాజిక్ బాణామతి చేతబడి ప్రయోగం ఇన్ని రకాలు వాడుతూ ఉంటారు. ఉ ఇవన్నీ ఏంటి అనింటే ఒక మనిషి ఆలోచన ఆలోచనకు ఒక శక్తి ఉంటుంది ఏ మనిషికైనా సరే ఉంటుంది.
(26:30) చూడండి కొంతమందితో మాట్లాడితే అబ్బా ఎంత బాగుందో వీళ్ళతో మాట్లాడుతుంటే అని అనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడితే అబ్బా తలకాయ నొప్పు వచ్చేస్తుంది ఏంటో మాట్లాడుతుంటేనే ఈ మనిషితో లేకపోతే ఏంటో నాకు కంఫర్టబుల్ గా అనిపించట్లేదు అని అనిపిస్తుంటుంది. అంటే ఆ వైబ్రేషన్స్ అనేవి పర్సూవ్ చేసేటువంటి శక్తి ఎప్పుడో ఒకప్పుడు ప్రతి మనిషికి కూడా ఉంటుంది.
(26:50) ఆ థాట్ వల్ల వైబ్రేషన్ అనేటువంటిది జనరల్ గా వస్తూ ఉంటుంది. బ్యాడ్ థాట్స్ అంటే నువ్వు నాశనం అయపోవాలి వీడు నాశనం అయపోవాలి వీడు పాడైపోవాలి అనేటువంటి దానికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. దానికి మంత్రం కూడా కలిపితే ఇంకొంత ఎఫెక్ట్ ఉంటుంది దాన్ని ప్రయోగం అంటారు. లేదా బొమ్మల్లాగా తయారు చేసి గుచ్చటాలు నిమ్మకాయలు పెట్టాలు ఇవన్నీ కూడా క్షుద్ర ప్రయోగాలు లాంటివి చేసేటువంటివి కూడా ఉన్నాయి.
(27:14) కూడా ఉన్నాయి మచ్ అంటారు అయితే నేను ఇప్పుడు చెప్పినటువంటిది శాస్త్ర వాక్యం ఇది నేను చెప్పినటువంటి మాట కాదు ఇప్పుడు నేను లలితాదేవి చరిత్రలో మీకు చెప్తున్నటువంటిది అదే ఆ రాక్షసుడు అన్ని రోగాలు వచ్చే అస్త్రాలను వేసి ప్రయోగం చేశడు అమ్మవారు దేవతలను పంపించి వాటిని పోగొట్టింది. ఇది శాస్త్రంలో చెప్పినటువంటిది కాబట్టి ఇప్పుడు కూడా చూడండి మనకి వార్తల్లో కూడా చూపిస్తూ ఉంటారు క్షుద్ర పూజలు చేసినటువంటి ఆనవాళ్ళు కనిపించాయి వెంటనే ఎవరారి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు.
(27:45) కాకపోతే అవి ఎంతవరకు పనిచేస్తాయి అనేటువంటిది చేసిన వాడి శక్తి మీద ఆధారపడి ఉంటుంది. మన మీద ప్రయోగం జరిగింది అని మనం ఏ విధంగా గుర్తించగలం దానికి పరిహారం ఏంటమ్మా ఇందులో ఎలా ఉంటుందంటేనమ్మ మామూలుగా ఏ వ్యక్తికైనా సరే ఇలాంటి ఆలోచన ఎప్పుడు వస్తుంది అన్ని బాగున్నప్పుడు ఎవ్వరికీ ఏ ఆలోచన రాదు. ఒక కష్టం ఒక బాధ ఒక ఇబ్బంది అది పోగొట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పోకపోతే ఇదేంటో కొంచెం తేడాగా ఉన్నదే మనం అన్ని ప్రయత్నాలు చేస్తున్న కష్టాలు పోవటం లేదు ఇబ్బందులు పోవట్లేదు అనారోగ్యాలు పోవటం లేదు అనేటువంటి భావన మొదలవుతుంది అక్కడి నుంచి
(28:21) ఆ అన్వేషణ ఎవరైనా చేశారేమో అని అనిపిస్తుంది కొన్ని రోజులేక నిజంగా చేసి ఉంటారేమో అన్న నమ్మకం కూడా కలుగుతూ ఉంటుంది. వాళ్ళ కలల్లో కనిపించేటువంటి దుస్వప్నాలు కావచ్చు లేకపోతే అనుకున్నటువంటి పనులు జరగకుండా అవి వ్యతిరేకంగా రివర్స్ అయి రావడం కావచ్చు అనుకోకుండా యక్సిడెంట్స్ అవ్వటం జరగొచ్చు ఇట్లా దుశకుణాలు దుష్ప్రభావాలు అనారోగ్యాలు ఒకేసారి చాలా మందికి చాలా కష్టాలు పై నుంచి కింద పడిపోయామ అంటూ ఉంటారు మంచి స్థాయిలో నుంచి అధమ స్థాయికి వచ్చేసాము అనేటువంటివి వీటి ఇలాంటి సంఘటనలు సందర్భాలు ఉన్నప్పుడు అనుమానించడంలో తప్పేమీ లేదు అయితే పరిహారం
(29:00) ఏమిటి అంటే దైవశక్తి దుష్ట శక్తి ఎప్పుడెప్పుడైతే విజృంభిస్తుందో అప్పుడప్పుడల్లా మనం దైవశక్తి మనం ఎప్పుడు పిలుస్తామా అని ఎదురు చూస్తూ ఉంటుంది పిలిస్తే వస్తుంది దుష్ట శక్తిని తరిమిగొడుతుంది మనకి రక్షణ ఇస్తుంది అన్నిటికీ కూడా పరిష్కారం అమ్మవారి పట్ల నమ్మకం అంతే అది అమ్మవారు కావచ్చు స్వామివారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక పాజిటివ్ ఎనర్జీ మీద ఒక డివైన్ ఎనర్జీ మీద మనకు నమ్మకం మ్ ఇప్పుడు ఒకటే పాయింట్ ఇందులో ప్రతి ఆలోచనకి కూడాను ఒక శక్తి ఉన్నప్పుడు మనం పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటే మన చుట్టూ మంచి పాజిటివ్ ఆరా ఉంటుంది.
(29:38) అదే 24 గంటలు ఎదుటి వాళ్ళని తిట్టుకుంటూ మనల్ని మనం తిట్టుకుంటూ నెగిటివ్ థింగ్స్ ఆలోచించుకుంటూ ఉంటే మన ఆరాని మనమే నెగిటివ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అవును సో అందుకనే ఆల్వేస్ బి పాజిటివ్ అని చెప్తారు మనకి కచ్చితంగా అమ్మ అమ్మ ఇప్పుడు మనకి బాల పూజ ఇంకా కుమారి పూజ సువాసిని పూజ అని చెప్పేసి స్త్రీలని అమ్మవారిగా కొలిచి పూజ చేస్తూ ఉంటారు ఆ పూజ విధానం గురించి చెప్తారా తప్పకుండా ఇది మన శాస్త్రం ఇందాక మనం అనుకున్నటువంటి శాస్త్ర వాక్యం యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు
(30:17) అని అయితే స్త్రీలనే ఎందుకు పూజించాలి ఏం పురుషులని పూజించకూడదా మీకు రాలేదా సందేహం స్త్రీని పూజించండి స్త్రీని పూజించండి అంటున్నారు మరి పురుషులు పూజార్హులు కారా అంటే పురుషులకు కూడా పూజార్హత ఉన్నది లేదని కాదు కానీ మనం ఉన్నటువంటి కలికాలంలో వాళ్ళ పేపర్లు చూడాలన్నా న్యూస్ చదవాలన్నా ఆడవాళ్ళ వయసులతో సంబంధం లేకుండా ఎటువంటి దుర్వార్తలు మనం వినాల్సి వస్తుందో అని భయపడే కాలంలో మనం ఉన్నాం.
(30:45) ఇటువంటి ఈ సందర్భం వస్తుందని గమనించి మన ఋషులు మనకి అందించినటువంటి సూత్రమే ఈ స్త్రీ పూజ చిన్న పిల్ల రెండేళ్ళ పిల్ల మూడేళ్ళ పిల్ల గురించి కూడా మనం చదువుతున్నాం కదా వార్తలు మీరు రెండేళ్ళ నుంచి మూడేళ్ల నుంచి కాదు సంవత్సరం వయసు అమ్మాయి నుంచి ఆమెను దేవతగా భావించండి ఆమెను పూజ చేయటం మొదలు పెట్టండి అంటే బాల చిన్న పిల్ల మనకి దేవీ భాగవతంలో అయితే రెండేళ్ళ అమ్మాయి సంవత్సరం అమ్మాయి రెండేళ్ళ అమ్మాయి మూడేళ్ళ అమ్మాయి దగ్గర నుంచి తొమ్మిదేళ్ళ అమ్మాయి వరకు బాల పూజగా మనం చేసేటువంటి ఆచారం కనిపిస్తూన్నది.
(31:16) వీళ్ళని మీరు దేవతగా భావించి మామూలు రోజుల్లో కాకపోయినా కనీసం నవరాత్రులలో అన్నా పూజ చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే వివాహం కావలసినటువంటి అమ్మాయిలను కన్యాకుమారిగా లేదా అమ్మవారు పరమేశ్వరి రూపంగా కన్యా పూజ చేయటము అలాగే వివాహమైనటువంటి స్త్రీలకు సువాసిని పూజ చేయటము పూర్వ సువాసనులైనటువంటి స్త్రీలకు కూడా మాతృ పూజ చేయటము అంటే స్త్రీని మీరు వివిధ దశలలో ఉన్నటువంటి స్త్రీలను మీరు పూజించడం గనుక ప్రారంభిస్తే ఏనాడైనా సరే పొరపాటున గనుక మీకు చెడు ఆలోచన వస్తే ఆ సమయంలో ఒక్కసారి సారి ఈ పూజ చేసిన దృశ్యం గుర్తుకొస్తే మీ మనసు మీ అదుపులోకి
(31:57) వస్తుంది అనేటువంటి సూత్రం ప్రధానంగా ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది కాక ఎప్పుడైతే మనం దేవతను ఒక పిల్లల్లోకో సువాసనలోకో పిలిచి పూజ చేస్తామో వాళ్ళలోకి వచ్చినటువంటి దేవత మన కోరికలన్నీ కూడా తీరుస్తుంది అనేటువంటిది మన శాక్తేయం అంటే అమ్మవారి పూజా విధానంలో మనకు చెప్తూ ఉన్నది. చాలామంది ఇలాంటి సువాసనలను పూజించి తమ కోరికలను నెరవేర్చుకున్నటువంటి వాళ్ళు బాలను పూజించి అంటే చిన్న పిల్లలను పూజించి తమ కోరికలు నెరవేర్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది మనకి మన పురాణాల్లో అలాగే శాస్త్రాల్లో మనకు కనిపిస్తూ ఉన్నారు.
(32:36) అమ్మ నిజంగా కూడా మన పూర్వీకులు పెట్టిన ఈ పద్ధతులు ట్రెడిషన్స్ కస్టమ్స్ వెనక వాళ్ళు ఇంతలా ఆలోచించి పెట్టారు అనింటే డెఫినెట్ గా అది చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపిస్తుంది. ప్రతి స్టేజ్‌లో ఒక ఆడపిల్లని ఇంత అందంగా కొలవచ్చు అమ్మవారి స్వరూపునిగా చూడొచ్చు అన్న వాళ్ళ ఆలోచన డెఫినెట్లీ చాలా గొప్పది కదమ్మా అవును తల్లి అవును అది ఎలా ఉంటుందంటేనమ్మ లలితాదేవి ఉంటుంది ఆమెక ఒక కూతురు ఉన్నది బాలాదేవి అని చిన్న పిల్ల అమ్మవారు యుద్ధాన్ని చేసేటువంటి సమయంలో ఈ అమ్మాయి వచ్చి అమ్మ నేను కూడా యుద్ధానికి వెళ్తాను అంటే నువ్వు ఎందుకమ్మా వెళ్ళటం
(33:11) మన వాళ్ళందరూ ఉన్నారు మన సైన్యాధ్యక్షురాలు వారాహి దేవి ఉన్నది లేకపోతే మన మాతంగి దేవి ఉన్నది నువ్వు వెళ్ళకమ్మా అంటుంది. మరి ఆమె అమ్మవారు ఆమె అంశతో పుట్టినటువంటి అమ్మాయి యుద్ధానికి వెళ్తే ఆ అమ్మాయికి ఏం జరుగుతుంది కానీ దేవతలు కూడా పసితనంలో ఉన్నప్పుడు పిల్లల్ని ఎలా చూడాలో ఎలా గుర్తించాలో వాళ్ళని ఎట్లా ప్రేమగా చూడాలో అలాంటి అనుబంధాలు అన్నీ వాళ్ళు కూడా చూపించారు మనం వాళ్ళ మనకు ఆదర్శంగా ఉండటానికి కాబట్టి అలా చిన్న వయస్సు నుంచి మనం స్త్రీలను పూజించడం అనేటువంటిది స్వామి కార్యం స్వకార్యం అంటారు చూడండి ఏమిటి అని అంటే ధర్మబద్ధంగా మానవ జీవితం
(33:46) గడపటం ధర్మబద్ధమైనటువంటి కామమార్గంలో వెళ్ళటం అధర్మబద్ధంగా స్త్రీల పట్ల చూడకుండా ఉండటం దాంతో పాటుగా ఈ పూజ వల్ల పూజా ఫలితం వల్ల కావలసినటువంటి కోరికలు నెరవేర్చుకోవటం ఇలా అన్నిటిని కూడా ఆలోచించి ఈ మార్గాన్ని ప్రవేశపెట్టారు అందుకే మనం నారీ నమోస్తుతే అనేటువంటి కార్యక్రమం ద్వారా వేలాది మంది మహిళలకు మనం సువాసిని పూజ చేయడం జరుగుతూ ఉన్నది.
(34:15) అంటే పూజ చేయడం అంటే ఏదో వచ్చారు బొట్టు పెట్టారు మామూలుగా బజార్లో చాలా చోట్ల అమ్మవారికి పెట్టే చీరలు స్పెషల్ చీరలు అమ్ముతుంటారు 100 రూపాయలు 50 రూపాయలు అది ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఆ సిద్ధాంతాన్ని అంగీకరించం సువాసనలకు పూజ చేయటం అంటే మనం ఇక్కడ గర్భగుడిలో అమ్మవారు ఇక్కడ ఒకటే ప్రధాన సూత్రం నారీ ఏవ నారాయణి నారాయణి అంటే కాళి మరకత కాళి ఇక్కడ ప్రధాన దేవత ప్రతి స్త్రీని కూడా దైవంగా ఆరాధించడం పూజించడం ఎలా అంటే గర్భాలయంలో అమ్మవారిని ఎలా అయితే తే పూజిస్తున్నామో అట్లనే ఇక్కడ కూడా ఆ స్త్రీమూర్తులకు అమ్మవారికి పూజ చేసేటువంటి పూజా విధానం పూర్తి పూజా విధానంతో పూజ చేసి చక్కటి ఒక చీరను రవిక
(34:57) గుడ్డను సువంగళి ద్రవ్యాలను అన్నీ కూడా ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అమ్మ మగవారు కూడా అమ్మవారికి నిత్య పూజ చేసుకోవచ్చా అమ్మ చేసుకోవచ్చు తల్లి అమ్మ అందరికీ అమ్మే కాబట్టి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే అమ్మను ఆరాధించొచ్చు అమ్మను పూజించొచ్చు అయితే అమ్మ అనే భావన ఎప్పుడూ మనసులో నిలుపుకోవడం అనేటువంటిది అన్నిటికంటే కూడాను గొప్ప పని శ్రీ శక్తి పీఠంలో మనకి స్త్రీ పూజలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి కదా దానికి గల కారణం ఏంటమ్మా దానికి గల కారణం ఏంటంటే రెండు ప్రధానమైన ైనటువంటి కారణాలు ఈ శక్తిపీఠంలో మీరు ఇందాక ఒక మాట అడిగారు స్త్రీలు
(35:37) మంత్రోపదేశాలు ఇవ్వటము చేయటము అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా జరిగేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మహిళా ప్రాధాన్యత ఉన్నటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మొదటిది ప్రధానమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు మీరే ఉన్నారు తల్లి నేను ఉన్నాను నేను మీకు ఏదైనా ఒక సమస్య ఒక ఇబ్బందో వస్తే ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా ఫ్రీగా వచ్చి నాతో మాట్లాడొచ్చు.
(36:00) అన్ని చెప్పొచ్చు అదే పురుషులతో అయితే చెప్పడం కొంత కష్టం అవును పీఠాధిపతులుగా మగవాళ్ళు ఉన్నప్పుడు చాలా మంది ఆడవాళ్ళు వెళ్లి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అది చెప్పే అవకాశం కూడా ఉండదు. ఇక్కడ నా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని వేల మంది మహిళలు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఇబ్బందులు బాధలు ఎలాంటి భయము లేకుండా ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా ఎలాంటి సంకోచం లేకుండా నాకు చెప్పటం చేయడం అనేటువంటిది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది.
(36:24) అంతేకాకుండా మన సనాతన ధర్మంలో సంస్కృతిలో మహిళకు ఉన్నటువంటి స్థానం మహోన్నతమైనటువంటిది. ఇప్పుడు ప్రపంచంలో ఏ ఇతర సంస్కృతులలో ఏ ఇతర మతాలలో లేనటువంటిది ఏమిటి అంటే స్త్రీని దేవతగా ఆరాధించటం దేవతను స్త్రీ రూపంలో కొలవటం. మ్ మనకి శక్తి అంటే పురుషుడు పరమేశ్వరుడు విష్ణుమూర్తి శివుడు మాత్రమే కాకుండా అమ్మవారుగా మనం భావిస్తున్నాం.
(36:51) అటువంటి సంప్రదాయం ఉన్నటువంటి మతాలలో మన మతమే అగ్ర మతం. ఇతర ఏ మతాల్లోనూ మనకు కనిపించదు. రెండవది అమ్మవారిని దేవతగా పూజించడంతో పాటుగా ప్రతి స్త్రీలోనూ కూడా దైవం ఉన్నది అని చెప్పేటువంటి మతం ప్రతి స్త్రీని కూడా దేవతగా పూజించమని చెప్పేటువంటి మతం మన హిందూ మతం మాత్రమే కాబట్టి మన మతాన్ని మన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో మహిళల పాత్ర చాలా ప్రాధాన్యం చేకరుస్తుంది.
(37:19) అంతే కాకుండా ప్రతి వ్యక్తికి తొలి గురువు తల్లి అవును ఇప్పుడు నేను చెప్పాను మా అమ్మ నాకు చిన్నప్పుడు పురాణంలో ఉండేటువంటి కథలు చెప్పేది రామాయణం చెప్పేది భారతం చెప్పేది భాగవతం చెప్పేది అలా ప్రతి తల్లి కూడా తన పిల్లలకు గనుక నేర్పడం మొదలైతే మన సంస్కృతి మన ధర్మం తరతరాలుగా అలా నిలుస్తూ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా అటువంటి మహిళలను కొన్ని వేల మందిని ఒక చోట గనుక మనం అసెంబుల్ చేసి ఈ పూజ గనుక చేస్తే పరమేశ్వరి అన్ని వేల రూపాల్లో వచ్చి అనుగ్రహిస్తుంది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నది.
(37:55) కచ్చితంగా ఒకప్పటిలాగా తల్లులందరూ కూడా వాళ్ళ పిల్లలకి మన పురాణాలు ఈ కథలన్నీ చెప్పడం వల్ల రేపు ఫ్యూచర్ లో మనం మంచి యువతను ఇవ్వగలుగుతాము మంచి సమాజాన్ని కూడా ఏర్పరచగలుగుతాము అవునమ్మ అంటే చెడ్డవాళ్ళు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎప్పుడ ఉంటారు అయితే మనం మన మంచితనంతో వాళ్ళని ఎలా గెలవచ్చు అని మనకు ప్రతి పురాణము చెప్తున్నది ప్రతి శాస్త్రము చెప్తున్నది అవి గనుక నేర్పించగలిగితే వేరే మోటివేషన్ క్లాసులు అని చెప్పి వేరే ఏవి కూడా అవసరమే ఏమీ లేవు మన పూర్వకాలంలో పూర్వ యుగంలో అవే చెప్పి పెంచారు తల్లులు పిల్లల్ని అవును అదే విధంగా ఇప్పుడు కూడా తల్లి గనుక తన
(38:31) పిల్లల్ని పెంచితే చాలా అద్భుతమైనటువంటి భావితరం భవిష్యత్తు మన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. కచ్చితంగా అమ్మ అమ్మ అమ్మవారిని క్రోధ స్వరూపిని అని అంటూ ఉంటారు కదా మరి అందరూ కూడా పూజించొచ్చు అంటారా మన ఇంట్లో అమ్మకు కోపం రాదా ఎప్పుడు వస్తుంది వస్తుంది కదా అలాగే అమ్మవారికి కూడా కోపం వస్తూ ఉంటుంది ఎప్పుడు వస్తుంది రాక్షసులు వచ్చినప్పుడు వస్తుంది తన పిల్లలు తప్పు చేస్తే వస్తుంది తన పిల్లలు ఎవరైనా వాళ్ళ వచ్చి తన పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే వస్తుంది ఇప్పుడు ఎవరైనా ఇంట్లో పిల్లల్ని కొడుతుంటే అమ్మ ఏం చేస్తుంది ఒక కర్ర తీసుకొని
(39:03) వెంటపడుతుంది అంత మాత్రం చేత ఎప్పుడు ఆడ కర్ర పట్టుకొని ఉంటుందా పిల్లల్ని కూడా కొడుతుంది ంద లేదుగా అలాగే అమ్మవారు కూడా ఆమె క్రోధం రాక్షసుల పైన ఆమె క్రోధం దుష్ట శక్తుల పైన ఆమె క్రోధం శత్రువుల పైన ఆమె క్రోధం అధర్మం పైన కాబట్టి ఆమెను పూజించే వాళ్ళని ఆమెను ఆరాధించే వాళ్ళకి ఎలాంటి దుష్ప్రభావము దుష్ఫలితాలు అమ్మవారిఎవరు ఒకసారి ఒక చిన్న సంఘటన జరిగింది ఆది శంకరాచార్యుల వారు ఒకరోజు అడవిలో వెళ్తూ ఉన్నారు నడుచుకుంటూ అప్పట్లో ఇప్పటిలాగా ట్రాన్స్‌పోర్టేషన్ లేదు కాబట్టి రాత్రి అంతా కూడా అడవిలో నడుస్తూ వెళ్తూ ఉంటే ఓ శబ్దం వినిపిస్తున్నది ఎక్కడి నుండో కూడా ఏమిటి
(39:41) శబ్దం వస్తున్నది అని చెప్పి ఆయన చూస్తూ ఉంటే ఆ శబ్దం బాగా దగ్గరకి అయ్యే కొద్దీ చాలా భయంకరంగా నవ్వటాలు అవన్నీ వినిపిస్తూ ఉన్నాయి. ఏంటా అనేటప్పటికీ కాళీదేవి కనిపిస్తూ ఉన్నది ఉగ్ర రూపంతో అమ్మ నమస్కారం చేశారు. ఏమిట్రా నమస్కారం చేస్తావ్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా అన్నది. ఎందుకు వచ్చావ అమ్మా అంటే నిన్ను తినటానికి వచ్చాను.
(40:01) నువ్వు నన్ను ఎందుకు తింటావ అమ్మా నన్ను ఎందుకు తింటావు నువ్వు తినేదానివైతే నాకోసం ఇలా ఆగి నేను కనిపించగ ఇదిగో నేను తినబడటానికి ఇక్కడ ఉన్నాను అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటావా చేయవు కదా నన్ను తినాలంటే అలాగైనా నువ్వు తింటావు కానీ నువ్వు అమ్మవి కదా తల్లి నన్ను ఎందుకు తింటావ అమ్మా లేదు లేదు నా క్రోధ రూపం నువ్వు చూడట్లేదా నా మెళలో చూడు పుర్రెల మాల ఉన్నది నా చేతిలో కత్తి ఉన్నది నా నాలుక చూడు బయటకు ఉన్నది నీకు భయం కలగటం లేదా భయం ఎందుకు తల్లి ఇంత అర్ధరాత్రి పూట నేను ఎక్కడ దారి తప్పిపోతాను ఏ క్రూర మృగాలు నన్ను వెంటాడుతాయో అని వాటిని భయపెట్టడం
(40:34) కోసం నువ్వు ఈ రూపాన్ని ధరించి ఇక్కడ ఉన్నావు కదమ్మా నిన్ను చూస్తే నాకు భయం ఏమిటమ్మా అంటే అప్పుడు వెంటనే ఆమె ప్రసన్న కాళిగా మారి నాయనా ఈ విషయం నీ నోటితో చెప్పించడం కోసమే నేను ఈ రూపాన్ని తీసుకున్నాను ఇదే విషయం నువ్వు ప్రపంచానికి చాటు చెప్పు అమ్మ ఆరాధన అనేటువంటిది అన్నిటికంటే గొప్పదైనటువంటిది అన్నిటిని ఇచ్చేటువంటిది అంతేగాని ఎప్పటికీ చెడు చేయదు అంటే శంకరాచార్య వారు ఒక మాట చెప్పారు కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి చెడ్డ కుమారుడైనా ఎక్కడైనా ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదు అందరినీ కన్నటువంటి ఆ జగన్మాత ఆమె చెడు
(41:12) ఫలితాలను దుష్ఫలితాలను ఏనాటికీ కూడా ఇవ్వదు కాబట్టి నిరభ్యంతరంగా అమ్మవారిని ఆరాధించచ్చు పూజించొచ్చు ప్రార్ధించచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ మన దేవతలను చూడండి కాళిదేవి ఉంటుంది శ్వేత వారాహి దేవి ఉంటుంది ప్రత్యంగిరా దేవి ఉంటుంది కానీ వాళ్ళు చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు ఇవాళ పొద్దున ఇక్కడ ముత్యాలమ్మకి జాతర జరిగింది అమ్మవారు కూడా అంతే మామూలుగా ప్రత్యంగిరా అంటే తీవ్ర స్వరూపిని క్రోధ స్వరూపిని అలాగే కాళీదేవి అంటే అమ్మో అమ్మవారా మన టీవీలో సినిమాల్లో అయితే క్షుద్రమాంత్రికుల దగ్గర కాళీదేవి బొమ్మలు పెట్టి చూస్తూ ఉంటారు.
(41:46) అదిఒక పెద్ద చేయగోడం తప్పు చేయడం వల్ల జనాల్లో ఇలాంటి ప్రభావం వచ్చింది మన దగ్గర అమ్మవారిని చూడండి మరకతకాడిని చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది ఆమెను చూసాక విడిచి వెళ్ళబుద్ధి కాదు అంటే దేవత ఆమె ఎప్పుడూ కూడా తనను పూజించేటువంటి భక్తుల పట్ల చాలా ప్రేమగా అమ్మలాగా ఉంటుంది అవసరానికి అంది అందిస్తూ ఉంటుంది.
(42:10) నేను అడిగిన ప్రశ్నకి అమ్మ మనసులో ఉన్న సందేహాలన్నీ తీరిపోయేలాగా మంచి కథ చెప్పారో అది వింటున్నంతసేపు కూడా ఎంత బాగా అనిపించిందో అంటే అర్థం చేసుకునే పర్స్పెక్టివ్ ఆ తత్వం అనేది చూడండి నిన్ను తినడానికి వచ్చాను అంటే లేదు నన్ను రక్షించడానికి వేరే వాటిని భయపెట్టేయడానికి నువ్వు ఇలా వచ్చావు అని చెప్పి చాలా అందమైన కథ అసలు కథ కాదు అది సంఘటన ఉమ్ చాలా చక్కగా ఉంది అవును తల్లి అవును అమ్మ ఇప్పుడు వితంతువులు ఉంటారు కదా అమ్మ వాళ్ళని శుభకార్యాలకి పిలవరు ఒకవేళ వస్తే అరిష్టంగా భావిస్తారు.
(42:44) ఇది కరెక్టేనా అమ్మ అంటే ఆడవాళ్ళు వితంతువులు ముఖ్యంగా వితంతువులు పూజలు నోములు ఇవి చేసుకోవద్దు అంటారా నేను ఇందాక స్త్రీ పూజ విధానంలో ఒకటి చెప్పాను సువాసనులనే కాక పూర్వ సువాసనులు అంటే మీరు చెప్పినటువంటి వితంతువు అనేటువంటి శబ్దానిని పూర్వ సువాసిని అని అంటారు. వాళ్ళను కూడా పూజించేటువంటి సంప్రదాయం మనకు ఉన్నది. అవునా అవును మీరు గనుక ఇక్కడ కాళీదేవి చుట్టూ దశమహావిద్యలు అని దేవతలు ఉన్నారు.
(43:13) పార్వతీ దేవి రూపాలు దుర్గాదేవి రూపాలు కాళీదేవి రూపాలు విష్ణుమూర్తికి సంబంధించి దశావతారాలు ఎలా ఉన్నాయో అమ్మవారికి సంబంధించినటువంటి 10 రూపాలు ఉన్నాయి దశమహావిద్యలు అని అందులో ధూమావతి అనే ఒక దేవత ఉన్నది. హమ్ పార్వతీదేవి ఒకరోజు ఆమెకు బాగా ఆకలి వేసిందిట వేస్తే పరమేశ్వరుడిని స్వామి నాకు ఆకలి వేస్తున్నది అనిఅంటే ఆయన అన్నాట పట్టించుకోకుండా ఆ నువ్వు నువ్వు అన్నపూర్ణం అనుకుంటావు కదా అందరికీ అన్నం పెట్టేదాని నువ్వే అనుకుంటావు కదా నాతో ఎందుకు చెప్తున్నావు అని కొంచెం కోపంగా మాట్లాడాట ఆమె అన్నదిట నేను అందరికీ అన్నం పెట్టే అమ్మనే కాదు
(43:47) కోపం వస్తే ఎవరినైనా శిక్షిస్తాను అన్నదిట ఏం చేస్తావు అంటే గబుక్కని ఆయన మింగేసింది ఆమె మింగేస్తే ఆయన ఏమిటి ఆమె పొట్టలోకి వెళ్ళిపోయాడు శివుడు అనిఅంటే అంటే ఆయన అగ్నిస్వరూపుడు వెంటనే ఆమె శరీరం అంతా కూడా బూడిద వర్ణంలోకి ధూమ వర్ణంలోకి మారిపోయింది ధూమ్ర వర్ణంలోకి శరీరంలో నుంచి పొగలు బయటికి వచ్చాయి ఆమె భర్తను మింగేసిండు కాబట్టి భర్త లేడు ఆమెకి విధవా దేవత అని అంటారు ఆమెని ఆమె పూర్వ సువాసిని ఆమెను అదే రూపంలో ఇవాళ మనం ఇక్కడ పూజిస్తూ ఉన్నాం.
(44:17) రేపు దసరాలలో దశమహావిద్య దివ్యోత్సవములను జరుగుతాయి. భారతదేశంలో ఎక్కడ ఈ అలంకారాలు మనం చూడం ఇక్కడ ఈ 10 రోజుల పాటు కూడా అమ్మవారి అలంకారాలలో ఒకరోజు ధూమావతి అలంకారాన్ని వేస్తాం. ఆమె విధవా దేవతగా ఉండి చేతిలో చేట పట్టుకొని కాకి ఆమె వాహనంగా ఉంటుంది. ఆమె చెడును వెళ్ళగొట్టేటువంటి దేవతగా చేతిలో చేట ఉంటుంది.
(44:41) చెడును చెరిగివేసే దేవతగా ఆమె గురించి చెప్తారు. ఆమె అనుగ్రహం పరిపూర్ణంగా రావాలి అంటే పూర్వ సువాసలే పూజించండి అంటూ ధూమావతి తంత్రం అంటే కాదే ఆడవాళ్ళ రూపాలలో ఏ రూపము పూజకు అనర్హం కాదు అని చెప్పడానికి పార్వతీ దేవి తీసుకున్నటువంటి రూపమే ధూమావతి రూపం లేకపోతే ఆ రూపం ఆమెకు ధరించవలసినటువంటి అవసరం ఏముంది అవసరంఏమ లేదు కదా అట్లాగే ఇంకొక కథ చెప్తారు సతీదేవి ఆమె శరీరాన్ని అగ్నిత్యాగం చేసినప్పుడు దక్షవాటికలో ఆ పొగలో నుంచి ధూమావతిగా వచ్చింది అమ్మవారుని మరొక కథ ఉన్నది అయితే ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా స్త్రీ దేవతలలో భర్త లేన నటువంటి దేవతగానే ధూమావతి గురించి చెప్పారు.
(45:22) అంటే ఆ స్థానంలో ఆ స్థితిలో ఉన్న కూడా స్త్రీ పూజనీయురాలే అని చెప్పటానికి అమ్మవారు తీసుకున్నటువంటి రూపం తర్వాత శుభకార్యాలకు పూర్వ సువాసనలను పిలవకూడదు చేయకూడదు అనేటువంటిది శాస్త్రంలో ఎక్కడా లేదు అన్నిటికీ రావచ్చు అన్ని కూడా చేయొచ్చు బొట్టు తీసేయాలి లేదంటే సువాసనకి సంబంధించినటువంటి వస్తువులు సుమంగళి వస్తువులు ధరించకూడదు రంగు బట్టలు కట్టుకోకూడదు ఇవి ఏవి ఎక్కడా చెప్పబడలేదు ఇవేవో మూఢాచారాలుగా వచ్చినటువంటివి వస్తున్నాయి కొంతమందికి మూఢ నమ్మకాలు ఉన్నాయి.
(45:58) తర్వాత మీరు పూజలు నోములు గురించి అడిగారు. ఇప్పుడు వితంతువులే చేయకూడదా అని అన్ని పూజలు అందరూ చేయరు ఇప్పుడు కొన్నేమో చిన్న పిల్లలు చేసుకునేవి కొన్ని ఉంటాయి. అవును కొన్నేమో పెళ్లి కోసం చేసుకునేవి కొన్ని ఉంటాయి కొన్నేమో సంతానం కోసం చేసుకునేవి ఉంటాయి ఇప్పుడు పుత్రకామేష్టి హోమం జరుగుతుంది అది అందరూ చేసుకుంటారా అంటే సంతానం కావాల్సిన వాళ్ళు మాత్రమే చేసుకుంటారు.
(46:17) ఇప్పుడు మన మంత్రశాస్త్రం అయినా హోమాలయనా పూజలైనా ఎవరు ఏది అవసరమో ఆ వర్గానికి చేసుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని కొన్ని చెప్పబడ్డాయి. ఉమ్ సో కాబట్టి దానికి తగ్గట్టుగా చేసుకోవచ్చు సాధారణమైనటువంటి పూజలు సాధారణమైనటువంటి పండుగలు ఇవన్నీ కూడాను సువాసనలు పూర్వ సువాసనలు అందరూ చేసుకోవచ్చు ఎలాంటి వాళ్ళ పట్ల ఎలాంటి డిస్క్రిమినేషన్ గాని ఎలాంటి వివక్షత గాని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు.
(46:46) ఈరోజు కొత్త విషయం తెలుసుకున్నామ అమ్మవారే ఆ అవతారంలో ఉండి పూజింప చేయొచ్చు అన్న విషయం చాలా కొత్తగా చక్కగా ఉంది అవునమ్మ అమ్మ ఇందాక మీరు మాట్లాడేటప్పుడు శరణ నవరాత్రులు ఏవైతే జరుగుతాయో ఇక్కడ మనకి దశమహావిద్యల రూపంలో పూజలు చేస్తా దాని గురించి ఇంకాస్త తప్పకుండానమ్మ అమ్మవారు 10 రూపాలు తీసుకున్నది అని చెప్పాను ప్రధానమైనటువంటి రూపాలు రెండు మూడు కథలు చెప్తారు అంటే రెండు మూడు సందర్భాలలో ఆమె ఈప రూపాలను తీసుకున్నది అని మొదటిదేమో దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడు ఆమెతో యుద్ధం చేసేటప్పుడు అతడు పారిపోతూ ఉన్నాడు యుద్ధం చేయలేక పరి దిక్కులలోనూ ఒక్కొక్క దిక్కుక వెళ్ళేటప్పటికి ఆమె
(47:25) ఒక్కొక్క రూపంలో ప్రత్యక్షమైంది. అలా 10 దిక్కులలోనూ కూడా అమ్మవారు 10 రూపాలలో ఆమె దర్శనం ఇచ్చింది. పరి చోట్ల కూడా అతడు యుద్ధం చేయడానికి ప్రయత్నించడం ఓడిపోయి వెళ్ళిపోవడం చివరికిప రూపాలు కూడా ఒకే రూపంగా మారి అతన్ని సంహరించడం అనేటువంటిది జరిగింది. అది కాక ఒకసారి పరమేశ్వరి అయినటువంటి పార్వతీ దేవి శివుడి గురించి చెప్తూ శివుడు ఆమెను తన ఇంటికి వెళ్ళకుండా అడ్డగిస్తే ఆమె పద దిశలలోన అన్ని చోట్ల ఉన్నది నేనే నన్ను నువ్వు ఎక్కడ ఎటువైపు నుంచి అడ్డగించగలుగుతావు అన్నట్లుగా ఆమె ఆ రూపాలు ధరించుకున్నట్టుగా ఇంకొక చోట కనిపిస్తూ ఉన్నది. ఈ 10 రూపాలలో కూడా మనం
(48:02) దేవి పేర్లు గమనిస్తే కాళి తార చిన్నమస్త భైరవి బగళాముఖి ధూమావతి మాతంగి శోడసి కమలాత్మిక భువనేశ్వరి 10 రూపాలు మనకు కనిపిస్తున్నాయి ఇందులో నేను మీకు ధూమావతి దేవి గురించి చెప్పాను అవును మామూలుగా దేవతలందరినీ కూడా చూస్తే స్త్రీ దేవతల్ని కొంతమంది ఇప్పుడు వారాహి ప్రత్యంగిరా ఉన్నారంటే సింహ ముఖమో లేకపోతే వరాహ ముఖమో కలి అమ్మవారు కనిపిస్తున్నది అసలు ముఖమే లేనటువంటి దేవతను ఎప్పుడైనా చూశరా తల లేనటువంటి దేవత చిన్న మస్త అంటే చిన్నమైనటువంటి మస్తకం తల ఆమె మొండెం మీద ఉండదు చేత్తో పట్టుకొని ఉంటుంది ఆమెను అసిరమ్మ అని కూడా పిలుస్తారు వజ్ర
(48:44) వైరోచిని దేవి అని పిలుస్తారు అమ్మవారిని ఆ రూపంలో కూడా దశమహావిద్యల్లో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. దానికి కూడా ఒక కథ చెప్పారు ఆమెకి ఇద్దరు చెలికెత్తలు ఉన్నారు వర్ణిని డాకిని అని వాళ్ళు ఒకసారి ఆకలికి తట్టుకోలేక ఆకలమ్మ ఆకలమ్మ అంటే ఉండండి ఏదో ఒకటి తీసుకొస్తాను అంటే లేదమ్మ మేము భరించలేకుండా ఉన్నాము అనిఅంటే అప్పుడు అమ్మవారు తన శిరస్సును తాను ఖండించుకొని ఆమె శరీరంలో నుంచి మూడు రక్తపు ధారలు వస్తూ ఉంటే చెరొక ధార వాళ్ళకు ఇచ్చి తను మరణించకుండా ఉండటం కోసం ఒక ధారను తానే తీసుకున్నట్లుగా అంటే తల్లి ఎలా అయితే తన రక్తాన్ని పాలుగా మార్చి
(49:22) పిల్లలకు ఇచ్చి వాళ్ళని పెంచి పోషించి పెద్దలు చేస్తుందో అమ్మవారైనా సరే అని త్యాగానికి గుర్తుగా ఆ దేవతను గురించి వర్ణిస్తారు. ఇలాంటి ప్రధానమైనటువంటి రూపాలు మనకి దశమహా విద్యా రూపాల్లో కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే శరణ నవరాత్రులలో రోజుకొక్క అవతారం చొప్పున అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది ఇక్కడ మొదటి రోజున శోడసి అలంకారం అంటే లలితాదేవి ఆమె మొదటి రోజున మనకి ఇక్కడ దర్శనం ఇవ్వబోతూ ఉన్నది దీర్ఘ సుమంగళ యోగాన్ని ఇచ్చేటువంటి దేవత ఆనంద స్వరూపమైనటువంటి దేవత కష్ట నష్టాలను బాధలను దుఃఖాలను పోగొట్టి మనశశాంతిని ప్రశాంతతను ఇచ్చేటువంటి దేవత ఈరోజుల్లో చాలా మందికి
(50:02) అన్నీ ఉన్నా మనశశాంతి ఉండటం లేదు అది ఇస్తుంది లలితాదేవి తర్వాత బగళ లాముఖి అనేటువంటి దేవత అలంకారం ఈవెన్ స్తంభనా దేవత అంటే స్తంభించిపోవటం అంటే ఆగిపోవటం అంటే ఎవరైనా సరే శత్రువులు మన గురించి ఏదనా చెడు కోరుకుంటున్నా ఏదనా చెడు తలుపులు చేసినా ఆ ఆలోచనలు చేసినా ఏవైనా ప్రయోగాలు చేయాలని ప్రయత్నించినా వాళ్ళని స్తంభింప చేస్తుంది అంటే కట్టేస్తుంది అమ్మవారు అమ్మవారి రూపం గనుక చూస్తే ఆమె ఒక రాక్షసుడి నాలుక చేత్తో పట్టుకొని ఉంటుంది అంటే వాడు ఏదనా మంత్రం చదవాలన్నా కూడా చదవకుండా అతడి నోరు కట్టే ేసేటువంటి దేవతగా అతన్ని ఆపేటువంటి దేవతగా మనం
(50:39) చూడొచ్చు బగళాముఖి దేవిని అలాగే ధూమావతి గురించి ఇప్పుడే స్మరించుకున్నాం తర్వాత భువనేశ్వరి దేవి పేర్లోనే ఈశ్వరత్వం అన్ని భువనములకు అధీశ్వరిగా అధికారాన్ని ఇచ్చేటువంటి దేవతగా అమ్మవారు మనకి దశమహావిద్యల్లో దర్శనం ఇవ్వబోతున్నది. అలాగే త్రిపుర భైరవి భైరవి అంటే భయంకరమైనటువంటి స్వరూపంతో భైరవ శక్తితో ఉండేటువంటి దేవత మూడు త్రిపురాలు అంటే ముల్లోకాల్లో కూడాను ఆమె భయపెట్టగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి దేవిగా శత్రు బాధలను తొలగించేటువంటి దేవిగా త్రిలోక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవిగా అమ్మవారి గురించి చెప్తూ ఉన్నారు.
(51:17) అలాగే మరొక దేవత ఉన్నది తారాదేవి అని చెప్పి శ్రీరామనవమి రోజే ఈమె కూడా జన్మించినటువంటి రోజు అందుకే రాముడి మంత్రాన్ని రామ తారక మంత్రము తరింప చేసే మంత్రము అంటారు ఆ తారాశక్తి వల్లే అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇందాక మీరు స్త్రీలు మంత్రోపదేశం చేయొచ్చా అని అడిగారు ఒక మాట. ఈ తారాదేవి మంత్రవిద్యలో ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది.
(51:41) స్త్రీలు మాత్రమే మంత్రోపదేశం చేయాలి స్త్రీ గనుక మంత్రోపదేశం చేస్తే ఈ మంత్రదేవత తొందరగా పని చేస్తుంది అని ఉత్తర హిందుస్థానంలో ఒక సంప్రదాయం ఉన్నది. ఆ సంప్రదాయం మనవైపు కూడా వచ్చి కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని అనేటువంటి ఒక మంత్ర సిద్ధుడు ఆయన దగ్గరికి ఎవరైనా సరే తారా మంత్ర ఉపదేశం కోసం వస్తే ఆయన తన భార్యతో ఇప్పించేటువంటి వాడు తారా మంత్రం అలా స్త్రీలను మంత్ర గురువులుగా కూడా ఈ శాక్తయం మనకు చెప్తూ ఉన్నది.
(52:10) ఆమె విద్యకు అధిదేవతగా తారా నీల సరస్వతిగా మామూలుగా సరస్వతీ దేవి అంటే తెల్లగా ఉంటుంది. ఈమె నీల సరస్వతి నల్లగా ఉండేటువంటి దేవతగా చదువుని ఇచ్చేటువంటి దేవతగా అమ్మవారి గురించి చెప్తారు. అలాగే రాజశ్యామలాదేవి మాతంగి ఆమె రాజకీయ అభివృద్ధిని ఇస్తుంది అని ఈమె ఇటీవల కాలంలో చాలా పాపులర్ అయినటువంటి దేవత ఆమె ఆమె కూడా అంతే లోక వశీకరణ శక్తిని అధికారాన్ని ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది.
(52:37) ఇలా ఈ విద్యలన్నిటిలో కూడా మొట్టమొదటి విద్య ఏమిటి అంటే కాళీదేవి కాళీదేవి ఆమె కాలాన్ని శాసించేటువంటి దేవత మాకు టైం బాగుండట్లేదు అంటారు టైం బాగుండాలి అంటే కాళిని ఆరాధించండి అని చెప్తున్నది మన తంత్రం అయితే ఇక్కడ ప్రధానమైన విషయం మీరు చూడండి దశ అవతారాలు నచ్చగా అమ్మవారి కూడా దశ మహావిద్యలు అని ఎందుకు అనాలి ఏమిటి మహావిద్య ఏమిటి విద్య అంటే చదువు కదా అంటే విత్ అంటే తెలుసుకోవటం విద్య అంటే తెలుసు తెలుసుకునేది ఎలాంటి విద్య మహావిద్య మహా అంటే గొప్పదైనటువంటి విద్య అని ఒక అర్థము మహమితి బ్రహ్మ అంటే బ్రహ్మ స్వరూపం అంటే ది అల్టిమేట్ డివైన్ ఏదైతే ఉంటదో డివినిటీ ఆ దాన్ని
(53:20) బ్రహ్మ స్వరూపము అని అంటాం. అమ్మవారికి సంబంధించినటువంటి మహత్తరమైన తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటివి కాబట్టి దశ మహా విద్యలు అన్న పేరుతో పిలుస్తూ ఉన్నారు ఈ పదింటిని కూడాను. అమ్మ ఇప్పుడు ఇది చూస్తున్న మన యూటీవీ ప్రేక్షకులకి ఈ మొత్తం గుడి నవరాత్రులు కూడా ఏదైనా జపించడానికి ఒక మంత్రం చెప్పగలుగుతారా అమ్మ అంటే మామూలు చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్ళేవాళ్ళు కాలేజ్ కి వెళ్ళే వాళ్ళు కూడా దేవుడిది ఏం మంత్రం అనేటువంటిది మంత్రం అనేటువంటిది యూట్యూబ్ లో ఛానల్స్ లో చెప్పేది కాదు తల్లి అయినా మొన్న ఒకసారి గ్రహణం కోసం చెప్పాను ఒకటే నేను చెప్తాను ఏంటంటే
(53:54) శ్రీమాత్రే నమః అని అమ్మవారిని స్మరించండి. శ్రీమాత అంటే ఆ తల్లిని ఎవరైతే స్మరిస్తారో అమ్మ అడగకుండానే అన్ని ఇచ్చేస్తుంది మనసులో స్మరించండి చాలు కాబట్టి ఈ దసరాలలో అమ్మవారిని శ్రీమాత మాత్రే నమః అంటే శ్రీమాతకు నమస్కారము నమస్కారం చేస్తే దేవత సంతోషిస్తుంది అన్నీ కూడా అనుగ్రహిస్తుంది. తప్పకుండానమ్మ అమ్మ ఇది ముత్యాలమ్మవారు ఈ గ్రామ దేవత కదమ్మ మరి ఇక్కడ ప్రతిష్టాపించడానికి ఇక్కడ మనము శక్తిపీఠం స్థాపన చేసినప్పుడు తల్లి ఇదొక పెద్ద చరిత్ర అవుతుంది మనం గనక చెప్పుకుంటే ఇక్కడ మీకు శ్వేత వారాహి దేవి కనిపిస్తుంది ఈ ప్రాంతంలో ఇంకఎక్కడ లేదు
(54:33) దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఒక కాశీలో ఉన్నది పాతాళ వారాహి దేవి అక్కడ కూడా శ్వేత వారాహి కాదు నల్లగా ఉంటుంది అమ్మవారు ఇక్కడ ఈ దేవాలయం కట్టాలని అమ్మ సంకల్పించింది తల్లి ఇక్కడ దేవాలయం పనులు జరుగుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ ఊరిలో గ్రామ దేవత ముత్యాలమ్మ ఆమె ఇక్కడ ఒక సంవత్సరంలో ఒకసారి కొంతమంది ఒంటి మీదకి వస్తుంటుంది అని నమ్ముతారు.
(55:00) వచ్చినప్పుడు జరిగేవన్నీ చెప్తూ ఉంటుంది. చెప్పేవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వచ్చినటువంటిది దేవత అన్న విశ్వాసం అందరిలోనూ ఉన్నది. ఆమె అన్నది నేను కొత్తగా ఇక్కడ గొడిగడుతున్నారు నేను వెళ్లి అక్కడ ఉంటున్నాను నన్ను పూజ చేసుకోవడానికి మీరందరూ ఇక్కడికి రండి అని అన్నది. ఆ విషయం వచ్చి మన వాళ్ళు చెప్తే ఇక్కడ క్షేత్ర పరిపారకురాలలాగా ముత్యాలమ్మను స్థాపించడం జరిగింది.
(55:22) ప్రతిరోజు కూడా తొలిపూజ ముత్యాలమ్మకే రేపటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి ముందు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్య ముత్యాలమ్మ జాతరతోటే ఇక్కడ నవరాత్రులను మనం ప్రారంభం చేసుకుంటూ ఉంటాం. ఆ జాతర జరిగినప్పుడు కూడా చాలామందికి అమ్మవారు ఆ శరీరంలో ప్రవేశించినట్లుగా ఒక మహా శక్తి వచ్చినట్లుగా ఊగుతూ ఉంటారు జరుగుతూ ఉంటే పొద్దున మీరు గమనించి ఉంటారు.
(55:47) అంతేకాకుండా ఈ మహాలయ అమావాస్య రోజున ముత్యాలమ్మకు అభిషేకం మొదలు పెట్టంగానే ఆమెలో ఆ దేవి కళ అనేటువంటిది ప్రత్యక్షంగా చాలా మందికి దర్శనం ఇస్తూ ఉంటుంది. అలా ఇక్కడ ముత్యాలమ్మను అన్ని కోరికలు తీర్చేటువంటి దేవతగా ఈ క్షేత్రాన్ని పరిపాలించేటువంటి దేవతగా మనం పూజించుకుంటూ ఉన్నాము. ఆమెకు ఇష్టమైనటువంటి రీతిలో కోలాటాలు డప్పులు కొమ్ము బూరలు వేపాకులు అలాగే గుమ్మడికాయలు వందల కిలోల పరమాణము వందల కిలోల పులిహోర అలాగే పెరుగన్నము ఇవన్నీ కూడా మనం నైవేద్యం పెడతాం.
(56:25) అంతేకాకుండా అమ్మవారి భక్తులు వచ్చి వాళ్ళు ఇక్కడ స్వయంగా పొంగలి వండి అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటారు ఈరోజున అమ్మ ఈ కాలంలో ఉన్న వాళ్ళకి ఒక చిన్న సందేహం అయితే కచ్చితంగా ఉంటుంది పిల్లల్లో నిజంగా అమ్మవారు పూనుకోవడం అనేది ఉంటుందా అమ్మ మనకి నిజం నమ్మకం అని రెండు ఉన్నాయి. ఆ అసలైన నిజాన్ని నమ్మించాల్సిన పని లేదు అయితే నమ్మకం అనేది ఎప్పుడు నిజమవుతుందో చెప్పలేము.
(56:52) అంటే చెప్తాను దాని తేడా ఏమిటి అనేది నేను చెప్తాను. ఉమ్ ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి ఇగో దేవుడికి దండం పెట్టుకో అంటే దేవుడు కనిపిస్తాడా నాకు చూపించు మ్ అంటారు. మనం చూపించగలమా ఫోటోల్లో చూపిస్తాము. మ్ సరే చూపించగలిగినటువంటి శక్తి ఉన్నా కూడా చూపించడం అనేటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చూపించడం అనేది కష్టం కాబట్టి మనం చూపించడం అనేది జరగదు.
(57:11) కానీ దేవుడు ఉన్నాడు అనేటువంటిది నిజము అయితే ఆ నిజాన్ని మన కళ్ళతో మనం చూడలేదు కాబట్టి అది అబద్ధం అయిపోదు కానీ ఆ నమ్మకంతో ముందు వెళ్తే అది మనం చూడగలుగుతాం దర్శించగలుగుతాం అంటే చాలా మందికి కలలో దేవతలు కనిపిస్తూ ఉంటారు. చాలామందికి స్వప్నాల్లో దేవతలు కనిపిస్తూ ఉంటారు. నిజమే అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడు అంటే ఈ పూనకాలు దేవతలు రావటం అనేటువంటిది ఏముంటుందంటే పూర్వకాలం నుండి కూడా వస్తారు అనేటువంటి నమ్మకం వస్తున్నారు అనేటువంటి నమ్మకం ఉన్నది ప్రజల్లో ఎందుకు నమ్మారు అనిఅంటే వాళ్ళు చెబుతున్నవి చాలా వరకు జరుగుతున్నాయి.
(57:47) ఉమ్ ఇప్పుడు ఏదైనా సరే ఒక కొత్త విషయాన్ని మనం ఎప్పుడు నమ్ముతాము అది జరుగుతుంది ఇది నిజమే అని నిరూపణ కలిగితే మనం నమ్ముతాం అవును అప్పటివరకు నమ్మకం మాత్రమే మన కంటితో మనం చూసినప్పుడు అది నిజం అవుతుంది. అవును మనం నమ్మింది మన కళ్ళ ముందు జరిగితే అది నిజం మన నమ్మకం నిజం అని అనుకుంటాం. అట్లా దేవతలు శరీరంలోకి వచ్చి మాట్లాడి చెబుతున్నారు చెప్పినవి నిజాలయతే మన నమ్మకం నిజం కొన్ని అన్ని చోట్ల అన్ని కావాలి అన్ని నిజాలు కావాలన్న రూల్ ఏమ లేదు కానివి కూడా ఉంటున్నాయి.
(58:23) నిజాలు జరిగినటువంటి చోట దేవతా శక్తి వచ్చిందనేది నమ్మటంలో తప్పేమీ లేదు. అంటే ఇది ఎలా ఉంటుందంటే నమ్మకానికి సంబంధించినటువంటిది మన కళ్ళ ముందు మనం జరిగితే అది నిజమని మనం నమ్ముతాం. అంతే మనం వింటున్నాం కానీ వింటున్నాం ఆహా ఓకే అని నమ్ముతున్నాం కానీ అది నిజం అనుకోవాలనుకుంటే మన కళ్ళ ముందు జరిగితే మనం నిజం అనుకుంటాం అప్పుడు ఆ నమ్మకం నిజంగా మనకి నమ్మకం నిజం అవుతుంది అమ్మ ఇప్పుడు ఈ శక్తిపీఠం ఏదైతే ఉందో ఇది స్థాపించి ఐదు సంవత్సరాలే అవుతుంది అవును ఇక్కడ దేవాలయం స్థాపన చేసి ఐదేళ్ళు అవుతున్నది కానీ లక్షలాది మంది ఈ మహాక్షేత్రాన్ని
(59:01) దర్శించుకోవడానికి వస్తున్నారు ఈరోజు పొద్దున కూడా ఉత్సవాన్ని చూస్తే ఎంత ఘనంగా జరుగుతుందో అసలు ఏంటమ్మా దీని గురించి చెప్తారా ఇప్పుడు నేను చెప్పిందే కళ్ళ ముందు మనం అనుకున్నది కనిపించి నిజం అన్న నమ్మకం కలిగితే మనం నమ్మకం నిజం ఇక్కడ అవుతుంది అని నమ్మితే అక్కడికి జనాలు వేలకు వేలు లక్షలకు లక్షలు వస్తూ ఉంటారు.
(59:22) ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరిదాకానే కాదు ఇప్పుడు మీరు అమ్మవారిని చూసారనుకోండి ఆ డివినిటీ ఆ పాజిటివ్ ఫీల్ ఆ వైబ్రేషన్స్ మీరు ఫీల్ అయ్యారా లేదా కచ్చితంగా అవును అలానే వచ్చిన వాళ్ళు ఫీల్ అవ్వటం దాంతో పాటుగా వాళ్ళ కోరికలు ఇక్కడ తీరటం ముఖ్యంగా ఇక్కడ వారాహి దేవికి పూజ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి భూ సమస్యలు పొలాల సమస్యలు స్థలాల సమస్యలు అన్నీ తీరిపోవటం అలాగే కాళీదేవికి ముడుపు కట్టి వెళ్ళినటువంటి వాళ్ళ కష్టాలు ఇబ్బందులు తీరిపోవటం కుబేరుడికి హోమం చేయించుకొని వెళ్ళిన వాళ్ళకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటం ఇలా ఒక్కొక్క
(59:54) దేవత గురించి చెబుతూ ఉంటే ప్రతి దేవత దగ్గర కూడా జనాలు భక్తులు వాళ్ళకు వచ్చినటువంటి అనుభూతుల వల్ల అనుభవాల వల్ల వాళ్ళ కోరికలు తీరటం వల్ల అన్నిటికంటే ప్రధానంగా ఇక్కడికి రాగానే ఇక్కడ ఒక శక్తి మనకి కనిపిస్తున్నది అనిపిస్తున్నది ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ డివైన్ వైబ్రేషన్స్ మేము ఫీల్ అవుతున్నాము అనేది ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేయటం వల్ల ఇక్కడికి ఇంతమంది రావటం అనేటువంటిది జరుగుతున్నది ఎందుకు ఎందుకంటే ఆరు సంవత్సరాల క్రితం ఇదంతా కూడా ఒక నర్సరీ లాగా ఉండేది ఇక్కడ అంతా కూడా అమ్మవారు రాగానే మహాక్షేత్రం అయింది.
(1:00:27) అవును ఆ అమ్మవారు రావటం కూడా వచ్చిన తర్వాత కూడా మనకి నిజంగా దేవత ఇక్కడ ఉన్నదా అనేది ఎప్పుడు ఎలా తెలుస్తుంది ఆమె ఏదైనా మహిమలు చూపిస్తే తెలుస్తుంది. ఇక్కడ రెండు సంఘటనలు చెప్తాను చాలా ఉన్నాయి రెండు సంఘటనలు చెప్తాను. నైవేద్యం అయిన తర్వాత తలుపులు క్లోజ్ చేస్తాము మామూలుగా అయితే క్లోజ్ చేసిన తర్వాత ఒక రోజు ఏమైందంటే అమ్మవారికి పూజ కోసం గులాబీ పూలు తెప్పించాను నేను గులాబీ పూల మొక్కలు ఆ మొక్కలకి గులాబీ పూలు పూసి ఉన్నాయి.
(1:00:55) అయితే అందులో ఒక పువ్వు నాకు చాలా బాగా నచ్చింది. నచ్చితే అప్పటికి టైం ఒక మధ్యాహ్నంమూడున్నర నాలుగు అయింది ఇంకొక గంట దాకా తలుపులు తెరవరు. అయితే ఆ పువ్వు వెంటనే అమ్మవారికి పెట్టాలనిపించింది నాకు పెట్టాలనిపిస్తే సరే నేను వచ్చాను మన వాళ్ళు వచ్చారు తలుపు తీశారు గడియ తాళం వేసిన తీశరు తీయంగానే పోయంగానే ఏమవ్వాలి తలుపు తెరుచుకోవాలి తెరుచుకోలేదు మన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు ఆ పక్కన ఆ సంఘటన ప్రత్యక్ష సాక్షులు వీళ్ళద్దరు కూడాను అయితే అమ్మవారికి తలుపు కొట్టాను తలుపు రెండు నిమిషాలు కొట్టి అమ్మ వచ్చాము
(1:01:27) నీకు ఇలా పువ్వు ఇద్దామ అని చెప్పి వచ్చాము అని రెండు నిమిషాలు అయి తలుపు కొట్టిన తర్వాత తీస్తే అప్పుడు తెరుచుకున్నాయి తలుపులు తెరుచుకున్నగా గానే ఎదురుకుండా అమ్మవారు ఉన్నది ఆమె మూతలు పడ్డ కళ్ళు ఇలా తెరుస్తూ కనిపించింది. కనిపించింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనిపించింది ఆ పూట ఆహ ఆ కనిపిస్తే ఏమవుతుంది ఓహో నిజంగా దేవత ఉన్నది అనేటువంటి అది ఎవరికి కనిపిస్తుంది ఎంతమందికి కనిపిస్తుంది ఆ పూట అక్కడ ఉన్నవాళ్ళు అదృష్టవంతులు కనిపించింది.
(1:01:51) అవును అలా ఆ రోజు ఆ సంఘటన జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఒకసారి బాగా వర్షాలు పడి వరదల్లాగా వచ్చాయి. ఈ దేవాలయం ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయింది 40 డేస్ పాటు అయితే 41వ రోజు వచ్చి అమ్మవారిది పైన తలుపు తీసి చూస్తే కాళీదేవిది మామూలుగా ఏమిటి బూజు పట్టి ఉంటుంది తర్వాత క్లీన్ చేయాల్సి వస్తుంది పాత పూలు వాడిపోయి ఉంటాయి అవేవి లేకుండా చక్కగా మల్లెపూలు జాజిపూలు అగరు ఒత్తుల వాసనతోటి కళకళలాడుతూ ఉన్నది అందరూ చూస్తూ ఉండంగానే ఆ తర్వాత ఇంకొన్ని సార్లు ఏం జరుగుతుంటుంది తలుపులు వేసేసి మధ్యాహ్నం వెళ్తాము సాయంకాలం తెలిసేటప్పటికి అప్పుడే ఎవరో దీపాన్ని వెలిగించి పూజ చేసినట్లుగా
(1:02:34) అక్కడ కొన్ని అక్షింతలు ఉంటాయి. దీపం వెలుగు ఉంటుంది ఎవరు వస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనిఅంటే ఆమె ఎవరితో చేయించుకోవాలనుకుంటే వాళ్ళతో జయించుకుంటుంది అంటే ఆమె ఇక్కడ కనిపించే భక్తులు మాత్రమే కాకుండా కనిపించని భక్తులు కూడా చాలా మంది వస్తూ ఉంటారు సిద్ధులు వస్తుంటారు దేవతలు వస్తుంటారు ఆమెను పూజిస్తూ ఉంటారు అలా అమ్మవారి శక్తి అనేటువంటిది ఇక్కడ అందరికీ ప్రత్యక్షంగా కనిపించటం వల్ల అమ్మ ఇక్కడ ఉన్నది ఇక్కడికి వస్తే మన ఇబ్బందులు తీరుతాయి కష్టాలు తీరుతాయి అనేటువంటి నమ్మకం కలగటం ఆ నమ్మకం నిజం అవ్వటం వీటన్నిటి వల్ల ఇన్ని లక్షల మంది
(1:03:09) ఇవాళ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అమ్మ ఇందాక మీరు సిద్ధుల గురించి అన్నారు కదా మనకి పక్కనే సిద్ధుల కొండ అయితే ఆ సిద్ధులు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారని చెప్పేసి మహిమలు చూపిస్తుంటారా అవును ఇప్పుడు నేను చెప్పాను చూడమ్మ తలుపులు మూసేసి ఉంటే కూడాను లోపలికి వెళ్లి దీపాన్ని వెలిగించగలిగిన వాళ్ళు అక్షింతలతో పూజ చేయగలిగిన వాళ్ళు మామూలు మాత్రులు మానవ మాత్రులు చేయలేరు కదా తల్లి వాళ్ళే వచ్చి చేస్తుంటారు అనేటువంటిది ఇక్కడ నమ్మకం ఇక్కడ ఇంకో ఇంకో విశేషం ఉంది ఏంటంటే రాత్రులు అమ్మవారికి పను వారాహి ప్రత్యంగరికి ఏం చేస్తాం అంటే తలుపులు
(1:03:42) మూసే ముందర ఏసి ఆన్ చేసి రాత్రి పవళింపు సేవ అంతా చేసి మనం వెళ్తూ ఉంటాం. ఒకరోజు ఏమైందంటే ఒకళ్ళకి అమ్మవారు కళలో కనిపించి మన వాళ్ళకి రాత్రి నాకు ఏస వేయలేదు ఫ్యాన్ వేయలేదు నాకు చాలా గాలాడలేదు అని చెప్పిందిట పర్నాడు పొద్దునే వచ్చి చూస్తే ఆ రోజు రాత్రి మనవాళ్ళు వేయటం మర్చిపోయారు. ఆహ అంటే నిజంగా దేవతలకు ఏసీలు కావాలా ఫ్యాన్లు కావాలా ఇంకా అక్కర్లేదు మీరు మాకు చేస్తున్నటువంటి సేవలు అన్నీ కూడా మేము స్వీకరిస్తున్నాము అని చెప్పటానికి వాళ్ళు ఇటువంటి నిదర్శనాలు చూపిస్తూ ఉంటారు.
(1:04:15) అమ్మ మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు చాలా మొక్కులు మొక్కుకుంటారు ముక్కుబడులు ఉంటాయి ఇంకా ముడుపులు కూడా కడుతూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో తీర్చలేని పరిస్థితులు లేదా మర్చిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి దీనికి ఏమైనా మనకి సమస్య ఉంటుందమ్మా దోష అంటే ఒక్కటి తల్లి రుణం రుణం ఉంచుకోకూడదు ఇప్పుడు దేవత మనకోసం ఒక పని చేసి పెట్టింది చాలామంది ఒక పొరపాటు పడుతూ ఉంటారు మొక్కులు అంటే దేవతలక ఏదో లంచాలు ఇస్తున్నాము అని అది చాలా తప్పు ఇప్పుడు దేవత కోసం అమ్మ నాకు ఈ పని చేసిపెట్ట పెట్టు నేను ఫలానా వస్తువు నీకు ఇస్తాను ఫలానది ఉడుపు కడతాను అనిఅంటే నువ్వు
(1:04:48) కష్టపడి ఆ వస్తువును సంపాదించడంలో నీ కర్మ కొంత పోతుంది. నీ కర్మ తీరుస్తుంది. ఆ కష్టాన్ని అనుభవించే కాలం తగ్గుతుంది అది నువ్వు దేవతకు సమర్పిస్తున్నావు. కాబట్టి ఆమె నీ కర్మను తగ్గించే సాధనాన్ని నువ్వు ఏర్పాటు చేస్తున్నావు తప్ప ఆమెకేం అవసరం లేదు నీ మొక్కులు, ముడుపులు. కానీ దేవత ఎలా అయితే మనకు ఇచ్చిన మాట తప్పకుండా మనకు ఒక మాట ఇస్తే ఎలా చేస్తుందో? మనం కూడా ఆమెక ఇచ్చిన మాట తప్పకుండా ఉండటం మంచిది.
(1:05:14) అంటే ముడుపులు మొక్కులు అనేటువంటివి వీలైనంత వరకు తీర్చుకుంటూ ఉండాలి. ఒకవేళ పొరపాటున ఏదైనా మర్చిపోతే ఎలా అంటే అది గుర్తొచ్చినప్పుడు తీర్చుకోవటము లేని పక్షంలో దేవతలే గుర్తు చేస్తారు. మామూలుగా గుర్తు చేయొచ్చు చిన్న చిన్న పనిష్మెంట్లు కూడా ఇచ్చి గుర్తు చేయొచ్చు ఒక్కొక్కసారి అంటే మరీ తీవ్రమైనటువంటివి ఏమి ఇవ్వరు కానీ ఒక్కొక్కసారి అటువంటి సందర్భాలు సంఘటనలు కూడా ఉంటాయి ఇక్కడ కూడా చాలా జరుగుతూనే ఉంటాయి అట్లాంటివి అంటే భయపెట్టరు బాధ పెట్టరు కష్టపెట్టరు కానీ కర్తవ్య పరిపాలన ఒక మాట దేవతకు ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చుకోవాలి
(1:05:51) అనేటువంటి సూత్రం కచ్చితంగా ఎవరైనా పాటించాలి. ఒకవేళ మర్చిపోతే గుర్తొచ్చినప్పుడు కచ్చితంగా దాన్ని మీరు పూర్తి చేయండి. లేదు అసలు ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత ఎప్పుడో గుర్తొచ్చింది అప్పుడు కనిపించింది ఏం చేయాలి అప్పటికీ సమయం మించిపోలేదు. ఒకసారి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీరు ఎక్కడైనా ఏమైనా మొక్కులు మొక్కి తీర్చడం మర్చిపోయారేమో కూడా గుర్తుపెట్టుకోండి.
(1:06:14) గుర్తెచ్చుకొని వాటిని పూర్తి చేసుకోవడం ఎప్పుడూ మంచిది. ఇంకొంతమంది వస్తూ ఉంటారు మావాళ్ళు మొక్కుకున్నారు మా తల్లిదండ్రులు మొక్కుకున్నారు మా పిల్లలు ఇలా చేస్తారని చేసే స్తోమత మాకు లేదు అప్పుడు మేము ఏం చేయాలి. ఆ మేము చేయలేము కానీ వాళ్ళేమో మొక్కేసుకున్నారు మేము ఏం చేయాలి అనిఅంటే వాళ్ళు మొక్కుకున్న దాంట్లో మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి అమ్మ నా శక్తి ఇంతే వాళ్ళు మొక్కారు కానీ నాకు అది తీర్చడం ప్రస్తుతానికి సాధ్యం కావట్లేదు నాకు ఉన్నటువంటి దాంట్లో నేను చేయగలిగినంత దాంట్లో నేను మీకు సమర్పణ చేసుకుంటున్నాను. మిగిలింది కూడా పూర్తి
(1:06:45) చేయగలిగినటువంటి శక్తి నువ్వు నాకు ఇస్తే చేస్తాను. అని చెప్పి దేవతకు ఆమెకు మాట ఇవ్వటం ఆమెకు నమస్కారం చేయటం అనేది చేస్తే అమ్మ కదా అన్నిటిని ఒప్పుకుంటుంది ఏది కాదందో కచ్చితంగా అమ్మ అమ్మ కొంతమంది ఎన్ని పూజలు చేసినా ఎన్ని గుడిలకు వెళ్ళినా కూడా వాళ్ళ కష్టాలు కొంతమందికి తీరవు మా తలరాతి ఏంటి మారట్లేదు అని చెప్పేసి ఎంతో బాధపడే వాళ్ళు మాత్రం కచ్చితంగా మనల్ని చూస్తూనే ఉంటారు ఉన్నారమ్మ ఉన్నారు అంటే ఏ వ్యక్తికైనా సరే కష్టం తీరాలి అనిఅంటే కష్టాలు అసలు అసలు ఎందుకు వస్తాయి ఈ జన్మలో అందరం మంచి వాళ్ళగానే ఉన్నాం కదా అందులో చెప్తారు చూడండి మంచి వాళ్ళకి బాగా
(1:07:22) ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి చెడ్డవాళ్ళేమో అన్ని తప్పులు చేసినా బాగుంటారు అని చెప్తూ ఉంటారు. ఆ కష్ట సుఖాలు అనేటువంటివి మనం మన పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నటువంటివి అప్పుడు తెచ్చుకున్నటువంటి అప్పు అది తీరిస్తే గాని కష్టాలు పోవు కాబట్టి ఆ తీర్చడంలో ఏంటంటే కొంతమందికి ఒక రోజుతో తీరిపోతుంది కొంతమందికి ఒక సంవత్సరంతో తీరుతుంది కొంతమందికి 10 సంవత్సరాలు పడుతుంది.
(1:07:45) అయితే ఏమిటి అనింటే దేవాలయాల దర్శనంతో పాటుగా మంత్ర జపము మంత్ర సాధన కొంత చేయండి ఎందుకంటే జపతో నాస్తి పాతకం జపం చేయటం వల్ల పాపం తొందరగా తొలుగుతుంది అనేటువంటి ఒక సూత్రం మనకు కనిపిస్తుంది. కాబట్టి దేవాలయ దర్శనము మీరు చేసుకునే ఇంట్లో నిత్య పూజలతో పాటుగా ఏ దేవత అయితే ఇష్టమో ఆ దేవతకు సంబంధించినటువంటి నామాన్ని స్మరించడం మంత్రాన్ని చేయటం గనుక చేస్తే హోమం చేయటం గనుక చేస్తే తొందరగా మార్పు వస్తుంది ఎందుకంటే అగ్నిలో రెండు లక్షణాలు ఉన్నాయి మొదటిది పాపాన్ని దహించి వేసే లక్షణం కావలసింది ఇవ్వగలిగినటువంటి శక్తి ఈ రెండు ఉన్నాయి కాబట్టి యజ్ఞ యాగాదులు అలాగే మంత్ర సాధన దాంతో పాటుగా
(1:08:29) ప్రధానమైనటువంటి ఇవన్నీ మేము చేయలేము అనుకుంటే ఏం చేయాలి అంటే అన్న సేవ చేయండి లేని వాళ్ళకు అన్నం పెట్టండి మా కష్టాలు పోయేటట్టుగా చేయమని దేవతకు నమస్కారం చేసుకొని లేని వాళ్ళకు కావలసిన వాళ్ళకి అన్నం పెట్టటం ఆవులకు అన్నం పెట్టటం జంతువులకు అన్నం పెట్టటం ఇవి గనుక చేస్తే తొందరగా కర్మ ప్రక్షాళన అయి కష్టాలు లేటువంటివి తీరుతూ ఉంటాయి.
(1:08:52) ఖచ్చితంగా అమ్మ అమ్మ మీరు మెడిసిన్ కూడా చేశారు కాబట్టి నాకు ఒక చిన్న సందేహం అయితే ఉంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా అందరూ కూడా ఏమంటున్నారంటే నెలసరి సమయాల్లో ఆడవాళ్ళు పూజ చేయొద్దు అని ఎక్కడా లేదు వెళ్లి చేసుకోవచ్చు అది జస్ట్ మన బాడీలో జరిగే ఒక చిన్న సైకిల్ మాత్రమే దీనికి దానికి సంబంధం లేదు అని కొంతమంది వాదిస్తున్నారు.
(1:09:13) కొంతమంది సైన్స్ పరంగానే చెప్తున్నారు. మన చక్రాస్ ఈ విధంగా ఉంటాయి ఎనర్జీస్ అని చెప్పేసి ఒకసారి దీని గురించి కూడా చెప్పరామ తప్పకుండా తల్లి ఇప్పుడు దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉందమ్మ మొదటిది ఏంటి అనింటే ఇందాక నేను చెప్పాను నిజము నమ్మకము నిజం ఏమిటి అనింటే ప్రతి స్త్రీకి కూడా అటువంటి సైకిల్స్ అనేవి ఉండటం అనేటువంటిది నిజం అయితే అది మంచిదా చెడ్డదా అనేటువంటిది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.
(1:09:38) అది చెడు అని అనుకోవాల్సినటువంటి పనిేమీ లేదు. ఉ అది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ వుమెన్స్ లైఫ్ కానీ ఇక్కడ ప్రశ్న ఎప్పుడు వస్తుంది అంటే దేవతల దగ్గరికి వెళ్లొచ్చా పూజలు చేసుకోవచ్చా అనేటువంటి దాని దగ్గర మనకి ప్రశ్న ఉదయిస్తుంది. అవును అయితే ఇక్కడ రెండు సమాధానాలు మనం తీసుకోవచ్చు తల్లి మొదటిది ఏంటి అనింటే ఆ సమయంలో బాడీ నుంచి వచ్చేటువంటి సెక్రేషన్ ఏదైతే ఉందో అది ఎక్స్క్రీషన్ అండి సెక్రేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎవరైనా సరే దాచిపెట్టుకోవాలి పరమ పవిత్రమై ఉందని ఎవరు అనుకోరు.
(1:10:11) దాన్ని ఎలాగైనా డిస్కార్డ్ చేయాలి దగ్గర పెట్టుకోకుండా ఉండాలని అనుకుంటారు అంటే అది మనం కావాలని మనం అనుకోవటం లేదు మనుషులమైనా మరి దేవతలు ఎలా భరిస్తారమ్మా మనకే ఆ టైంలో మనుషులే అనీజీగా ఫీల్ అవుతూ ఇబ్బందులు పడుతూ ఉంటే ఇది ఎక్స్క్రీషన్ లేదా బాడీ సెక్రషన్ే కావచ్చు కానీ దాన్ని ఎక్స్క్రీషన్ లో బయట పడేయటమే తప్ప దాన్ని దేనికి ఇంట్లో పెట్టుకోవటాలు చేయటాలు చేయరు కదా దాన్ని ఒక బాడీ స్ట్రెడ్ చేసే ఒక వేస్ట్ మెటీరియల్ కిందే భావిస్తున్నారు.
(1:10:39) కాబట్టి అటువంటివి మనం క్యారీ చేస్తూ దేవతల దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది చేయకూడదు. ఫండమెంటల్ థింగ్ రెండవది ఆ సమయంలో ఏం జరుగుతుంది ఎందుకు చేయొద్దు అంటున్నారు పూజలు అనిఅంటే ప్రతి వ్యక్తికి కూడా ఇప్పుడు మీరు చెప్పారు శరీరంలో చక్రాలు ఉంటాయి అని చెప్పి దాంతో పాటుగా ప్రతి మనిషి చుట్టూ కూడా ఒక ఆరా ఉంటుంది.
(1:11:00) ఆ సమయంలో ఏమవుతుంది అంటే రజస్సుతో నిండిపోయి ఉంటుంది ఆరా అంతా కూడాను మన పూజలు మన దేవతలందరూ కూడా మనం సాత్విక విధానంలో పూజ చేస్తాం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉండటం అనేటువంటిది మంచిది అని చెప్తున్నారు నేను లేదు ఇవన్నీ నేను నమ్మను నేను వెళ్లి పూజ చేసుకుంటాను నేను నాకేం కాదు కదా అని అనుకుంటే అయ్యేట సమయం వచ్చినప్పుడు అవుతుంది ఆ క్షణంలో కాకపోవచ్చు తప్పుఎప్పుడు తప్పే పాపం ఎప్పుడో పాపమే అయితే పెద్దలు మనక ఒక మాట చెప్పినప్పుడు దాన్ని ఎదిరించి ముందుకు వెళ్ళాలి ఇప్పుడు నీకు ఇష్టమైతే నువ్వు ఒక నమ్మకాన్ని పెట్టుకుంటే నీ వరకు నువ్వు చేసుకోవచ్చు అది వేరు అది తప్పా ఒప్పా
(1:11:38) అనేదాన్ని నువ్వు కన్సిడర్ చేయనప్పుడు కానీ దాన్ని నువ్వు ప్రచారం చేసి దాన్ని ఒక అనవసరమైనటువంటి ఒక సబ్జెక్టుని తీసుకొచ్చి ఒక ప్రైవేట్ గా ఒక పర్సనల్ గా ఉన్నటువంటి ఒక సబ్జెక్టుని తీసుకొచ్చి అనవసరంగా పబ్లిసిటీ ఇచ్చి దాని మీద చర్చలు పెట్టి చేసుకోవాల్సినటువంటి స్థితిలో మాత్రం ఏ మహిళా లేదు తల్లి అందరికీ కి ఈ విషయం మీద పూర్తి అవగాహన ఉన్నది.
(1:12:02) చిన్నప్పుడు మన ఇంట్లో మనం చూస్తూ ఉన్నాము. జరిగే వ్యవహారాలు చూస్తూ ఉన్నాం కాబట్టి నేను నా నన్ను మీరు అడిగారు కాబట్టి నేను చెప్పేది ఏమిటి అనింటే ఎలా అయితే ఆ టైంలో ఉమెన్ ఎలా అయితే కంఫర్ట్ లేకుండా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి అదిఒక ఎక్స్క్రేటరీ మెటీరియల్ గా స్ట్రెట్ చేస్తారో బాడీలో నుంచి వచ్చేటువంటి దాన్ని ఎలా అయితే స్ట్రెట్ చేస్తారో అది డిస్కార్డ్ చేసేటువంటిది డిస్పోజ్ చేసేదే కాబట్టి దాన్ని పెట్టుకొని దేవతల దగ్గరికి వెళ్ళడం మాత్రం అడ్వైజబుల్ కాదు.
(1:12:29) అయితే మరి మనసులో మనక అప్పుడు దేవుడు గుర్తొస్తే తప్పా పాపమా లేదు మనసులో ఆలోచనలు ఎలా ఆపగలుగుతాం ఆ కరెక్ట్ మనసులో ఆలోచనలు మనం ఆపలేం అలాగని చెప్పి నేను కూర్చొని నా మనసులో నేను పూజ చేసుకుంటాను నా మనసులో నేను స్తోత్రాలు చేసుకుంటాను అని మాత్రం చేయొద్దు మనసులో మీకు గుర్తొస్తే గుర్తుకు రావచ్చు దానికి ఎవరు ఏమి చేయలేరు.
(1:12:51) ఉ అయితే దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఒక మంత్ర సాధన ఉన్నది ఒక దేవత ఉన్నది ఉచ్చిష్ట మాతంగి అని ఒక దేవత ఉన్నది. ఆమె ఋతుమతి అయినటువంటి దేవత అంటే ఆమె కూడా పీరియడ్స్ లో ఉన్నటువంటి దేవత ఓకే ఇలాంటి సమయాల్లో ఉన్నప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించుకోవడానికి ఆడవాళ్ళకి ఈ మంత్రం చేసుకోవచ్చు అని మంత్రశాస్త్రంలో ఉన్నది.
(1:13:18) ఉన్నది ఎక్సెప్షన్ ఉన్నది కానీ నువ్వు గుడికి వెళ్ళు దేవాలయానికి వెళ్ళు ఇంట్లో పూజ చేయి అని లేదు. ఆ సమయంలో అందుకు సంబంధించినటువంటి విమెన్ రిప్రొడక్టివ్ సిస్టం ఏదైతే ఉన్నదో ఆ రిప్రొడక్టివ్ సిస్టం కి సంబంధించినటువంటి అనారోగ్యాలు కానీ ఆ టైం లో ఏమనా ఇబ్బందులు కానీ ఉంటే ఈ మంత్రం అవి తగ్గటానికి కూడా హెల్ప్ చేస్తుంది అలాంగ్ విత్ మెడికేషన్ సో అది అది మాత్రం చేసుకోవచ్చు అని ఉన్నది అది కూడా గురువు ఉపదేశిస్తే నేను అదే అడుగుదాం అనుకున్నాను కొడితే వస్తదా ఏంటి కాదు కాదు మంత్రం అంటే ఒకటి తల్లి ఇప్పుడు మంత్రం అంటే ఎలా ఉంటుందంటే ఏదో ఓ
(1:13:52) బీజాక్షరాలు కనిపించగానే అవి బీజాక్షరాలు అయిపోవు మ్ ఒక బ్రిటిష్ టైం లో ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక బ్రిటన్ బ్రిటిష్ కి సంబంధించినటువంటి బ్రిటన్ పర్సన్ ఇక్కడ జడ్జ్ గా ఉన్నాడు. ఉంటే ఏదో ఒక కోర్ట్‌లో సాక్ష్యానికి ఒక పెద్ద పురోహితుడు వెళ్ళాడు. ఆ సాక్ష్యం తర్వాత చెప్తారు ముందుర నా గాయత్రీ మంత్రం చెప్పండి వినాలని ఉంది అన్నాడు నేను చెప్పను అన్నాడు ఆయన నేను చెబుతా నాకు తెలుసా ఆ మంత్రం అన్నాడు.
(1:14:21) అని చెప్పాడు అది మంత్రం కాదు అన్నాడు ఈయన ఎందుకని మంత్రం కాదు నేను పుస్తకంలో చూశను అదే ఉన్నది అంటే పుస్తకంలో ఉన్నది అక్షరాల సముదాయం మాత్రమే గురువు తన శక్తితోటి అక్షరాలను మంత్రాక్షరాలుగా బీజాక్షరాలుగా మార్చి ఇస్తేనే అది మంత్రం అవుతుంది కాబట్టి YouTube లో విన్నది యూట్యూబ్ లో విని చేసేవి ఇంటర్నెట్ లో చదివి చేసేవి పుస్తకాల్లో చదివి చేసేవి అవి అక్షరాల సముదాయం మాత్రమే కానీ మంత్రాలు కావు కాబట్టి ఏదైనా గురుముఖంగా ఉపదేశం ఉంటేనే అది మంత్రం అవుతుంది.
(1:14:56) అమ్మాయి మధ్యకాలంలో పిల్లలందరూ కూడా సోషల్ మీడియాలలో సనాతన ధర్మ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నారు మేము సనాతన ధర్మ మేము ఫాలో అవుతాము అని చెప్పి అసలు దాని అర్థం ఏంటో వాళ్ళకి తెలుసో తెలియదో అర్థం కాదు బట్ ఆ మాట అయితే అంటూ వెళ్తారు ఎవరైనా ప్రశ్నించినప్పుడు వాళ్ళకి అంతగా దాని గురించి అవగాహన ఉండదు అసలు సనాతన ధర్మం అంటే ఏంటమ్మా సనాతన ధర్మము అంటే సనాతన అన్నదానికి మీద సనాతనం అంటే పాతది అని అర్థం కాదు అక్కడ ఎవర్ లాస్టింగ్ ఎప్పటికీ ఉండేది ఎప్పటికీ నాశనం లేనటువంటిది మన ధర్మాన్ని నాశనం చేయటానికి వందల వేల సంవత్సరాలుగా ఎంతో మంది మన దేశంలోకి వచ్చారు. మహమ్మదీయులు
(1:15:35) వచ్చారు క్రైస్తవులు వచ్చారు ఇతర జాతుల వాళ్ళు వచ్చారు అందులో మనవాళ్ళు వాళ్ళతో వీళ్ళ చేతులు కలిపి మన మతాన్ని పాడు చేయాలని చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మన మతం ఇవాల్టికి నిలిచి ఉన్నది ఇవాల్టికి కూడా ప్రపంచంలో సనాతనమైనటువంటిది పురాతనమైనటువంటిది చిరస్మరణీయమైనటువంటిది ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి మతంగా మన హిందూ మతాన్ని గురించి చెబుతూ ఉన్నారు.
(1:16:00) ఎప్పటికీ ఉండేటువంటి మతం ఎలా మానవుడు ఎలా జీవించాలో నేర్పించేటువంటి మతం దేవుడు కూడా మానవుడిగా వచ్చినప్పుడు మానవ ధర్మాలను ఎలా పాటించాడో మనకు చూపించేటువంటి మతం మానవతాన్ని మించినటువంటి మతం మరొకటి లేదు మానవతమే మానవత్వమే దైవత్వం అని చూపించినటువంటి మహామతం మనది అటువంటి మహామతం దానికి సంబంధించినటువంటి అర్థాలు తాత్పర్యాలు తెలిసినా తెలియకపోయినా ముందు అందులోకి అడుగులు వేసారు కాబట్టి ఇంక ముందుకు ఆ మతమే ఆ ధర్మమే ముందుకు తీసుకెళ్ళిపోతుంది.
(1:16:33) మనకి సనాతన ధర్మం తెలుసు అని అనడానికి ఏమైనా కథలు పురాణాలు చదివితేనే ఆ మాట అనగలమా అమ్మ అంటే కొంత చదివితే వింటే తెలుసుకుంటే ఇప్పుడు సనాతన ధర్మము అంటున్నారు ధర్మబద్ధంగా జీవించడం అంటున్నారు. జీవితంలో తప్పులు చేయకుండా ఒప్పులు చేస్తూ క్రమశిక్షణతో ఉంటూ చేయాలి అనింటే మనకి ఎవరైనా చెప్పి ఉండాలి అది పురాణాలు కథలు కాకపోవచ్చు.
(1:16:59) గురువైనా తల్లినా తండ్రయినా ఆ జీవన విధానంలో మనం ముందుకు వెళ్ళటానికి మనకి మార్గదర్శనం చేసేవాళ్ళు కావాలి. ఆ చేయటంలో పురాణాలకి అలాగే శాస్త్రాలకి వీటికి ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది. అవి ఏమిటి అనిఅంటే ఎక్స్పీరియన్సెస్ మన పూర్వకాలంలో వాళ్ళు సనాతన ధర్మాన్ని వాళ్ళు ఎలా పాటించారు ఎలా చేశారు అనేటువంటి దాన్ని మనం చదువుకుంటూ దానినుంచి మనం ఎక్స్పీరియన్సెస్ ని చూసుకుంటూ మనకు కావాల్సిన మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మన లైఫ్ స్టైల్ ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం చేస్తుంది.
(1:17:32) అమ్మాయి మధ్యకాలంలో పిల్లల్లో కూడా మనము లోన్లీనెస్ డిప్రెషన్ యంజైటీ ఓవర్ థింకింగ్ ఎక్కువగా కూడా చాలా ఎక్కువగా ఆలోచించి లేనిపోని అన్ని ఊహించేసుకొని ఈ యంజైటీ పానిక్ అటాక్స్ 10త్ క్లాస్ చదివేవాళ్ళు కూడా సెవెంత్ క్లాస్ చదివే వాళ్ళు కూడా ఇలాంటి పదాలు వాడడం అయితే చూస్తున్నాం ఈ పరిస్థితి అయితే వచ్చింది. దీనికి స్పిరిచువల్ గా మనం ఏ విధంగానైనా జయించగలమంటారా దీన్ని మనం ఎలా చూడాలని చెప్తాను నేను మీకు ఇప్పుడు తల్లిదండ్రులు గనుక చూస్తే మా పిల్లలండి ఫలానా క్లాస్ చదువుతున్నారండి బాగా చదువుకోవాలని ఆశీర్వదించండి ఇంజనీర్ కావాలో డాక్టర్ కావాలో ఇది కావాలో అని చెప్తారని మావాడు
(1:18:07) హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అవ్వాలండి అని అనేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. ఆ గోల్స్ అనేటువంటివి ఆ టార్గెట్స్ అనేటువంటివి ఎల్కేజీ పిల్లాడి దగ్గర నుంచి యుకేజీ పిల్లాడి దగ్గర నుంచి నువ్వు పెద్ద అయ్యేటప్పటికి ఇది కావాలి అది కావాలి చూడండి చాలామంది బాగా చదువుకున్నటువంటి వాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్న వాళ్ళు కనిపిస్తున్నారు అనుకుంటున్నటువంటివి సాధించలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్న వాళ్ళు కనిపిస్తున్నారు అనుకున్న గోల్‌ని సాధించిన తర్వాత కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం యంజైటీ ఇప్పుడు మీరు పిల్లల్లోనే అన్నారు
(1:18:34) పెద్దవాళ్ళలో ఉద్యోగస్తుల్లో కూడా కనిపిస్తున్నది ఇక్కడ ఏంటంటే దీనికి మన పూర్వకాలంలో లేవు ఇన్ని డిప్రెషన్లు ఇన్ని యంజైటీలు ఇన్ని లేవు వాళ్ళకి ఆ రోజుల్లో అంత ఒత్తిడి పెట్టిన వాళ్ళు లేరు అంత రుద్దిన వాళ్ళు లేరు హాయిగా జీవితాన్ని ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్ళడంలో ప్రకృతిలో కలిసి ముందుకు వెళ్ళేవాళ్ళు ప్రకృతితో కలిసి ముందుకు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు సూర్యుని చంద్రుని రోజుక ఎన్ని సార్లు చూస్తున్నారు ప్రజలు పిల్లలు చెప్పలేం మనకి సూర్యుడు చంద్రుడు ఇద్దరు డాక్టర్స్ ఒకాయనేమో ఫిజికల్ హెల్త్ ఇస్తాడు ఇంకొక ఆయనేమో మెంటల్ హెల్త్ ఇస్తాడు
(1:19:08) ప్రకృతితో అసలు మనం మమేకం అయ్యేటువంటి విషయంగా పిల్లల్ని చూడటం లేదు. ఇంకా ఉదాహరణకు దేవతలు ఉన్నారు ఇప్పుడు మీరు స్పిరిచువల్ గా ఏమైనా చేయొచ్చా అని అడిగారు. స్పిరిచువల్ గా చేయాలంటే చాలా మంది చెప్తారు మా పిల్లలకి సీట్లు రావాలండి మంత్రం చెప్తా బయ వాళ్ళు చేయలేరండి వాళ్ళ కోసం మేము చేస్తాం. రేపు పొద్దున వాళ్ళ కోసం వీళ్ళ ఎగ్జామ్స్ రాస్తారా రాయరుగా చదువులు మాత్రం వాళ్ళే చదవాలి మంత్రాలు మేము చేస్తాము అంటే నేర్పించటం అనేటువంటిది జీవితంలో ఏ కష్టం వచ్చినా ఏమి లేకపోయినా ఎలా బ్రతకాలి అని నేర్పించడం అనేటువంటిది మొదలుపెడితే ఈ డిప్రెషన్లు
(1:19:44) స్ట్రెస్‌లు యంజైటీలు తగ్గుతాయి ఈ నేర్పించేటువంటి క్రమంలో చక్కగా నేర్చుకోవడానికి ఒక సరస్వతీ దేవి స్తుతి ఒక హనుమంతుడి స్తుతి మీరు చూడండి హనుమంతుడు లేనటువంటి ఊరు ఎక్కడా ఉండదు అన్ని చోట్ల మనకి హనుమంతుడు ఉంటాడు ప్రతి గ్రామంలోనూ రాము రాముడు ఎలా ఉంటాడో హనుమంతుడు అట్లా ఉంటాడు. ఆయన చూపించి ఆయన ఎలా చక్కగా ఉన్నాడో చెప్పటం ఏ బ్యాట్ మన్ో హీ మ్యాన్ అక్కర్లే హనుమాన్ చాలు మనకి అవును హనుమంతుడిని గనుక చూపిస్తే ఆయన తన జీవితాన్ని ఎంత డిసిప్లిన్డ్ గా నడుపుకున్నాడు చిన్నప్పుడు ఆయన కూడా గొడవ చేశడు అల్లరి చేశడు అమ్మ బాబోయ్ ఏం పిల్లాడురా బాబోయ్ అనిపించాడు. కానీ
(1:20:19) ఇవాల్టికి కూడా మనం హనుమంతుని ఎందుకు స్మరించుకుంటున్నామ అంటే ఆయన జీవన జీవన విధానం అన్ని ఉన్నా కూడా ఆయన ఎంత వినయ విధేయతలతో ఉంటున్నాడో భక్తిలో మహోత్తమమైనటువంటి స్థానాన్ని ఎలా సంపాదించాడో ఆయన జీవితాన్ని ఆయన అంత చక్కగా ఎలా తీర్చిదిద్దుకున్నాడో ఇవన్నీ కూడా పిల్లలకు మనం కథలుగా చెబుతూ వాటితోటి పిల్లల్ని గనక మనం పెంచితే జీవితంలో వాళ్ళు అనుకున్నవి సాధించడం మాత్రమే కాదు అనుకోనివి జరిగినా కూడా వాటిని తట్టు పట్టుకొని నిలబడగలుగుతారు.
(1:20:50) అవునమ్మ అమ్మ ఇంకొకటి కొంతమంది ఇంట్లో పిల్లలు పేరెంట్స్ చాలా బాధపడుతూ ఉంటారు చెప్పిన మాట వినట్లేదు అని అసలు రూడ్ గా ఉండడం కానివ్వండి ఏమైపోతాడో అన్న భయం అనేది తల్లిదండ్రులకు బాగా ఉంటుంది ఏదో చాలా పెద్దగా కాదు చిన్న చిన్నగానే ఎందుకు ఇంత కోపము ఎందుకు ఇంత ఆవేశం ఇంత చిన్న వయసులో అని చెప్పేసి వీళ్ళని మనం స్పిరిచువల్ గా ఏ విధంగానా మార్చగలుగుతామా అమ్మ ఇప్పుడు నేను చెప్పినటువంటిదే మళ్ళీ చెప్తాను తల్లి ఇలా మన పురాణాలు మనకు సంబంధించినటువంటి దేవతలకు సంబంధించిన విశేషాలు చెప్పడంతో పాటుగా దాని పిల్లలు చక్కగా మారటానికి మాట వినటానికి కూడా కొన్ని మంత్రాలు కొన్ని
(1:21:26) శ్లోకాలు కొన్ని స్తోత్రాలు ఉన్నాయి. ప్రధానంగా దాంట్లో హనుమంతుడి మంత్రము, సరస్వతీ మంత్రము, జ్వాలామాలిని అని ఒక దేవతా మంత్రము ఇవి కూడా చెప్పబడ్డాయి. అయితే మంత్రంతో పాటుగా మంత్రం అనేటువంటిది కాంప్లిమెంట్ చేస్తుంది చేసేటువంటి పనిని ముందుకు తీసుకువెళ్ళటానికి. దాంతో పాటుగా తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలకు ఇవ్వవలసినటువంటివి ఇవ్వటం ఇవ్వకూడనివి ఆపేయటం గనుక చేసి జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తే మార్పు అనేటువంటిది కచ్చితంగా వస్తుంది ఇక్కడ చాలా మందిలో వచ్చింది కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను.
(1:21:57) మీ జీవనశైలి మొత్తం కూడా నాకు చెప్పారు కదా అసలు ఎలా ఈ ప్రయాణం అంతా కూడా జరిగింది అని చెప్పేసి మీకేమైనా ఇంకా అంబిషన్స్ ఉన్నాయా అమ్మా గోల్స్ ఉన్నాయా అంటే ఏమన్నా మార్చాలి అనుకుంటున్నారా ఏమన్నా సందేశం ఇవ్వాలఅనుకుంటున్నారా సమాజానికి నేను తల్లి అసలు నేను చెప్పాలంటే నేను ఇవన్నీ కూడా వదిలేసి సన్యాసం తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా వదిలేసి తపస్సు చేసుకొని వెళ్దామని అనుకున్నాను.
(1:22:21) అయితే మా గురువు గారు ఒక మాట అన్నారు నువ్వు వెళ్లి ఎక్కడో వెళ్లి తపస్సు చేసుకుంటే నీకెందుకు అంత తపస్శక్తి ఏం చేసుకుంటావ్ తపస్శక్తి తోటి తపస్ మన తపస్శక్తి అనేది ఉన్నటువంటిది 10 మందికి ఉపయోగించడానికి కావాలిప మందికి మనం మార్గోపదేశం చేయాలి వాళ్ళ జీవితాలను బాగు చేసుకోవాలి అనేటువంటి సంకల్పం వారు చెప్పటం దాన్ని అంగీకరించడం జరిగింది నేను అలాగే ఇక్కడ ఈ దేవాలయ నిర్మాణం కూడా కాళీదేవి ఆమె అడిగింది ఫలానా చోట ఫలానా గుర్తులతో నాకు దేవాలయ నిర్మాణం కావాలి అని చెప్పి ఇంత దేవాలయం నిర్మించడం అనేటువంటిది ఒక సన్యాసిని వల్ల ఎలా సాధ్యంవుతుంది అప్పుడు
(1:22:56) వారాహి దేవి వచ్చి నేను వచ్చి ఇక్కడ నిర్మాణం చేయిస్తాను అని అన్నది. అలా ఇక్కడ వారాహి దేవిని ప్రతిష్టించడం జరిగింది. ఇక్కడ దేవాలయం కట్టేటువంటి సమయంలోనే రాత్రిపోటు అందరికీ కూడా ఒక వరాహం తిరుగుతూ కనిపించేది ఇక్కడ ఈ మన క్షేత్రంలో అలా ఈ శక్తిపీఠం వచ్చింది. ఈ శక్తిపీఠం ద్వారా ఇవాళ కొన్ని వేల లక్షల మంది జీవన గమనం మారుతూ ఉన్నది వాళ్ళ జీవితాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి.
(1:23:22) అమ్మ ఆరాధన అలాగే ధర్మ రక్షణ అనేటువంటిది ధ్యేయంగా పెట్టుకొని నేను ముందుకు వెళ్తున్నాను. అందులో ప్రధానంగా మహిళలను గౌరవిస్తే మహిళలను పూజిస్తే అమ్మ అనుగ్రహం త్వరగా లభిస్తుంది అనేటువంటి సూత్రంతో నారీవ నారాయణి అనేటువంటి సూత్రాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది కాబట్టి నా ఆశయమైన నా సంకల్పమైనా ఎలా ఉంటుంది అనిఅంటే పరమేశ్వరి ఏది నిర్ణయిస్తుందో ఏది నిర్దేశిస్తుందో అది చేయటమే నా సంకల్పము అది చేయటమే నా ధ్యేయము ఆమె సంకల్పం ఎట్లా ఉంటుంది అంటే మానవ సేవ మాధవ సేవ ఈ రెండు కూడా ఉంటాయి.
(1:24:04) ఆ సంకల్పంతోటే ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. కచ్చితంగా అమ్మ చాలా బాగా చెప్పారు మీరు ఎంతో మందికి ఆదర్శం ఇంకా స్ఫూర్తి అని చెప్పేసి నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అమ్మవారి ఆశీస్సులు తల్లి అమ్మ అందరూ అంటుంటారు చనిపోయిన తర్వాత ఇంకో జన్మ ఉంటుంది అని చెప్పేసి నిజంగా ఇవన్నీ ఉంటాయమ్మ జన్మలు ఉంటాయా ఉంటాయని శంకరాచార్యుల వారు కూడా చెప్పారు కదా తల్లి పునరపి జననం పునరపి మరణం అని చెబుతూ పుట్టటము మరణించటము అనేటువంటిది ప్రతి జీవికి ఉంటుంది ఆ ప్రతి జన్మకి కూడాను పూర్వజన్మ పరజన్మ అనేటువంటివి ఉంటాయి అని మన శాస్త్రం మనకు చెప్తున్నది ఇప్పుడు నేను ఇందాక ఒక మాట
(1:24:38) చెప్పాను కష్టాలు ఎందుకు వస్తాయి అనిఅంటే పూర్వజన్మలో చేసుకున న్నటువంటి పాపపు పుణ్యాలను అనుసరించి మనకి కష్టాలు బాధలు సుఖాలు సంతోషాలు వస్తాయి అని ఉన్నది అంటే ఇంతకుముందు ఒక జన్మ ఉన్నదనే దాని అర్థం అవే చెబుతూ ఉన్నది భగవద్గీతలో కృష్ణుడు అంటాడు అర్జునుడితోటి నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయి నాకు అవన్నీ గుర్తున్నాయి నీకు గుర్తులేదు అని అంటాడు అంటే భగవంతుడైనటువంటి కృష్ణుడు కూడా పూర్వజన్మలు ఉన్నాయి అని చెప్పి చెప్పాడు మనకి గజేంద్ర మోక్షంలో కూడాను గజేంద్రుడు పూర్వజన్మలో ఒక రాజు అని ఆ కథ కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. అట్లా మనకి పూర్వజన్మలు
(1:25:16) ఉన్నాయి అనేటువంటిది దేవతలు సైతం జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారు సైతం చెప్పటం అనేటువంటిది జరిగింది. అయితే మనకు మన పూర్వజన్మ తెలుసుకోవాలనేటువంటిది అందరికీ కోరిక ఉంటుంది. కొంతమందికి నాడీ జాతకాల్లో చెప్పటం గానీ కొంతమందికి సాధన ద్వారా తమ పూర్వజన్మలు తాము తెలుసుకునేటువంటి శక్తి రావటం గాని జరుగుతూ ఉంటుంది.
(1:25:38) కాబట్టి పూర్వజన్మలు ఉన్నాయి కొంతమందికి పూర్వజన్మ విశేషాలు గుర్తుకు రావటం పేపర్స్ లో కూడా ఒకటి రెండు సార్లు వేసారు. పూర్వజన్మలో నేను ఫలానా చోట ఉన్నాను ఫలానా దగ్గర ఉన్నాను ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని చిన్న పిల్లలు చెప్పటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి పూర్వజన్మలో ఉన్నాయి అని నమ్మటంలో ఎటువంటి సందేహం పడాల్సినటువంటి అవసరం లేదు.
(1:25:58) అయితే వచ్చే జన్మ ఎలా ఉంటుంది మనది ఇప్పుడు ఎలాగో ఈ జన్మ మన చేతిలో లేదు వచ్చే జన్మ అయినా మనకు కావలసినట్టుగా ఉంటుందా అంటే దానికి ఒక మార్గం చెప్పారు. ఏ వ్యక్తి అయినా సరే మరణించేటువంటి సమయంలో తాను ఏది కావాలని కోరుకుంటాడో దేని మీద వ్యామోహంతోటి ఉంటాడో అదే మనకి మరుజన్మలో లభిస్తుంది. అని చెప్తారు జడభరతుడు అని ఒక ముని కథ చెబుతూ ఆ ముని అందరిని వదిలేసుకొని వచ్చినటువంటి ముని ఒక లేడీ జింక పిల్లను పెంచుకుంటాడు.
(1:26:30) చివరి క్షణాల్లో ఆయనకి తను చేసిన తపస్సు గుర్తుకు రాదు తను చేసినటువంటి దైవ నామస్మరణ గుర్తుకు రాదు ఆ లేడీని జింకను చూసుకుంటూ అయ్యో నేను మరణించాక ఇది ఏమైపోతుందో అని మరణించాడు. మరుజన్మలో అతడు జింకగా పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ మానవజన్మ పూర్వజన్మ సంస్కారం వల్ల పూర్వజన్మలు గుర్తుండటం తర్వాత అతడు దివ్య స్థితికి వెళ్ళటం అనేటువంటిది జరిగింది.
(1:26:52) ఇవన్నీ కూడా మన పురాణాలు మన చరిత్ర మనకు చెప్తున్నటువంటి సంఘటనలు కనుక పూర్వజన్మలు అనేటువంటివి ఉన్నాయి మరణించేటువంటి సమయంలో మనం ఏం కోరుకుంటామో ఏది భావన చేస్తామో అది మరుజన్మలో మనకు లభిస్తుంది. మరి అప్పుడు ఏం కోరుకుంటాము అసలు అప్పుడు అనారోగ్యంతో ఉంటాము ఆరోగ్యంతో ఉండిపోతాము కోమాలో ఉండిపోతాము ఎట్లా ఏంటి అనింటే రోజు మీరు పూజ చేసేటప్పుడు రోజు మీరు సాధన చేసేటప్పుడు ఒక రెండు నిమిషాలు వచ్చే జన్మలో నాకు ఇలా ఉండాలి నాకు ఇలా కావాలి అని ధర్మబద్ధమైన కోరిక ప్రతిరోజు దేవతను కోరుకోండి దేవత గనుక కరుణిస్తే అది మీకు లభిస్తుంది అని చెప్తున్నది మన శాస్త్రం
(1:27:31) అమ్మ జన్మలతోనే నా వల్ల కాదు అసలు ఇంక నేను మోక్షం కలగాలి నాకు అంటుంటారు. మరి మోక్షం అంటే అసలు ఆ కోరిక కోరని వాడంటూ ఎవరు ఉండరు తల్లి ఏ చిన్న కష్టం వచ్చినా చిచ్చి వెధవ జన్మ పోతే బాగుండు హాయిగా మోక్షం కైలాసానికో అమ్మవారి లోకానికో వెళ్ళొచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ మోక్షం కావాలి అంటే పాప పుణ్యాలు రెండు లేనటువంటి స్థితి కావాలి.
(1:27:53) అంటే అన్ని మంచి పనులే చేసావ అనుకో అమ్మ మంచి జన్మ వస్తుంది ఇక్కడ కాకపోతే మోక్షం అంటే దేవత దగ్గరికి వెళ్ళటం అంటే మరుజన్మ లేకపోవటం ఆ మోక్షంలో కూడా మూడు నాలుగు రకాలు చెప్పారు సారూప్యము సాలోక్యము సాయుదజ్యము ఇవి చెప్పారు అంటే ఆ దేవత లోకానికి వెళ్ళటం దేవత దగ్గరికి ఉండగలగటం దేవత దగ్గరికి వెళ్లి దేవత ఒక రూపాన్ని పొందగలగటం అంటే దేవత లాగానే మనకు కూడా దేవత పక్కన ఉన్నట్టుగా మనకు ఆ రూపం వస్తుందట సాయుదజ్యము దేవతలో కలిసిపోవటం ఇవన్నీ కూడా చెప్పారు సాలోక్యం అంటే దేవత లోకంలో ప్రవేశించటం సామీప్యం అంటే ఆ దేవత కొంచెం దగ్గరగా వెళ్ళగలగటం సారూప్యం అంటే ఇంకా ఎక్కువ ఉంటే దేవత తన
(1:28:33) రూపాన్ని ఇస్తుంది. సాయుజ్యం అంటే అసలు ఆ దేవతలో కలిసిపోవటం ఈ నాలుగు రకాలైనటువంటి మోక్షాలు చెప్పారు. అయితే ఇవి రావాలంటే పాపము పుణ్యము రెండు ఉండకూడదు. అవి ఎలా జరుగుతాయి ఎలా సాధ్యపడతాయి అంటే తపస్సు చేయండి తపస్సు వల్ల సాధ్యపడుతుంది అని అన్నారు మన పెద్దవాళ్ళు. మనకి బృందావనంలో ఒక కథ ఉన్నది ఒక భక్తుడు కృష్ణుడి కోసం తపస్సు చేశాడు.
(1:28:57) ఉమ్ తపస్సు చేస్తే కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు నాయనా ఏం కావాలి కోరుకో అంటే నాకు మోక్షం కావాలి స్వామి నీకు మోక్షం ఎట్లా ఇచ్చేదయ్యా నీకు ఇంకా ఏడు జన్మలు నువ్వు అనుభవించవలసినంత కర్మ నీకు ఉన్నది అది పుణ్యమైనా పాపమైనా పోనీ వచ్చే జన్మలో ఇస్తాలే అన్నాడు స్వామి ఇదిఏమనా సమంజసమా ఎన్ని కష్టాలు పడి తపస్సు చేస్తే నీ దర్శనం నాకు కలిగింది మళ్ళీ వచ్చే జన్మలో నేను పుట్టాలి నీ భక్తుడిని అవ్వాలి నీ మీద నమ్మకం కలగాలి నీకోసం తపస్సు చేయాలి అనిపించాలి చేసినా నువ్వు కనిపించాలి అనుగ్రహించలి వరం ఇవ్వాలి ఇవన్నీ జరుగుతాయా స్వామి నాకు ఇప్పుడే కావాలి నువ్వే ఏదో ఒక మార్గం చెప్పు
(1:29:32) అన్నాడు అయితే ఆయన ఒక మాట అన్నాడు నీకు ఏడు రాత్రుల పాటు ఏడు కలలు వస్తాయి ఏడు జన్మలలో నువ్వు అనుభవించవలసినటువంటి కర్మ ఫలితాన్ని ఏడు రాత్రులలో ఏడు కలల ద్వారా నువ్వు అనుభవిస్తావు అనుభవించిన తర్వాత ఆ కర్మ ప్రక్షాలన అయిపోయి నువ్వు మోక్షానికి వెళ్తావు అని వరమించాడు స్వామి అనుకున్నాడు కాబట్టి ఏడు రాత్రులలో పూర్తఅయిపోయింది మోక్షానికి వెళ్ళాడు ఆ భక్తుడు కాబట్టి కాబట్టి మోక్షం అనేటువంటిది కోరుకోవడం తప్పు కాదు కానీ దేవత అనుగ్రహాన్ని మనం సంపాదించగలగాలి.
(1:30:02) ఆ దేవత అనుగ్రహిస్తే మనం మోక్షానికి వెళ్ళగలుగుతాం. అయితే ఇంకొక షార్ట్ కట్ ఉంది దీనికి ధ్యానమూలం గురోర్ మూర్తిహి పూజా మూలం గురోహ పదం మంత్రమూలం గురోర్ వాక్యం మోక్ష మూలం గుర కృప అని చెప్పి ఇప్పుడు నేను పైనుంచి చివరివరకు మొదటి నుంచి చివరి వరకు చెప్పినటువంటి విషయాలన్నిటికీ కూడాను ఒకటే సూత్రం తొందరగా కావాలంటే గురు కృప నీ గురువును నువ్వు వెతుక్కో సద్గురువును చేరుకో ఆ గురుకృప నీ మీద గనుక ఉంటే గురు కృప వల్ల దేవతానుగ్రహం తొందరగా వచ్చి నీకు మోక్షం కూడా లభిస్తుందిఅని అని చెప్తున్నది మన శాస్త్రం.
(1:30:36) చాలా చక్కగా చెప్పారమ్మ ఈరోజు మాకున్న సందేహాలన్నిటిని కూడా మీ విలువైన సమయాన్ని కేటాయించి మా సందేహాలని నివృత్తి చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు అమ్మవారి ఆశీసులు తల్లి
No comments:
Post a Comment