😱🔥 ఈ 15 గుణాలు మీలో ఉంటే మీరు సాధనకు సిద్ధం 🧘 Qualities That' says you are in a spiritual path 🚨
Author Name:My Journey Sg
Youtube Channel Url:https://www.youtube.com/@SaiGaneshRudrakshala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4eKSix_imI4
Transcript:
(00:06) అసలు మీలో ఎంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో మీకు తెలుసా? 15 స్పష్టమైన సంకేతాలు అండ్ వాటి లోతైన వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను స్పిరిచువల్ పాత్ లో ఉన్నాను అని ఎలా తెలుసుకోవాలి? అయితే ఆధ్యాత్మికత అనేది మతం కాదు. దాని అర్థం అది కూడా కాదు. అది ఒక అంతర్ముఖ ప్రయాణం మన ఆలోచనలు భావాలు చైతన్యం ఇవి ఎక్కడి నుండి వచ్చాయి జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం భారతీయ ఋషులు వేల సంవత్సరాల క్రితమే ఈ అన్వేషణను ప్రారంభించారు.
(00:41) భగవద్గీతలో జీవితం యొక్క అసలు ఉద్దేశం ఆత్మజ్ఞానం అని చెప్పబడింది. ఉపనిషత్తులు ఇలా చెబుతున్నాయి. ఆత్మనే సత్యం. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు కనిపించే ప్రతి సంకేతాన్ని లోతుగా అర్థం చేసుకుందాం. నెంబర్ వన్ జీవితంపై లోతైన ప్రశ్నలు మొదలవుతాయి. ఒకరోజు అకస్మాత్తుగా నేను ఎవరు అనే ప్రశ్న జీవితాన్ని మార్చేస్తుంది. జీవితం యొక్క అసలు అర్థం ఏమిటి? సంతోషం అంటే ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి.
(01:11) ముందు ఈ ప్రశ్నలు అవసరం అనిపించకపోయినా ఇప్పుడు అవి మీ మనసులో తిరుగుతూ ఉంటాయి. ఇది అసలు ఆధ్యాత్మిక మేలుకొలుపుకి ప్రారంభం మనసు బాహ్య ప్రపంచం నుండి లోపలికి మల్లుతుందని అర్థం. డబ్బు స్థానం పేరు ప్రఖ్యాతలు వీటన్నిటికంటే లోతైన అర్థం తెలుసుకోవడం కోసం మనసు పరితపిస్తుంది. మనసు నీకోసం వెతుకుతుంది. ఇది ఒక సంకేతం. మీ చైతన్యం అభివృద్ధి చెందుతుంది అని ఒక సంకేతం.
(01:37) నెంబర్ టూ ఒంటరిగా ఉండాలని అనిపించడం. ఇంతకుముందు ఎప్పుడు గుంపుల్లో ఉండాలని అనిపించినా ఇప్పుడు ప్రశాంతత కావాలని అనిపిస్తుంది. ఒంటరిగా కూర్చొని ఆలోచించడం ప్రకృతితో నడవటం నిశబ్దాన్ని ఆస్వాదించడం ఇష్టమవుతుంది. ఇది డిప్రెషన్ కాదు ఇది ఇంట్రోస్పెక్షన్ మనసు లోపలికి ప్రయాణిస్తుంది అని అర్థం. మీరు మీతో మీ సమయాన్ని గడపడం ప్రారంభిస్తున్నారని అర్థం. ఈ దశలో మనసు శబ్దం తగ్గుతుంది.
(02:01) ఆత్మస్వరం వినిపించడం మొదలవుతుంది. నెంబర్ త్రీ ప్రకృతితో అనుబంధం పెరగడం. ప్రకృతిలో ఉండగా ఒక ప్రత్యేకమైన శాంతి మీకు అనిపిస్తుంది. మీరు ఎండకి నిలిచున్న వానకి తడిచిన సముద్ర అలాలని విన్నా అది మీ శక్తిని ప్రకృతితో సమన్వయం అవుతుంది అని సంకేతం గాలి, వర్షం పక్షుల స్వరం ఇవి మిమ్మల్ని లోపలికి తీసుకువెళ్తాయి. ప్రకృతి మీ గురువుగా మారుతుంది.
(02:27) మీరు ప్రతి జీవిని గౌరవించడం ప్రారంభిస్తారు. నెంబర్ ఫోర్ విలువలు మారటం ముందు విజయమే ముఖ్యమని అనిపించవచ్చు. కానీ ఇప్పుడు శాంతి సత్యం నిజాయితి ముఖ్యమవుతాయి. మీరు ఇంప్రెస్ చేయడం మానేస్తారు. మీరు ఆథెంటిక్ గా ఉండాలని నిర్ణయించుకుంటారు. మీలో అహంకారం క్రమంగా తగ్గుతుంది. ఇది మనలో వచ్చే మార్పులు ఇది మీరు కూడా అనుభవిస్తారు మీకు కూడా అర్థంవుతుంది.
(02:51) నెంబర్ ఫైవ్ భావద్వేగ శుద్ధి ఎమోషనల్ క్లెన్సింగ్ కొన్ని రోజులు అకస్మాత్తుగా బాధలు బయటకు రావచ్చు. అంటే మీ పాత జ్ఞాపకాలు గుర్తుకు రావచ్చు ఏడుపు రావచ్చు తీరని లోటు ఉండిపోవచ్చు ఇది బలహీనత కాదు ఇది శుద్ధి ప్రక్రియ మనసులో దాచుకున్న బాధలు బయటకి వస్తాయి. ఇన్ని రోజులు మీరు అట్టి పెట్టిన బాహోద్వేగాలన్నీ ఒక్కసారిగా బయటకి వస్తూ ఉంటాయి.
(03:17) శరీరం మనసు ఆత్మ ఈ మూడు శుభ్రమవుతున్న ప్రాసెస్ ఇది. అయితే ఎమోషనల్ క్లెన్సింగ్ నెంబర్ ఆరు అంతరాత్మ బలపడటం ఇన్షన్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు లోపల ఒక స్వరం గైడ్ చేస్తుంది. మీరు ఆ స్వరాన్ని నమ్మటం ప్రారంభిస్తారు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యమైన దశ. మీరు బయట గురువుల కంటే లోపల గురువునే వినడం ప్రారంభిస్తారు. బుద్ధ కూడా చెప్పిన మాట ఇదే నీకే నీవు దీపం అవ్వాలి అని.
(03:44) నెంబర్ సెవెన్ పాత అలవాట్లు వదిలిపోవటం ముందు కోపం అసూయ వ్యసనాలు ఎక్కువగా ఉండవచ్చు కానీ ఇప్పుడు అవి సహజంగానే తగ్గిపోతాయి. ఇది బలవంతంగా కాదు అవి అవసరం లేదని మీలోని అవగాహన చెబుతుంది. ఇది ఆత్మస్థాయి పెరుగుతుంది అన్న సంకేతం నెంబర్ ఎయిట్ సింక్రోనిసిటీస్ అంటే మీరు ఒక విషయం ఆలోచిస్తే అదే విషయం మళ్ళీ మళ్ళీ మీ జీవితంలో కనిపించవచ్చు.
(04:10) ఒకే సంఖ్యలు కనిపించటం ఒకే సందేశం వివిధ మార్గాల్లో రావటం ఇవి మీ చైతన్యం విశ్వంతో సమన్వయం అవుతుందన్న సంకేతం నెంబర్న కరుణ పెరగటం ముందు మీరు జడ్జ్ చేసిన వ్యక్తులపైన ఇప్పుడు కరుణ కలుగుతుంది. వారి బాధను అర్థం చేసుకోవాలని అనిపిస్తుంది. సహాయం చేయాలన్న కోరిక వస్తుంది. ఇది హృదయం విస్తరిస్తుందన్న సంకేతం. మీకే తెలియకుండా మీ క్యారెక్టర్ లోపల మిమ్మల్ని మోల్డ్ చేసుకుంటుంది.
(04:36) నెంబర్ 10 ధ్యానం వైపు ఆకర్షణ ధ్యానం చేయాలని సహజంగానే అనిపిస్తుంది. కళ్ళు మూసుకొని లోపలికి వెళ్ళాలని అనిపిస్తుంది. ధ్యాన సమయంలో కళ్ళ మధ్య ఒత్తిడి శరీరంలో శక్తి ప్రవాహం లోపల వెలుగు అనుభవం. ఇవి సహజమైన అనుభవాలు. నెంబర్ 11. భయం తగ్గటం మరణం, భవిష్యత్తు, అపజయం ఇవన్నీ అంతగా భయంకరంగా కనిపించవు. జీవితం ఒక ప్రయాణం అని అర్థంవుతుంది.
(05:02) మీరు ప్రెజెంట్ మూమెంట్ లో జీవించడం నేర్చుకుంటారు. నెంబర్ 12 సత్యం కోసం తపన మీరు అసత్యాన్ని తట్టుకోలేరు. నాటకాలు ఫేక్ సంబంధాలు మానేస్తారు. మీరు నిజాయితీని మాత్రమే కోరుకుంటారు. ఈ రిలేషన్షిప్స్ లో మీ ఫ్రెండ్స్ దగ్గర మీ భార్య దగ్గర మీరు నిజాయితీగానే ఉంటారు. ఎవరైనా ఫేక్ గా ఉంటే వారికి దూరంగా ఉంటేనే మంచిది అని అనుకుంటారు. నెంబర్ 13.
(05:26) మీ శక్తిలోని మార్పులు. కొన్ని రోజులు అలసటగా అనిపించవచ్చు. కొన్ని రోజులు అపరహమైన ఉత్సాహం ఉంటుంది. ఇది శక్తి స్థాయి మార్పులకు కారణం. శరీరం కొత్త చైతన్యానికి అలవాటు పడుతుంది అని దీని అర్థం. నెంబర్ 14 క్షమించగలడం ముందు ద్వేషించిన వారిని కూడా క్షమించగలుగుతారు. క్షమించడం అంటే వారిని సమర్ధించడం అని అర్థం కాదు మీ మనసును విముక్తి చేయడం.
(05:50) నెంబర్ 15 మీరు మీరే కావడం చివరికి అత్యంత ముఖ్యమైన సంకేతం మీరు మీరే అవుతారు. ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడకుండా జీవించడం ప్రారంభిస్తారు. మీరు మీ విలువలు తెలుసుకుంటారు. నిజమైన జీవితాన్ని గడపడం ప్రారంభిస్తారు. స్వామి వివేకానంద చెప్పినట్టు ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య, వహన్ని బోధత. మీరు ఈ సంకేతాలలో నాలుగు లేదా ఐదు అయినా అనుభవిస్తే మీ ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమైందని అర్థం.
(06:17) ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని వదిలివేయడం కాదు ప్రపంచంలోనే ఉండి లోపల ప్రశాంతంగా ఉండటం
No comments:
Post a Comment